Traffic administration
-
హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశం శుక్రవారం జరిగింది. యానివల్ క్రైం రౌండప్ బుక్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్, అడిషనల్ సీపీలు , డీసీపీలు పాల్గొన్నారు. నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలు.. హైదరాబాద్‌లో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 2 శాతం పెరిగిన క్రైమ్ రేట్ 9% పెరిగిన దోపిడీలు , మహిళలపై 12 % పెరిగిన నేరాలు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 % తగ్గిన నేరాలు వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు , పొగొట్టుకున్న సొత్తులో 75 % రికవరీ హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4,909 రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు ఈ ఏడాది 83 డ్రగ్ కేసుల్లో 241మంది అరెస్ట్ గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 % పెరిగిన సైబర్ నేరాలు ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా 401 కోట్లు మోసాలు మల్టిలెవల్ మార్కెటింగ్ 152 కోట్లు మోసం ఆర్థిక నేరాలు 10 వేల కోట్లు కు పైగా మోసం ల్యాండ్ స్కామ్ లల్లో 245 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ పీడీ యాక్ట్ 18 మందిపై నమోదు ట్రాఫిక్ కేసులు ఇలా.. డ్రంక్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ద్వారా రూ.91 లక్షలు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినవారి 556 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదా ద్వారా మరణాలు 280 నమోదు కాగా.. అందులో పాదచారులు 121 మంది ఉన్నారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన రూ. 2.63 లక్షల మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ అనే మాట వినపడొద్దు.. ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త వెహికిల్ చట్టం
-
అంబులెన్స్‌కు దారివ్వకపోతే..మోతే!
సాక్షి, కడప : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారికి భారీగా జరిమానా విధించనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలన్నీ కొన్ని రెట్టింపు కాగా మరికొన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ మంత్రి వర్గం తీర్మానించింది. చిన్న పిల్లలకు (మైనర్లు) వాహనాలు ఇస్తే పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ.20 వేలు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. ఒక వేళ పిల్లలు ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. అంబులెన్స్‌కు దారివ్వకపోతే రూ.10 వేలు పైన్ కట్టాల్సి ఉంటుంది. వాహనం నడిపేట ప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. డ్రైవింగ్‌కు అనర్హులై వారు వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనాదారులకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. అతివేగానికి కళ్లెం రోడ్లపై అతివేగంగా దూసుకెళ్లే వాహనాదారులకు రూ.1000 నుంచి రూ.2వేలు జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ.2వేలు జరిమానా చెల్లించాలి. అలాగే సీటు బెల్ట్ ధరించకపోతే రూ.1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినా రూ.1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ట్రాపిక్ సిగ్నల్స్ ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. అధికారులు అదేశాలు పాటించకుంటే గతంలో రూ.500 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు దానిని రూ.2వేలకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు, మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా నడిపితే రూ.5వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా కట్టాలి. అలాగే రవాణా చేసే వాహనాలు ఓవర్ లోడింగ్ చేస్తే రూ.20 వేలు పెనాల్టీ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలాంటి నిబంధనలు స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయి. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇటీవల కాలంలో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బాగా పెరిగాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి కఠిన నిబంధనలతో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది. -
ఊచలు లెక్కపెట్టాల్సిందే..
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: ఇక నుంచి రోడ్లపైకి మద్యం సేవించి వాహనాలు నడుపుతే కఠినమైన కేసులతో పాటు.. పది నుంచి 60రోజుల జైలు శిక్ష విధించనున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, లారీలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎక్కువమంది వాహనదారులు పట్టణంలో మద్యం కొనుగోలు చేసి బండమిదీపల్లి నుంచి తాటికొండ రోడ్డు వైపుతో పాటు, ఇటు నవాబ్‌పేట రోడ్డు ఫతేపూర్ మైసమ్మ పరిసర ప్రాంతాల వైపు.. హన్వాడ వైపు మద్యం తీసుకెళ్లి నిత్యం వందల సంఖ్యలో పార్టీ లు చేసుకుంటూ వస్తున్నారు. ఆదివారం రోజు అయితే సాయంత్రం సమయంలో తాటికొండ రోడ్డు వైపు వెళ్తే రోడ్డుకు ఇరువైపులా ఐదు.. నుంచి పది మంది వరకు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా చెట్లకింద కూర్చోని మద్యం సేవిస్తూ కన్పింస్తుంటారు. ఎంత తాగితే ఎక్కువ.. బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా వేస్తారు. ఇలా రెండుసార్లు దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100మి.గ్రా పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం.. ఒక యూనిట్ లేదా 100మిల్లీలీటర్ల రక్తంలో 0.03 శాతం లేదా 30మిల్లీ గ్రాములు మించి ఆల్కహాల్ ఉంటే.. మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2వేలు జరిమానా, వారం నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావత్తం చేస్తే ఎక్కువ రోజులు జైలు శిక్షతో పాటు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించే ప్రమాదం ఉంది. వినూత్నంగా శిక్షలు.. మొదట్లో డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవారు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదునుపెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 5నుంచి 20రోజుల జైలు శిక్షలు విధించడం ప్రారంభం చేశారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్‌డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 35రోజుల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీవో నం. 26ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24నెలల్లో 12పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5పాయింట్లు, ఆటో డ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకుంటే, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే 1పాయింటు వేస్తారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో 15రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 10రోజుల శిక్షపడిన వారు 12మంది, వారం రోజులు శిక్షపడిన వారు 51మంది, 35రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 30రోజుల శిక్ష పడిన వారు ఇద్దరు, 3రోజులు 87మంది, 5రోజులు 21మంది, 2రోజులు 34, ఒక్కరోజు జైలు శిక్షపడిన వారు నలుగురు ఉన్నారు. కేసులు పెరుగుతున్నాయి : జిల్లా కేంద్రంలో నిత్యం తనిఖీలు చేయడంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాం. అయినా కేసులు పెరుగుతున్నాయి. వాహనదారుల్లో చైతన్యం కలిగించినా మార్పు రావడం లేదు. పట్టుబడిన ప్రతిసారి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంవీ యాక్టును మరింత కఠినంగా చేయడంతో పాటు తనిఖీలు మరింత పెంచడం జరుగుతుంది. దీంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతాం. ప్రతి వాహనదారుడు నిబంధనలు తెలుసుకోవాలి. రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాటిని పాటిస్తే ఎవరికి ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. – అమర్నాథ్రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
ఆటో వార్డెన్!
సాక్షి, చెన్నై: ఆటోలకు మీటర్లు తప్పని సరి చేయడం లక్ష్యంగా సరికొత్త పథకానికి నగర ట్రాఫిక్ యంత్రాంగం నిర్ణయించింది. ఆటో, క్రైం, ట్రాఫిక్ భాగస్వామ్యంతో ‘ఆటో వార్డెన్’ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. మీటర్లు వేయకున్నా, చార్జీల దోపిడీకి పాల్పడే ఆటోవాలాల భరతం పట్టడం లక్ష్యం గా ఈ బృందాలు రోడ్డెక్కనున్నారుు. ప్రధాన నగరాల్లో సాగుతున్న ఆటో చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటోల్లో మీటర్లు తప్పనిసరి చేసింది. కనీస చార్జీగా రూ.25, ఆ తర్వాత కిలో మీటరుకు రూ.12 వసూలు చేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. అలాగే, రాత్రుల్లో 50శాతం అదనపు చార్జీ వసూలు చేసుకునే వీలు కల్పించారు. గత ఏడాది ఆగస్టు 25న రాష్ట్ర రాజధాని నగరంలో ఆటో చార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే, మెజారిటీ శాతం ఆటోవాలాలు మాత్రం కుంటి సాకులతో మీటర్లు వేయడం మానేశారు. పలు చోట్ల ప్రయాణికుల నుంచి చార్జీల దోపిడీకి దిగుతూనే ఉన్నారు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆటో వాలాల భరతం పట్టే విధంగా ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు రోడ్డెక్కి జరిమానాల మోత మోగించారు. వందలాది ఆటోలను సీజ్ చేశారు. అయినా, వారిలో మార్పు రాలేదు. అదే సమయంలో అధికారుల తీరును నిరసిస్తూ రివర్స్ గేర్ బాటపట్టారు. తాము మీటర్లు వేస్తున్నా, అధికారులు పనిగట్టుకుని కేసులు వేస్తున్నారంటూ వాదించారు. తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గట్టుగా చార్జీల్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. వీటన్నింటిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఆటోలకు మీటర్లు వేయించడంలో ట్రాఫిక్, ఆర్టీఏ యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు ఎక్కడ కోర్టుకు చేరుతాయో, ఎక్కడ చీవాట్లు పడుతాయోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. దీంతో సరికొత్తగా ఆటో వాలాల వద్దకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆటో వార్డెన్ అంటే..: ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఆటో వాలాల భరతం ఆటోవాలాల చేతే పట్టించేందుకు సిద్ధమయ్యారు. తాము పని గట్టుకుని కేసులు వేస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టే విధంగా కొత్త పథకాన్ని ట్రాఫిక్ యంత్రాంగం రచించింది. మహానగరంలో అదనపు కమిషనర్ పరిధిలో పన్నెండు డివిజన్లుగా ట్రాఫిక్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఉండే నిజాయితీ పరులైన, ఎలాంటి వ్యవసనాలు లేని ఆటో వాలాలను ఈ పథకానికి ఎంపిక చేయడానికి నిర్ణయించారు. దీనికి ఆటో వార్డెన్ అని నామకరణం చేశారు. ఒక్కో డివిజన్ పరిధిలో పది మంది చొప్పున నిజాయితీ పరులైన ఆటో డ్రైవర్లను ఎంపిక చేస్తారు. పన్నెండు డివిజన్లకు 120 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పది మంది చొప్పున పన్నెండు ఆటో డ్రైవర్ల బృందాలను, ఒక్కో బృందానికి ఒక ట్రాఫిక్ పోలీసు, మరో క్రైం పోలీసులతో కలిపి పన్నెండు మందితో ఒక ఆటో వార్డెన్ బృందం ఏర్పాటు కాబోతున్నది. ఈ బృందం రోజు వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ, ఆటోల్ని తనిఖీలు చే యనుంది. ఆటో డ్రైవర్లు ఎవరైనా మీటర్లు వేయకున్నా, అధిక చార్జీలు వసూలు చేసినా, ఈ బృందం ఎలాంటి కేసులు నమోదు చేయదు. సంబంధిత ఆటో డ్రైవర్‌ను తీసుకెళ్లి, అతడిలో మార్పు వచ్చే వరకు ప్రత్యేక క్లాస్ తీసుకోనున్నారు. మళ్లీ...మళ్లీ పట్టుబడిన పక్షంలో ఆటోల సీజ్, భారీ జరిమానా మోత మోగించేందుకు ట్రాఫిక్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ ఆటో వార్డెన్లు రోడ్డెక్కనున్నారు.