Toxic experiment
-
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
'విష ప్రయోగం వల్లే చక్రి మరణం'
అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన సతీమణి శ్రావణి భర్త కుటుంబీకులే కారణమని ఆరోపణ హైదరాబాద్ : తన భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆయనపై విష ప్రయోగం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని చక్రి సతీమణి జిల్లా శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. గత నెల 15న తన భర్త మృతికి ఆయన కుటుంబ సభ్యులు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను వేధిస్తున్న అత్త, ఆడపడుచులు, వారి భర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్, ఆడపడుచులు వాణిదేవి, కృష్ణప్రియ, వారి భర్తలు కె. లక్ష్మణ్‌రావు, వి.నాగేశ్వర్‌రావులతో పాటు వారి సన్నిహితులు కె.ఆదర్శిని, గాలి గిరి, గాలి ప్రత్యూష తదితర 9 మందిపై ఐపీసీ సెక్షన్ 498ఏ, 506, రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. తన భర్తపై గత నెల 14వ తేదీ రాత్రి విషప్రయోగం జరిగిందంటూ శ్రావ ణి తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. చక్రి వ్యక్తిగత బ్యాగుతో పాటు ఆఫీస్ తాళాలు, మెడలో గొలుసులు, రెండు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డు, చెక్‌బుక్ అన్నీ తన అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. భర్తకు చెందిన ఆడి కారు కూడా వారి వద్దే ఉందని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని భర్త మరణంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటిక నుంచి చక్రి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోకుండా అడ్డుకుంటున్నారని, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. డెత్‌సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సినీ పెద్దలు దాసరి నారాయణ రావు చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తులను లాక్కోవడానికి యత్నిస్తున్నారని, ఒంటరిని చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎస్సై మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లవిపై విషప్రయోగం..?
- పోస్టుమార్టం వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రెండ్రోజుల్లో తేలనున్న నిజం హుజూరాబాద్ :పట్టణంలోని విద్యానగర్‌లో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నామని పల్లవిపై విషప్రయోగం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఫ్యాన్ రెక్కకు ఉరి వేసుకుని మృతిచెందిందని ఆమె భర్త రాజు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. పల్లవి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్యచేసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని మృతురాలి తండ్రి నర్సింహులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి శరీరంపై గాయాలు ఉండటం, ఈ సంఘటనపై అనుమానాలు తలెత్తడంతో మృతురాలి బంధువులు రాజు ఇంటిపై దాడిచేశారు. ఆదివారం పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మృతదేహాన్ని పరిశీలన చేసి ఆ తర్వాత వైద్యబృందం పోస్టుమార్టం చేశారు. పల్లవి నోరు, ముక్కు నుంచి తెల్లని నురుగలు రావడం, ఆమె శరీరంలోని కొన్ని భాగాలు నల్లగా మారడంతో వైద్యులు మరింత దృష్టి సారించినట్లు తెలిసింది. తలపై వెంట్రుకలు తొలగించి అణువణువు పరీక్షించినట్లు సమాచారం. అయితే నురగలు కక్కడంతో పల్లవిపై విషప్రయోగం జరిగిందని ఆమె తరపు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యులు పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. మరో రెండు రోజులు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు... పల్లవిని చంపారని ఆరోపిస్తూ రాజు ఇంటిపై దాడిచేసి, వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. నామని రాజు బావ పేరాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందికట్ల మదుసుధన్, బచ్చు శివశంకర్, దీకొండ కృష్ణ, దీకొండ రాజేందర్, శ్రీనివాస్, తిరుపతి, నర్సమ్మ మరికొందరు మహిళలపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.