Traditional professions
-
‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలి్పంచాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సరి్టఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కలి్పస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబి్ధదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్ పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబి్ధదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. నగరాల్లో ‘పీఎం ఈ–బస్ సేవ’ పర్యావరణ హిత రవాణా సాధనాలకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ–బస్ సేవ’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రవాణా సేవలు వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో ఎలక్ట్రిక్సిటీ బస్సులను ప్రవేశపెట్టడమే ఈ కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10,000 ఈ–బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57,613 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు సమకూరుస్తుందని వివరించారు. హరిత పట్ణణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ రైల్వే శాఖలో 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 35 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న లైన్ కెపాసిటీ పెంచుతారు. మన కళాకారులకు మరింత ప్రోత్సాహం: మోదీ పీఎం విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశంలో నైపుణ్యాలకు, సాంస్కృతి వైవిధ్యానికి కొదవ లేదన్నారు. మన విశ్వకర్మల్లోని వెలకట్టలేని నైపుణ్యాలను ముందు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
తిరుమల లడ్డూ కౌంటర్లలో తాటాకు బుట్టలు!
తిరుమల: ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేసింది. వాటి స్థానంలో బయో డీ గ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో టీటీడీ తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. తద్వారా తాటి చెట్టులను పెంచే వారికి ఆదాయంతోపాటు, తాటాకు బుట్టలను తయారు చేసే సంప్రదాయ వృత్తి కళాకారులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. -
సంప్రదాయ వృత్తుల్లోనే ఆరు లక్షల మంది
అత్యధికంగా 91 వేల మంది లాండ్రీ వర్కర్లు 85 వేల మంది గీత కార్మికులు.. 75 వేల మంది కార్పెంటర్లు పని చేసే వయసులో ఉన్నవారు మొత్తం 2.39 కోట్ల మంది సమగ్ర సర్వేలో తేలిన లెక్కలివీ.. కులాల వారీగా వృత్తిదారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్ కుల వృత్తులకు చేదోడుగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. వృత్తిదారులకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఆధునిక వసతులు కల్పిస్తే.. గ్రామాల ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయని రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన సామాజిక ఆర్థిక విశ్లేషణలు స్పష్టం చేశాయి. దీంతో వారి అభ్యున్నతి కోసం పలు పథకాలు రచించింది. ప్రధాన వృత్తులకు అనుబంధంగా కులవృత్తులు, వృత్తిదారులు, చిన్నాచితక పనులు చేసుకొని బతికే వారిని లక్ష్యంగా ఎంచుకుంది. సమగ్ర సర్వే సందర్భంగా ప్రభుత్వం 15 నుంచి 59 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారందరినీ పనిచేసే వయసు వారీగా గుర్తించి.. వృత్తిదారుల సమగ్ర వివరాలను సేకరించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలివీ.. రోజువారీ కూలీలే ఎక్కువ రాష్ట్రంలో పనిచేసే వారిలో రోజువారీ కూలీలే అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 2.39 కోట్ల మంది పని చేసే వయసులో ఉండగా.. వారిలో 31 శాతానిపైగా రోజువారీ కూలీలున్నారు. 29 శాతంతో రెండో స్థానంలో వ్యవసాయ కార్మికులున్నారు. 11 శాతం మంది సొంత వ్యవసాయం చేసుకునే రైతులున్నారు. వీరిది మూడో స్థానం. బీడీ కార్మికులు 4 శాతం మంది ఉన్నారు. తర్వాతి స్థానంలో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులు, వలస కూలీలు, ఇతర వృత్తులు, ఇతర నైపుణ్యాలున్న వారున్నారు. దాదాపు లక్ష మంది ఇతర దేశాల్లో పని చేస్తున్నారు. లాండ్రీ వర్కర్లు అత్యధికం రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా సంప్రదాయ వృత్తులో ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో ఉన్నది లాండ్రీ వర్కర్లు (రజకులు). గీత కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో చర్మకారులు, వడ్రంగులు, చేనేత కారులు, క్షురకులు, జాలర్లు, దర్జీలు, బంగారం పనివారు(స్వర్ణకారులు), పశుపోషకులు, కమ్మర్లు, కుమ్మర్లు, లోహ విగ్రహాలు తయారు చేసేవారున్నారు. సంప్రదాయ వృత్తులన్నీ కులాలతో ముడిపడి ఉన్నవి కావటంతో సంక్షేమ కార్యక్రమాల్లో వీరిని లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తోంది. యాదవులను, గంగపుత్ర, ముదిరాజ్ బోయ కులాలకు ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకం, చేపల పంపిణీ పథకాలను అమలు చేస్తోంది. రజకులు, నాయిబ్రాహ్మణుల పథకాలకు రూ.500 కోట్లు కేటాయించింది. వీటితో రజకులకు వాషింగ్ మిషన్లు, డ్రయర్లు, ఐరన్ బాక్సుల పంపిణీ, దోబీఘాట్ల నిర్మాణంతో పాటు నాయీ బ్రాహ్మణులకు మోడర్న్ సెలూన్లను నెలకొల్పే పథకాలకు రూపకల్పన చేస్తోంది. విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు రూ.200 కోట్లు, బట్టలు కుట్టే మేర, గీత కార్మికులకు, కుమ్మరి పనివారికి పరికరాల పంపిణీ, ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1000 కోట్లు, చేనేతలకు రూ.1,200 కోట్లు కేటాయించింది. వలస వెళ్లింది 93 వేల మంది రాష్ట్రం నుంచి దాదాపు 93 వేల మంది ఇతర దేశాల్లో పని చేసేందుకు వలస వెళ్లారు. వలస జీవులతో పాటు నిరుద్యోగుల సంఖ్య భారీగానే ఉందని సర్వేలన్నీ వెల్లడిస్తున్నాయి. అసలు ఏ పని చేయకుండా ఉన్న కేటగిరీలో దాదాపు 8.36 లక్షల మంది ఉన్నారు. వీరందరూ నిరుద్యోగులని, నిరుద్యోగం కారణంగానే తాము ఏ పని చేయడం లేదని చెప్పుకున్నట్లు ఇటీవల ఆర్థిక, సామాజిక సర్వే సైతం వెల్లడించింది. సమగ్ర సర్వే వివరాల ప్రకారం ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారంటే.. లాండ్రీ వర్కర్లు: 91388 గీత కార్మికులు: 85563 వడ్రంగులు: 75648 చేనేత కారులు: 56371 కౌలు వ్యవసాయం: 52845 పాడి పశువుల పోషకులు: 47458 నాయిబ్రాహ్మణులు: 42751 జాలర్లు: 36244 దర్జీ పని చేసే వారు: 30680 స్వర్ణకారులు: 25779 పారిశుద్ధ్య పనివారు: 19476 కమ్మరి పని చేస్తున్న వారు: 18841 కళాకారులు: 14256 కుమ్మరి పని చేస్తున్న వారు: 11539 కంచు పని వారు: 5747 పాదరక్షలు చేసేవారు: 5545 భిక్షాటన చేస్తున్న వారు: 18,396 ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు: 15,150 దుకాణాల్లో పని చేస్తున్నవారు: 8236 అపార్టుమెంట్ వాచ్మెన్: 6705 ప్రధాన వృత్తులు వ్యక్తులు రోజువారీ కూలీలు 3617275 వ్యవసాయ కార్మికులు 2708706 రైతులు 1292876 బీడి కార్మికులు 457827 డ్రైవర్లు 348053 చిల్లర వ్యాపారులు 288957 వలస కూలీలు 213553