traffic police challan
-
నంబర్ లేకుంటే కటకటాలే!
హైదరాబాద్: నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయిన, కనిపించకుండా ప్లేట్‌ను వంచినా, మాస్క్ వేసినా, అస్పష్ట నెంబర్ ప్లేట్‌తో నడిపినా, ట్యాంపరింగ్ చేసినా కేంద్ర మోటారు వాహన చట్టంసెక్షన్ 192 కింద కేసులు నమోదు చేస్తున్నారు. చార్జిషీట్లు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాచకొండ పరిధిలో 49 వేలకు పైగా నెంబర్ ప్లేట్ టాంపరింగ్ కేసులు నమోదయ్యాయి. పునరావృతమైతే అంతే.. కొత్త వాహనాలు 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ తెలిపారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌తో తొలిసారి చిక్కిన వాహనదారులు వెంటనే వాటిని సరిచేసుకోవాలని, ఇదే తప్పు పునరావృతం ఐతే కిమినల్ కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఆరుగురికి జైలు శిక్ష.. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తూ రెండోసారి పట్టుబడిన ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. వీరిలో అత్యధిక మందికి రూ.5 వేల వరకు జరిమానా విధించారు. అలాగే మూడు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించారు. ఇకపై నెంబర్ప్లేట్లు లేని వాహనాలు నడిపే వారందరిపై కేసులు నమోదు చేసి చార్జిషీట్లు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల వల్ల నేరాలకు ఆస్కారం ఉంటుందని, అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. -
లగ్జరీ కారు, బైక్‌లతో హల్చల్.. 77వేలు ఫైన్ వేసి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా యూత్.. బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా కొందరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఓవరాక్షన్ చేయగా ట్రాఫిక్ పోలీసులు వారిని ఏకంగా 77వేల జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలో హాపూర్‌లో నడిరోడ్డుపై కొందరు యువకులు హల్చల్ చేశారు. బెంజ్ కార్లు, బైక్‌లపై వెళ్తూ వీడియోలు తీసుకున్నారు. ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం నానా హంగామా క్రియేట్ చేశారు. హైస్పీడ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ పక్కన వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ వీడియోలు హాపూర్ ఎస్సీ అభిషేక్ వర్మ దృష్టికి చేరాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారి వాహనాలు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను గుర్తించి యువకులకు రూ.77,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ ప్రకారం.. వారికి జరిమానా విధించినట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు. లేకపోతే భారీ జరిమానాలు సహా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు హెచ్చరించారు. -
వాహనాలు అక్కడ పార్కింగ్ చేస్తున్నారా.. డబుల్ జరిమానా తప్పదు
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, కోఠి... ఇలా నగరంలోని అనేక వాణిజ్య ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయా మార్గాల్లోని వర్తకులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అక్రమ పార్కింగ్స్, ఇబ్బందికర పార్కింగ్ తప్పట్లేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఆయా మార్గాల్లో వాహనచోదకులు నరకాన్ని చవి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాలను ట్రాఫిక్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో పార్కింగ్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు ఆయా దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వాహకులపై చర్యలకు మార్గాలు అన్వేషిస్తున్నామని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం వెల్లడించారు. వర్తక, వ్యాపార సముదాయాలు, దుకాణాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా (కంజెషన్ జోన్) గుర్తించాలని నిర్ణయించారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పక్కా సాంకేతికంగా వీటిని మార్క్ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అక్రమ పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌పై అనునిత్యం ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి పార్కింగ్స్కు పాల్పడిన ఉల్లంఘనులకు ఇతర ప్రాంతాల్లో విధించే జరిమానాకు రెట్టింపు వేయాలని యోచిస్తున్నారు. ఫలితంగా వారిలో మార్పునకు ప్రయత్నాలు చేయనున్నారు. నో పార్కింగ్, ఇబ్బందికర పార్కింగ్‌లను ప్రస్తుతం వేరుగా చూడట్లేదు. ఈ కారణంగా జమానాల్లోనూ మార్పులు లేవు. అయితే సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తర్వాత ఆ రెంటికీ వేర్వేరుగా జరిమానాలు విధించనున్నారు. నో పార్కింగ్ కంటే ఇబ్బందికర పార్కింగ్‌కు ఎక్కువ మొత్తం ఉండనుందని సమాచారం. ఇప్పటి వరకు పార్కింగ్ ఉల్లంఘనపై కేవలం వాహనచోదకులకే జరిమానా పడుతోంది. అయితే వీరితో పాటు ఆయా వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులనూ బాధ్యులను చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలకు ఆస్కారం లేదు. సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినా నామమాత్రపు జరిమానాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులపై చర్యలకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా! -
ఆటో.. 2 వేలు చిల్లర.. మనోడి స్టోరీ విని పోలీస్ అధికారే ఫైన్ కట్టాడు
నాగపూర్: ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం మనం వింటూ వుంటాం గానీ , దాని కొందరు పోలీసులు మాత్రం దీన్ని ఆచరించి మరీ చూపిస్తున్నారు. సాధారణంగా వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు జరిమానా విధించడం తెలిసిందే.కానీ ఓ ఆటో డ్రైవర్ కథ విని చలించిపోయి పోలీస్ అధికారే ఫైన్ కట్టాడు.ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాగపూర్ లోని ఆగస్ట్ 8న ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశాడు. దీంతో ఆ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 200 రూపాయల ఫైన్ వేశారు. కానీ అంతకుముందు నుంచి ఆ డ్రైవర్ కట్టకుండా వున్న జరిమానాలతో కలిపి 2 వేలుగా చూపించింది. దీంతో ఫైన్ కట్టి ఆటో తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు. ఆటోని పోలీసులు సీజ్ చేయడంతో నానా అవస్థలు పడింది ఖాడ్సే కుటుంబం. ఎలాగైనా ఫైన్ కట్టి ఆటోని విడిపించాలని ఆలోచిస్తుండగా.. అతనికి తన కొడుకు దాచుకున్న చిన్న పిల్లల పిగ్గి బ్యాంక్ కనపడింది. దాన్నిపగులగొట్టి.. చిల్లర అంతా ఏరుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అదంతా చిల్లర నాణేల కావడంతో పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారు. మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటి భగవంతుడా అనుకుంటూ సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ మాలవియా వద్దకు వెళ్లాడు ఆ ఆటో డ్రైవర్. అతని వద్ద ఉన్న కాయిన్స్‌ను చూసిన ఆఫీసర్.. ఏం జరిగింది అని ఆరా తీసి అసలు విషయం తెలుసుకున్నాడు. అతడి మాటలు విన్న ఇన్స్పెక్టర్ చలించిపోయారు. వెంటనే 2 వేల రూపాయల ఫైన్‌ను తనే కట్టేసి.. ఆటో తీసుకెళ్లాలని ఖాడ్సేకు ఇన్స్పెక్టర్ తెలిపారు. सीताबर्डी वाहतूक विभागाचे कार्यालयामध्ये एक ग्रहस्थ त्याने किरायाने घेतलेला ऑटो चलान झाल्याने ऑटो सोडवण्यासाठी त्याच्या लहान मुलाचा गुल्लक फोडून जमा झालेली रक्कम घेऊन आला, त्याचे डोळे पाणावलेले होते. त्याने कार्यालयामध्ये रक्कम देत मी दंड भरायला तयार आहे माझा ऑटो परत द्या (1/2) — Nagpur City Police (@NagpurPolice) August 13, 2021 -
తాగి నడిపితే.. తాట తీసుడే..!
తరుచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించడం, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో జరుగుతున్నవే. వాటి నివారణకు కొత్త మోటారు వాహన చట్టాన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి.. ప్రజల నుంచి వ్యతికేకత రావడంతో కాస్తా వెనక్కి తగ్గింది. కా నీ మద్యం తాగి పట్టుబడితే కోర్టులు జరి మానాలతోపాటు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. ఇక కొత్త రూల్స్ పాటించకుంటే భారీగా జరిమానా విధిస్తున్నాయి. సాక్షి, మంచిర్యాల: తరుచుగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించడం, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో జరుగుతున్నవే... వాటి నివారణకు కొత్త వాహన చట్టాన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి.. ప్రజల నుంచి వ్యతికేకత రావడంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా.. కోర్టులు మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నాయి. మద్యం తాగి పట్టుబడితే.. జరిమానాలతో పాటు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. ఇక కొత్త రూల్స్ పాటించకుంటే జేబుకు చిల్లు పడడమే. కొత్తచట్టం అమలై 15రోజుల్లోనే జిల్లాలోని ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానాతో పాటు జైలుశిక్ష విధించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరిస్తే మేలు... కొత్తచట్టం తీరు... సెప్టెంబర్ 1 నుంచి వాహన కొత్త చట్టం అమలవుతోందని వాహనదారుల్లో తీవ్రమైన భయాందోళనలో పడిపోయారు. 1వ తేదీన వాహనం పట్టుకొని రోడ్డుమీదికి రావాలంటే వెన్నులో వణుకు మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన కొత్త చట్టం అమలు చేసేందుకు కొంత గడువు ఇచ్చినట్లు ప్రకటన చేయగానే వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా అమలవుతున్న కొత్త వాహన చట్టంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయనున్నట్లు ప్రకటన చేసింది. కానీ ఏమి లాభం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మాత్రం కొత్త చట్టాన్ని కోర్టులు తూ.చ తప్పకుండా అమలు చేస్తోంది. తాగి వాహనాలు నడిపిన వారి తాటతీయడం మొదులు పెట్టింది. పునరాలోచన... వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కొత్త వాహన చట్టం బిల్లును కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్తంగా అమలు చేసింది. కొత్త వాహన చట్టం అమలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి పునరాలోచన చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త వాహన చట్టంలోని నిబంధనలు సవరించే దిశలో పునరాలోచన చేయనుంది. కొత్త చట్టంలో మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు సైతం జైలుకు వెళ్లాల్సి ఉండేది. ఇలా ఒక్కటి కాదు మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానా విధించడం, జరిమానాతో పాటు జైలు శిక్ష, చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టం సెక్షన్ – 199 ప్రకారం పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ.25వేలు జరిమానా విధిస్తూ మూడేళ్ల జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉండేది. అంటే సదరు వాహనాం మళ్లి రోడ్డెక్కె అవకాశం లేదు. ఇక ఉద్యోగులైతే ఉద్యోగం సైతం కోల్పోయే అవకాశం, దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేయడం ఉంది. ఒక వేల పిల్లలు ప్రమాదం చేస్తే వారి తల్లిదండ్రులను లేదా సంరక్షకులను దోషులుగా నిర్ధారించింది. రోడ్డుపై వెళ్లే అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయిన రూ.10వేలు జరిమానా చెల్లించే విధంగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సైతం రూ.10వేలు జరిమానా జైలు శిక్ష విధించేల చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలుకు బ్రేకులు వేసింది. జిల్లాలో సుమారు 20లక్షల వాహనాలు జిల్లాలో 8 లక్షల వరకు రవాణా వాహనాలు ఉండగా 12లక్షల వరకు రవాణేతర వాహనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఘనంగా పెరుగుతున్నాయి. మరోవైపు హైవేలపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రమాదాల కారణాలపై నిపుణుల సర్వే ప్రకారం అధికంగా మద్యం మత్తులో, మితిమీరన వేగం, ట్రాఫిక్ నింబంధనలు పాటించకపోవడంతో జరిగే రోడ్డు ప్రమాదాలే అధికం. ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, స్వల్ప జరిమానాలు విధించిన వాహనదారుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో కొత్త వాహన చట్టాన్ని అమలు చేస్తూ కఠినతరం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు, రవాణా శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టుకు అప్పగించడంతో న్యాయమూర్తులే నూతన చట్టాన్ని అమలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాత చట్టం ప్రకారం రూ.2వేలు జరిమానా, జైలు శిక్ష విధించేవారు. కొత్త వాహన చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానా జైలు శిక్ష విధిస్తున్నారు. కొత్తచట్టం ప్రకారం రెండు కేసులు... కొత్త వాహన చట్టం ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చెన్నూర్ కోర్టులో ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ జైలు శిక్ష ఖరారు చేశారు. దీంతో మందుబాబుల గుండెల్లో బండరాయి వేసినట్లైంది. ఒక పక్కకొత్త చట్టాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఇదేందని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కోర్టుకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రానందున సెప్టెంబర్ 1 నుంచి అమలైన కొత్తవాహన చట్టాన్ని అమలు చేస్తున్నారని పాతచట్టం ప్రకారం రూ.2వేల జరిమానా విధించాల్సి ఉండగా కొత్త చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కొత్తవాహన చట్టంలోని నిబంధనలు, జరిమానా వివరాలు పోలీస్ ట్యాబ్‌లో ఆన్లైన్ చేయలేదని, దీంతో పాత వాహన చట్టం అమలులో ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 15రోజులు రెండు కేసులు ఈ నెల9న జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మద్యం సేవించి వాహనం నడుపగా జైపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తెలడంతో కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనతంరం నారాయణరెడ్డి అతిగా మద్యం సేవించినట్లు తేలడంతో న్యాయమూర్తి సాయికుమార్ కొత్త వాహన చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానా విధించారు. ఈ నెల 15న భీమారం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టి.రాజం అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా భీమారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అతిగా మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరు పరుచగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.10వేలు జరిమాన విధిస్తూ ఒక్క రోజు జైలు శిక్ష విధించారు. ఇక తాగి వాహనాలు నడిపితే అంతే సంగతి... జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పని పరిస్థితి... కోర్టు జరిమానా విధిస్తుంది.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు కేసులు నమోదు చేయడం మట్టుకే పరిమితం జరిమానాలు, శిక్షలు కోర్టు ఆధీనంలో ఉంటుంది.. మద్యం సేవించి వాహనం నడిపిన వారికి పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచేంత వరకు మా పని జరిమానా, జైలు శిక్ష అదంత కోర్టు న్యాయమూర్తులు చూసుకుంటారు. మోటర్ వెహికిల్ కొత్త చట్టం ఇంక అమలుకాలేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు, ప్రతి వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్, వాహనాల పత్రాలు విధిగా పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి, ఎవరిని ఊపేక్షించేది లేదు. – ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల -
బండెక్కితే బాదుడే..!
ఖమ్మంక్రైం: సిగ్నల్స్ వద్ద మార్కింగ్ లేకపోవడం.. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపేందుకు స్థలం లేకపోవడం.. వాహనదారులు, ప్రయాణికులు ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళం. నిత్యం వేలాది వాహనాలు నగరంలోకి వచ్చిపోతుండడంతో ట్రాఫిక్ వ్యవస్థ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రధాన కూడళ్లలో మరీ దారుణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ట్రాఫిక్ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ–చలానా విధానంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి తీరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఐదు సెక్టార్లుగా విభజించారు. ఒకటో సెక్టార్ గాంధీ చౌక్ నుంచి త్రీటౌన్ ప్రాంతం, రెండో సెక్టార్ వన్‌టౌన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి, మూడో సెక్టార్ వైరారోడ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు, నాలుగో సెక్టార్ జెడ్పీసెంటర్ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, ఐదో సెక్టార్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైపాస్ రోడ్డు వరకు విభజించారు. వీటిలో ప్రధాన కూడళ్లు అయిన గాంధీచౌక్, కాల్వొడ్డు, వైరా రోడ్, కిన్నెర పాయింట్, మయూరి సెంటర్ ప్రాంతాల్లో నిత్యం వాహనదారులు, పాదచారులు నరకం చూడాల్సిందే. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కస్బాబజార్‌లో పలు వస్త్ర దుకాణాల వద్ద, అజీజ్ గల్లీ ప్రాంతంలో సైతం ఇదే సమస్య. ముఖ్యంగా అత్యంత రద్దీ ప్రాంతమైన కిన్నెర పాయింట్, కమల మెడికల్ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడి పాయింట్లో విధులు నిర్వర్తించాల్సిన కానిస్టేబుళ్లు ఉండడం లేదని, దీంతో ట్రాఫిక్ సమస్య ఆ ప్రాంతంలో మరింత తీవ్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాయింట్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాలి. కానీ.. ప్రధాన పాయింట్ల వద్ద సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉండగా.. అందులో 20 మంది వరకు ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తున్న సిబ్బంది ఇటీవల కాలంలో ఈ–చలానా, క్యాష్‌లెస్ లావాదేవీల పేరుతో హైదరాబాద్ స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారు చేపట్టిన కార్యక్రమం మంచిదే అయినప్పటికీ ఖమ్మం వంటి నగరంలో దీనిపై 90 శాతం మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ విధానాన్ని ఇక్కడ ప్రారంభించిన మొదటి రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి తప్ప దీనిపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. కొందరు సిబ్బందికి డిజిటల్ కెమెరాలు ఇచ్చి విధి నిర్వహణకు పంపిస్తుండడం.. వారు ఒక్కసారిగా రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల ఫొటోలు తీయడంతో ఏమీ అర్థంకాక వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అసలు ఫొటోలు తీస్తున్న సిబ్బందికి కూడా ఈ ఫొటోలు ఎందుకు తీయాలి.. ఈ–చలానా అంటే ఏమిటో కూడా సరిగా తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అతిక్రమించడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి వాటిని ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి.. నేరుగా వాహనదారుడి సెల్‌కు జరిమానా ఎంత కట్టాలి అనే దానిపై మెసేజ్ పంపిస్తారు. పార్కింగ్ ఏర్పాటు గాలికి.. హైదరాబాద్ స్థాయిలో ఈ–చలానా ప్రవేశపెట్టిన పోలీసులు.. హైదరాబాద్ స్థాయిలో కాకుండా కనీసం ఖమ్మం కమిషనరేట్ స్థాయిలో వాహనాల పార్కింగ్ కోసం ఏళ్లు గడిచినా సరైన స్థలం చూపించలేదు. నిత్యం నగరానికి సుమారు 1.50 లక్షల వాహనాలు వచ్చి పోతుంటాయి. వీటిలో 20వేలకు పైగా ఆటోలు ఉండగా.. మిగతావి ఇతర వాహనాలు ఉన్నాయి. ఆటోలకు అడ్డాలు లేకపోవడంతో నిత్యం రోడ్లపైనే వాటిని నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఆస్పత్రికి.. వ్యాపార సముదాయాలకు వెళ్లాలనుకున్నా.. తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక సతమతమవు తున్నారు. ఇంత జరుగుతున్నా పార్కింగ్ స్థలాల గురిం చి ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. వాహనదారులకు వివరించాలి.. అలాగే ఈ–చలానాపై వాహనదారులకు అవగాహన కల్పించడం ఎంతోముఖ్యం. ఈ–చలానా అంటే ఏమి టి? ఎందుకు ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తారు? అనే దానిపై తమకు కూడా అవగాహన కల్పించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఆ తర్వాతే దీనిని పూర్తిస్థాయిలో అమలుచేస్తే బాగుం టుందని వాహనదారులు, ప్రజలు చెబుతున్నారు. -
నిర్లక్ష్యపు వేగానికి బ్రేకులు
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: వాహనాలను మితిమీరిన వేగంతో నడిపితే ఇకపై జేబు గుళ్లవడం ఖాయం. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే వారి నడ్డివిరిచేందుకు రవాణశాఖ సిద్ధమవుతోంది. అతి వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ లేజర్ గన్ను అమర్చేందు కు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు స్పీడ్ లేజర్‌గన్‌కు శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన మెకానిక్ ఇంజినీర్ మరమ్మతులు చేపట్టారు. ఒకటి రెండు రోజుల్లో దీన్ని అమర్చనున్నారు. వాహన ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాల్లో దీనిని అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత వేగం కంటే అధిక వేగంతో వాహనం వెళ్తే లేజర్గన్లో ఉన్న కెమెరా సంబంధిత వాహనం నంబరను నమోదు చేస్తుంది. అనంతరం అధికారులు సంబంధిత వాహనచోదకుడికి రూ.1000 చెల్లించాల్సిందిగా నోటీసు జారీ చేస్తారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పరికరాన్ని భోగాపురం లేదా గజపతినగరం జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్నట్లు ఇన్చార్జి ఆర్టీఓ ఐ.శివప్రసాద్‌రావు తెలిపారు. వాహనం ప్రయాణించాల్సిన వేగం(కిలోమీటర్లలో) బైక్‌లు 50 ఆటోలు 30 ట్యాక్సీలు 65 లారీలు 65 బస్సులు 55 ట్రాక్టర్లు 55