
తిరుమల: ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేసింది. వాటి స్థానంలో బయో డీ గ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో టీటీడీ తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. తద్వారా తాటి చెట్టులను పెంచే వారికి ఆదాయంతోపాటు, తాటాకు బుట్టలను తయారు చేసే సంప్రదాయ వృత్తి కళాకారులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.