Traffic disruption
-
20 నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం
కాజీపేట రూరల్: విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్(ఆర్ఆర్ఐ) ప్యానల్ బోర్డు ఆధునికీకర ణ ప్రక్రియ చేపట్టనున్న కారణంగా ఈ నెల 20 నుంచి 28 వరకు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో భా గంగా వారం పాటు విజయవాడకు వచ్చే రైళ్లను నిలిపివేయడంతో పాటు విజయవా డ కేంద్రంగా నడిచే 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నా రు. మరో 215 రైళ్లను దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా విజయవాడ వైపునకు వెళ్లే రైళ్లను సైతం ఖమ్మం వరకు నడిపించాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. కొద్ది రోజుల్లో రైల్వే అధికారులు రద్దు చేయనున్న, దారి మళ్లించనున్న రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఏయే రూట్లలో.. ∙హైదరాబాద్ – హౌరా మధ్య నడి చేlహౌరా ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ – విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్ – కాకినాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 20 నుంచి 25 వరకు నేరుగా విజయవాడ వరకు కాకుండా.. ఏలూరు, విజయవాడ, బైపాస్ రాయన్‌పాడు, కొండపల్లి స్టేషన్ల మీదుగా విజయవాడ కు నడిపించనున్నారు. ∙ఆదిలాబాద్ – తిరుపతికి వెళ్లే కృష్ణా ఎ క్స్ప్రెస్ను భువనగిరి, రాయగిరి, ఆలే రు, జనగామ, కాజీపేట, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ రూట్లో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్ల మీదుగా తిరుపతికి నడిపించనున్నారు. ∙ముంబై సీఎస్టీæ– భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కొండపల్లి – విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా దారి మళ్లిస్తారు. ఇలా మరి కొన్ని రైళ్లను కూడా దారిమళ్లించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొత్తఢిల్లీ, సికింద్రాబాద్ – విజయవాడల మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
తిరుమలలో కూలిన కొండచరియలు
-
బస్సెనక బస్సు ఢీ
సినీఫక్కీలో ప్రమాదం ఒకనికి తీవ్రగాయాలు ట్రాఫిక్‌కు అంతరాయం కశింకోట: జాతీయ రహదారిపై కశింకోట కూడలిలో గురువారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. సినీ ఫక్కీలో వరుసగా ఐదు వాహనాలు ఒక దాని వెంట ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతోపాటు మరికొందరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న ట్రైలర్ లారీ ముందు వెళుతున్న నర్సీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ నాన్-స్టాప్ బస్సును ఢీకొంది. దీంతో ఆ బస్సు ముందు ఉన్న క్వాలిస్‌ను, ఆ కారు ముందున్న పాయకరావుపేట నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సును, ఆ ఆర్టీసీ బస్సు దాని ముందు ఆగి ఉన్న అచ్యుతాపురం ఎస్ఈజడ్ పరిశ్రమకు చెందిన ఓ ప్రైవేటు బస్సును వరుసగా ఢీకొన్నాయి. దీంతో అమలాపురం నుంచి విశాఖపట్నం వెళుతున్న కారులో ఉన్న విశాఖకు చెందిన వీసంశెట్టి వెంకటేశ్వర్లు గాయపడ్డారు. మరో ముగ్గురు పెళ్లి బృందం సభ్యులు, కారు డ్రైవర్ సిహెచ్.శ్రీను స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. కారు ముందు, వెనుక భాగాలు బస్సుల మధ్య ఇరుక్కుపోవడంతో దెబ్బతిన్నాయి. నాన్-స్టాప్ బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్వర్లును అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు సుమారు గంటసేపు నిలిచిపోయాయి. సీఐ ప్రసాద్, ఎస్ఐ స్వామినాయుడులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు ఆర్టీసీ బస్సులను, కారును ముందుగా పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం ట్రైలర్‌ను క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ మేరకు ప్రమాదానికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ స్వామినాయుడు తెలిపారు. -
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు
ఏలూరు : జాతీయ రహదారులను ఆనుకుని, ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఉన్న దుకాణాలు, అక్రమ కట్టడాలు, హోర్డింగులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు. పలు అర్జీలను పరిశీలించి పరిష్కారానికి అధికారులకు సూచనలిచ్చారు. ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆసుపత్రి ఆటోనగర్ ప్రాంతంలో సుమారు పదేళ్లుగా దుకాణాలు నిర్వహిస్తూ చిరువ్యాపారులు చేసుకుంటున్నామని, వాటిని తొలగించాల్సిందిగా హైవే కాంట్రాక్టు సిబ్బంది తమపై ఒత్తిడి చేస్తున్నారని.. కొంత సమయం ఇవ్వాలని ఏలూరు ఆశ్రం ఏరియా చిల్లర వర్తక సంక్షేమ సంఘం మల్కాపురం సంఘ అధ్యక్షుడు డి.గోవింద్, సభ్యులు కలెక్టరును కోరారు. జాతీయ రహదారుల ముఖ్య కూడళ్లలో బడ్డీలు, అక్రమ కట్టడాలతో వ్యాపారం నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇటువంటివి వెంటనే తొలగించాలని కలెక్టర్ సమాధానమిచ్చారు. తాడేపల్లిగూడెంలోని 13వ వార్డులో మంచి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాబోయే వేసవి దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీటిని వార్డు ప్రజలకు సరఫరా చేయూలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తూర్పు, ఉత్తరం వైపు గోడలకు చేర్చి ఉన్న స్థలాల్లో దుకాణాలు, తోపుడు బళ్లు ఏర్పాటు చేసుకుని భక్తుల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, వీటిని తొలగించాలని ఈ ప్రాంతవాసులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ, మునిసిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జేసీ పి.కోటేశ్వరరావు, డీఆర్వో కె.ప్రభాకరరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల దత్తతకు ముందుకు రండి ఏలూరు : జిల్లాలో పనిచేస్తున్న జిల్లాస్థా రుు అధికారులంతా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముం దుకు రావాలని కలెక్టర్ కె.భాస్కర్ కోరా రు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని జిల్లా నుంచే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారన్నారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, విద్యా సంస్థ లు, ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు తాము పుట్టిన లేదా తమకు నచ్చిన ఒక గ్రామాన్ని ఎంచుకుని దత్తత తీసుకోవాలని కోరారు. ఆయూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా కృషిచేయాలన్నారు. ప్రతి అధికారి ఈనెల 11వ తేదీలోగా తాము ఎంచుకున్న గ్రామాన్ని లిఖితపూర్వకంగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారికి అందజేయూలని సూచించారు. జిల్లా స్థాయి, మండల స్థాయిలో వివిధ శాఖలకు చెందిన పెండింగ్ పనులను ప్రతి వారం సమీక్షించి పరిష్కరిస్తున్నామని రాష్ట్ర స్థారుులో పెండింగ్ సమస్యల వివరాలను పట్టిక రూపంలో తనకు అందజేయూలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జేసీ పీ.కోటేశ్వరరావు, అదనపు జేసీ మహ్మద్ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 16 నుంచి పారిశుధ్య అవగాహన వారోత్సవాలు జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పారిశుధ్య అవగాహన వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం సంపూర్ణ పారిశుధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. వారోత్సవాలలో భాగంగా గ్రామాల్లో డంపింగ్ యూర్డులు ఏర్పాటుచేయూలని, డ్రెరుున్లు, కాలువలు శుభ్రం చేరుుంచాలని సూచించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మొక్కల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలి జిల్లాలో నీరు- చెట్టు కార్యక్రమం కింద నాటిని మొక్కలను పరిరక్షించే బాధ్యతకు ప్రాముఖ్యతను ఇవ్వాలని కలెక్టర్ భాస్కర్ అధికారులకు ఆదేశించారు. నీరు- చెట్టు కార్యక్రమం అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో భబుూగంగా జిల్లాలో కోటి 30 లక్షల మొక్కలను నాటడం, వాటిని పరిరక్షించడంపై ప్రణాళికను రూపొందించాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన 275 చెరువులలో పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. -
ట్రాఫిక్ తిప్పలు తప్పేనా?
కర్నూలు: విస్తరణలో దూసుకుపోతున్న కర్నూలు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతున్నా ఆ స్థారుులో క్రమబద్ధీకరణ చర్యలు లేకపోవడంతో నగరవాసులకు నిత్యకష్టాలు తప్పడంలేదు. పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడం, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ స్టేషన్ స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఇటీవల డీఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధికి అనుగుణంగా ట్రాఫిక్ సుడిగుండం నుంచి గట్టెక్కిస్తారని నగరవాసులు నమ్ముతున్నారు. ఒక్క స్టేషన్‌తోనే కుస్తీలు.. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు నాలుగు స్టేషన్లుండగా ట్రాఫిక్ నియంత్రణకు మాత్రం ఒక్క స్టేషన్‌తోనే కుస్తీ పడుతున్నారు. అదనపు స్టేషన్‌కు 2003లో అప్పటి అధికారులు ప్రతిపాదించినా అమలుకు నోచుకోలేదు. జనాభా ప్రాతిపదికన మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సీహెచ్.శ్రీకాంత్ హయాంలో హోం శాఖకు నివేదిక పంపారు. వన్‌టౌన్, టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కలిపి ఒకటి, త్రీ, ఫోర్థ్ టౌన్ స్టేషన్ల పరిధి కలిపి అదనపు ట్రాఫిక్ స్టేషన్ కోసం ప్రతిపాదించినా ఫలితం లేదు. 1975లో కంట్రోల్ రూం సీఐ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ స్టేషన్ ప్రారంభమైంది. 1983లో సర్కిల్‌గా ట్రాఫిక్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి సీఐని నియమించారు. నగర జనాభా 2 లక్షలుగా ఉన్నప్పుడు ప్రారంభమైన ట్రాఫిక్ స్టేషన్ ప్రస్తుతం ఐదు లక్షలు దాటినా అదే సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో నగరంలో 3 వేల ఆటోలుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 20 వేలకు, బయటి ప్రాంతాల నుంచి వస్తున్న బస్సుల సంఖ్య 1500 నుంచి ప్రస్తుతం 5వేలకు చేరింది. ఆ స్థారుులో రోడ్లను విస్తరించకపోవడం, నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం సమస్యకు కారణం. అటకెక్కిన లింకు రోడ్ల ప్రతిపాదన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారులను కలుపుతూ లింకు రోడ్లు ప్రతిపాదించారు. చిన్న టేకూరు నుంచి నన్నూరు వరకు ఎన్‌హెచ్-7, 44ను కలుపుతూ ఒకటి, నన్నూరు నుంచి శివరాంపురం, గార్గేయపురం మీదుగా నందికొట్కూరు రోడ్డుకు లింకు చేస్తూ మరో రోడ్డు ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వానికి నివేదించారు. నాగులాపురం వద్ద నుంచి పెద్దపాడు మీదుగా హైదరాబాద్‌కు అటు చిన్నకొట్టాల, బస్తిపాడు మీదుగా ఎన్‌హెచ్-44కు కలిపి బెంగళూరు వెళ్లే విధంగా రింగ్ రోడ్డు తరహాలో ఏర్పాటు చేయూలని ప్రతిపాదించారు. అలాగే కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రోడ్ల కూడలి నుంచి రైల్వే స్టేషన్ మీదుగా అశోక్‌నగర్ పంప్ హౌస్‌వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇవేమీ అమలుకునోచుకోలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ఈ ప్రతిపాదనలపై దృష్టి సారించాల్సి ఉంది. రికవరీ వ్యాన్ మాటే ంటి ...? రోడ్డుకు అడ్డంగా నిలుపుదల చేసిన వాహనాలను ట్రాఫిక్ స్టేషన్‌కు తరలించేందుకు రికవరీ వాహనం అవసరమని ప్రభుత్వానికి పంపిన నివేదిక కూడా అమలుకు నోచుకోలేదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోకి భారీ వాహనాల ప్రవేశానికి నిషేధం ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. పాతబస్తీలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నందునా ఇతర ప్రాంతాల నుంచి సరుకుల లారీల వస్తూనే ఉన్నారుు. -
కర్నూలు జిల్లాలో భారీ వర్షం
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. వర్షానికి డోన్ మండలం పెద్దమల్కాపురంలో మట్టి మిద్దె కూలి పదో తరగతి విద్యార్థిని హేమలత (15) మృతి చెందింది. కృష్ణగిరి మండలం గుడెంపాడుకు చెందిన మహేశ్వరరెడ్డి (40) పిడుగుపాటుకు గాయపడ్డాడు. ఓర్వకల్లు, కోవెలకుంట్ల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉయ్యాలవాడ మండలం మాయలూరు- ఆళ్లగడ్డ రహదారిలో కుందరవాగు కాజ్‌వేపై నీటి ప్రవాహానికి లారీ బోల్తాపడింది. భారీ వర్షం వల్ల ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పత్తికొండ, ఓర్వకల్లు, గూడూరు, కృష్ణగిరి మండలాల్లో పత్తి, ప్రొద్దుతిరుగుడు, ఉల్లి, మిరప తదితర పంటలు సుమారు 5 వేల ఎకరాల్లో నీటమునిగాయి. ఓర్వకల్లు సమీపంలోని కుందూవాగు పొంగిపొర్లడంతో 18వ జాతీయరహదారిపై 3 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యధికంగా బేతంచర్ల మండలంలో 120.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.