ఏలూరు : జాతీయ రహదారులను ఆనుకుని, ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఉన్న దుకాణాలు, అక్రమ కట్టడాలు, హోర్డింగులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు. పలు అర్జీలను పరిశీలించి పరిష్కారానికి అధికారులకు సూచనలిచ్చారు. ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆసుపత్రి ఆటోనగర్ ప్రాంతంలో సుమారు పదేళ్లుగా దుకాణాలు నిర్వహిస్తూ చిరువ్యాపారులు చేసుకుంటున్నామని, వాటిని తొలగించాల్సిందిగా హైవే కాంట్రాక్టు సిబ్బంది తమపై ఒత్తిడి చేస్తున్నారని.. కొంత సమయం ఇవ్వాలని ఏలూరు ఆశ్రం ఏరియా చిల్లర వర్తక సంక్షేమ సంఘం మల్కాపురం సంఘ అధ్యక్షుడు డి.గోవింద్, సభ్యులు కలెక్టరును కోరారు. జాతీయ రహదారుల ముఖ్య కూడళ్లలో బడ్డీలు, అక్రమ కట్టడాలతో వ్యాపారం నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని..
ఇటువంటివి వెంటనే తొలగించాలని కలెక్టర్ సమాధానమిచ్చారు.
తాడేపల్లిగూడెంలోని 13వ వార్డులో మంచి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాబోయే వేసవి దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీటిని వార్డు ప్రజలకు సరఫరా చేయూలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తూర్పు, ఉత్తరం వైపు గోడలకు చేర్చి ఉన్న స్థలాల్లో దుకాణాలు, తోపుడు బళ్లు ఏర్పాటు చేసుకుని భక్తుల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, వీటిని తొలగించాలని ఈ ప్రాంతవాసులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ, మునిసిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జేసీ పి.కోటేశ్వరరావు, డీఆర్వో కె.ప్రభాకరరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల దత్తతకు ముందుకు రండి
ఏలూరు : జిల్లాలో పనిచేస్తున్న జిల్లాస్థా రుు అధికారులంతా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముం దుకు రావాలని కలెక్టర్ కె.భాస్కర్ కోరా రు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని జిల్లా నుంచే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారన్నారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, విద్యా సంస్థ లు, ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు తాము పుట్టిన లేదా తమకు నచ్చిన ఒక గ్రామాన్ని ఎంచుకుని దత్తత తీసుకోవాలని కోరారు.
ఆయూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా కృషిచేయాలన్నారు. ప్రతి అధికారి ఈనెల 11వ తేదీలోగా తాము ఎంచుకున్న గ్రామాన్ని లిఖితపూర్వకంగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారికి అందజేయూలని సూచించారు. జిల్లా స్థాయి, మండల స్థాయిలో వివిధ శాఖలకు చెందిన పెండింగ్ పనులను ప్రతి వారం సమీక్షించి పరిష్కరిస్తున్నామని రాష్ట్ర స్థారుులో పెండింగ్ సమస్యల వివరాలను పట్టిక రూపంలో తనకు అందజేయూలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జేసీ పీ.కోటేశ్వరరావు, అదనపు జేసీ మహ్మద్ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
16 నుంచి పారిశుధ్య అవగాహన వారోత్సవాలు
జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పారిశుధ్య అవగాహన వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సంపూర్ణ పారిశుధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. వారోత్సవాలలో భాగంగా గ్రామాల్లో డంపింగ్ యూర్డులు ఏర్పాటుచేయూలని, డ్రెరుున్లు, కాలువలు శుభ్రం చేరుుంచాలని సూచించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
మొక్కల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలి
జిల్లాలో నీరు- చెట్టు కార్యక్రమం కింద నాటిని మొక్కలను పరిరక్షించే బాధ్యతకు ప్రాముఖ్యతను ఇవ్వాలని కలెక్టర్ భాస్కర్ అధికారులకు ఆదేశించారు. నీరు- చెట్టు కార్యక్రమం అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో భబుూగంగా జిల్లాలో కోటి 30 లక్షల మొక్కలను నాటడం, వాటిని పరిరక్షించడంపై ప్రణాళికను రూపొందించాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన 275 చెరువులలో పూడిక తీత పనులను చేపట్టాలన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు
Published Tue, Mar 10 2015 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement