tragic
-
దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు
ఆంధప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకుని, తీవ్ర విషాదాన్ని మిగాల్చాయి.మంధర్‌దేవి ఆలయం2005, జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగులగొడుతుండగా, కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.కుంభమేళా2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో పవిత్ర స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతిచెందారు. 140 మంది గాయపడ్డారు.చాముండా దేవి ఆలయంరాజస్థాన్లోని చాముండా దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. బాంబు ఉందంటూ వదంతులు తలెత్తిన నేపధ్యంలో తొక్కిసలాటలో జరిగింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా జనం గాయపడ్డారు.నైనా దేవి ఆలయంహిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో 2008లో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో162 మంది ప్రాణాలు కోల్పోయారు.రతన్‌గఢ్ ఆలయం2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోబోతున్నదనే వదంతితో తొక్కిసలాట జరిగింది.ఇండోర్2023, మార్చి 31 న ఇండోర్‌లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతిచెందారు.శబరిమల2011, జనవరి 14న కేరళలోని శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి పైగా జనం గాయపడ్డారు.గాంధీ మైదానంబీహార్లోని పాట్నాలో గల గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.పట్నా2012 నవంబర్ 19న పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛఠ్ పూజ సందర్భంగా ఒక తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.వైష్ణోదేవి ఆలయం2022, జనవరి 1న, జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు.రాజమండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 2015, జూలై 14న పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.హరిద్వార్ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్‌లో 2011 నవంబర్ 8న గంగానది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు.రామ్ జానకి ఆలయం2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 63 మంది మృతి చెందారు.హత్రాస్2024లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది మృతిచెందారు. 300కుపైగా జనం గాయపడ్డారు. జూలై 2న సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో ఈ తొక్కిసలాట జరిగింది.రాజ్‌కోట్2024, మే 23న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు.గుంపులో చిక్కుకున్నప్పుడు..ఎప్పుడైనా మనం రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి, గుంపులో చిక్కుకుపోయినప్పడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. కింద తెలిపిన పది ఉపాయాలు మనం గుంపునుంచి సురక్షితంగా బయటపడేందుకు సాయపడతాయి.1. మీరు ఎప్పుడైన రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోవాలి.2. మీరు వెళ్లిన ప్రదేశం గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉండాలి. మీరు జనసమూహంలో చిక్కుకుపోయినప్పుడు, ఆ ప్రాంతం మీకు పూర్తిగా తెలిస్తే అప్పడు మీరు సులభంగా బయటపడగలుగుతారు.3. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్ళే ముందు, ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నిష్క్రమణ ద్వారం సమీపంలో ఉండటం ఉత్తమం.4. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆపద మరింత పెద్దదవుతుంది.5. మీరు గుంపులో చిక్కుకుంటే వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. ఆందోళన చెందే బదులు, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకు నడవాలి.6. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ఆ జనసమూహం దిశగానే ముందుకు కదలాలి. అప్పుడు ఆపద నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొంచెం స్థలం కనిపించినా, దానిని సద్వినియోగం చేసుకోవాలి.7. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, మీరు మీ చేతులను బాక్సర్ మాదిరిగా మీ ఛాతీ ముందు ఉంచుకోవాలి. తద్వారా మీ ఛాతీ సురక్షితంగా ఉంటుంది.8. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకుని కిందపడిపోతే త్వరగా లేవడానికి ప్రయత్నించండి.9. మీరు జనసమూహంలో పడిపోయి లేవలేకపోతే, వెంటనే ఒక పక్కకు తిరిగి పడుకోండి. అలాగే మీ రెండు కాళ్ళను మీ ఛాతీకి తగిలించి, మీ చేతులను మీ తలపై ఉంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుతారు.10 మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో చిక్కుకుంటే గోడలకు దూరంగా ఉండండి. బారికేడింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. వెంటనే బయటకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
అయ్యో పాపం! ఇప్పుడే వస్తానంటూ.. ‘వెళ్లిపోయింది’
జనగామ: పక్షవాతంతో మంచాన పడిన భర్త.. ఆయనకు సపర్యలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్య.. ఏదో పనుండి ఇంట్లో నుంచి బయటకెళ్లిన భార్య కాస్తా కారు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడే వస్తానన్న భార్య మాట కోసం రెండు గంటలపాటు ఎదురుచూసి ఇక ఎప్పటికీరాదన్న విషయాన్ని తెలుసుకుని తను ఒంటరైపోయానని తల్లడిల్లిపోతున్న వైనం స్థానికుల్ని కలచివేస్తోంది. కష్టాల కడలిలో సంసార నావను ఈదుతోన్న కుటుంబాన్ని కారు ప్రమాద రూపంలో నిలువునా ముంచేసిన వైనం బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని లింగాల ఘనపురం మండలం వడిచెర్లకు చెందిన నంగునూరి సత్యనారాయణ, లక్ష్మి(65) దంపతులు జనగామలోని ఓల్డ్ లక్ష్మీకృష్ణ థియేటర్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాస ముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చిన్నతనం లోనే పిల్లలు చనిపోగా సత్యనారాయణ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నాళ్ల క్రితం పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో సత్యనారాయణ మంచానికే పరిమితమైపోయాడు. అప్పట్నుంచి ఆయనకు లక్ష్మి సపర్యలు చేస్తూ వస్తోంది. కుటుంబ పోషణ కోసం శ్రీచెన్న కేశ్వరస్వామి ఆలయంతోపాటు ఓ ప్రభుత్వ కార్యాలయంలో లక్ష్మి పనికి కుదిరింది. వచ్చిన డబ్బులతో భర్తకు వైద్యం చేయిస్తూ బతుకు బండి లాగిస్తోంది. ఈ క్రమంలో ఏదో పనుండి లక్ష్మి బయటకు వెళ్లాల్సి రావడంతో.. భర్తకు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో పక్కనే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య ఇంటి నుంచి ఆమె కుమారుడి కారును డ్రైవర్ వెనక్కి తీసుకొస్తుండగా అదుపుతప్పి కారు లక్ష్మి మీదకు దూసుకొచ్చింది. అప్పటికే తనవైపుగా వస్తున్న కారును చూసి ‘‘బాబూ.. మెల్లగా రా బాబూ’’..అంటూ లక్ష్మి ఎంత అరిచినా డ్రైవర్ వినిపించుకోకుండా కారును ఆమె పైనుంచి పోనివ్వడంతో లక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: ఇళ్లంతా సందడి.. కానీ చూస్తుండగానే..!) -
నెల్లూరుకు చెందిన విప్రో టెకీ దుర్మరణం
బెంగళూరు: టెక్ సేవల సంస్థ విప్రోలో మరో ఉద్యోగి ఆకస్మిక మరణం విషాదాన్ని రేపింది. ఇటీవల తల్లిదండ్రులకు వీడ్కోలు పలికేందుకు వచ్చి, కదులుతున్న రైలు దిగబోయి విప్రో టెకీ ఒకరు మరణించిన విషాద ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చేసుకుంది. చెన్నైనుంచి బెంగళూరుకు వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్‌కుమార్ కదులుతున్న రైల్లోంచి దిగబోతూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెఆర్ పురం రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కిరణ్‌కుమార్(38) ఈ మధ్యనే స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని రామమూర్తి నగర్లో ఉంటున్నారు. అయితే తన మూడు నెలల కుమారుడిని చూసేందుకు నెల్లూరు వచ్చిన కిరణ్ అనంతరం చెన్నై మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరుకు బయలుదేరారు. కెఆర్‌పురం స్టేషన్లో స్టాప్ లేక పోయినప్పటికీ, త్వరగా ఇంటికి చేరాలనే ఆతృతలో రైలు కొద్దిగా స్లో కావడంతో దిగేందుకు ప్రయత్నించారు. అయితే అదుపు తప్పి, ప్లాట్‌ఫాం, ట్రాక్‌నకు మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయారు. తీవ్ర గాయాలతో కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి సత్యప్ప ధృవీకరించారు. కాగా గత నెల డిసెంబరులో విప్రో ఉద్యోగి, కేరళకు చెందిన విక్రం విజయన్ (28) కదులుతున్న రైలునుంచి దిగడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోగా, గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగబోతూ ఈశ్వరమ్మ(65) చనిపోయారు. -
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన స్టడీ టూర్
పనాజి: విద్యార్థుల స్టడీ టూర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మికా యూనివర్శిటీ విద్యార్థుల స్టడీ టూర్ ఇద్దరు తెలివైన విద్యార్థుల పాలిట మృత్యుపాశమైంది. గోవాలోని కండోలిం బీచ్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అనూజా సుసాన్ పాల్ , గుర్రంచెంచు సాయి జ్ఞానేశ్వర్ అనే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ (సీసీసీ) ప్రోగ్రాంలో భాగంగా 47 మంది మికా విద్యార్ధులు గోవా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బీచ్‌కు వెళ్లినపుడు ప్రమాదవశాత్తూ ఇద్దరు బీచ్‌లో కొట్టుకుపోయారు. స్థానికుల సహాయంతో అంజు మృతదేహాన్ని, ఐదు గంటల తరువాత జ్ఞానేశ్వర్ బాడీని గుర్తించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు కన్నీటి సంద్రమయ్యారు. పౌర్ణమి రాత్రి కావడంతో గురువారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో, ఆరుగురు విద్యార్థుల బృందం కండోలిం బీచ్‌కు వెళ్లారని, దురదృష్టవశాత్తు ఇద్దరు మునిగిపోయి, ప్రాణాలను కోల్పోయారని ఇన్సిస్టిట్యూట్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే ఈ దుర్ఘటనపై తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించామని అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఇది తీవ్ర విషాదమంటూ వారి ఆత్మకుశాంతి కలగాలన్నారు. ఇద్దరు కో-ఆర్డినేటర్లు సహా ప్రొ. ప్రవీణ్ మిశ్రా, సీసీసీ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొ. నితేశ్ మొహంతి విద్యార్థులతో ఉన్నట్టు చెప్పారు. అక్కడి పరిస్థితిని మికా బృందం పరిస్థితిని పరిశీలిస్తోందని, బాధితులకు పూర్తి సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. -
ముగ్గురు మిత్రుల విషాదాంతం
డోన్‌టౌన్/క్రిష్ణగిరి: కర్నూలు జిల్లా డోన్ పోలీసు సర్కిల్ పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ శ్రీహరి తెలిపిన మేరకు.. చిత్తూరు పట్టణానికి చెందిన జగదీష్, అమర్నాథ్రెడ్డి, రాజేష్‌లు కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. జగదీష్ చిత్తూరు, బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల్లో గ్రానైట్, ఇతర మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. అమర్నాథ్రెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. రాజేష్ హోటల్ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగదీష్‌కు హైదరాబాద్‌కు చెందిన మీనాకుమారితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. 20 రోజుల క్రితం పాప జన్మించడంతో చూసొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అమర్నాథ్రెడ్డికి చెందిన డస్టర్ కారు(కేఈ 51 ఎండీ 4707)లో రాజేష్‌తో కలసి బయలుదేరారు. డోన్ మండల పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో జగదీష్(35), అమర్నాథ్రెడ్డి(35), రాజేష్(35)లు అక్కడికక్కడే మరణించారు. టోల్‌గేటు వద్దనున్న స్పీడు బ్రేకర్లే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్లను దాటుతుండగా.. వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడు అమర్నాథ్రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల తాలూకా మద్దినాయునిపల్లె. నాలుగేళ్ల క్రితం చంద్రగిరికి చెందిన కీర్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇరువురు సంతానం. క్యాటరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచిన బెంగళూరుకు చెందిన రాజేష్ మృతితో ఆయన తండ్రి పద్మనాభరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలో పెళ్లి చేయాలని భావిస్తున్న తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ డేగల ప్రభాకర్ పరిశీలించారు. టోల్‌ప్లాజా గన్‌మన్ సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో 2ఏళ్ల బాలుడు మృతి