Tractor rams
-
ట్రాక్టర్ బీభత్సం: ఇద్దరి మృతి
-
ట్రాక్టర్ బీభత్సం: ఇద్దరి మృతి
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలోని కాజీపేట మండలం దుంపలగట్టు సమీపంలో సోమవారం ఉదయం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.