train services cancelled
-
కరోనా ఎఫెక్ట్ : పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. అక్కడ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. తెలంగాణకు పొరుగునే ఉండటంతో అక్కడికి నడిపే రైళ్ల సంఖ్యను భారీగా తగ్గిస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. కొన్నింటిని కొన్ని తేదీల్లో మాత్రం రద్దు చేసింది. పరిస్థితి మెరుగుపడితే సర్వీసులను పునరుద్ధరించనుంది. ఇటీవల కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు కోవిడ్‌తో మృతి చెందడంతో ఆ ప్రాంతానికి నడిచే రైళ్ల సర్వీసులను కూడా తగ్గించటం గమనార్హం. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నడిచే కొన్ని ప్రధాన రైళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు షిర్డీ సర్వీసులను రద్దు చేసిన ఆర్టీసీ.. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు 4 సర్వీసులు తగ్గించింది. -
కరోనా ఎఫెక్ట్ : రద్దైన రైల్వే సర్వీసులు ఇవే..
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టు వేసే చర్యల్లో భాగంగా 12 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా తేదీల్లో 12 రైల్వే సర్వీసులను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దైన వాటిలో హైదరాబాద్-కలబురగి, కరీంనగర్-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాబ్, ముంబై- నాగ్‌పూర్, ముంబై-అజ్ని ట్రైన్ సర్వీసులు ఉన్నాయి. రైల్వే సర్వీసులు రద్దైన తేదీలు.. 1.11201- ముంబై ఎల్టీటీ-అజ్ని (23-03-2020, 30-3-2020) 2. 11202- అజ్ని- ముంబై ఎల్టీటీ (20-3-2020, 27-03-2020) 3. 11205- ముంబై ఎల్టీటీ-కరీంనగర్ (21-03-2020, 28-03-2020) 4. 11206- కరీంనగర్-ముంబై ఎల్టీటీ (22-03-2020, 29-03-2020) 5. 11401- ముంబై సీఎస్టీ-నాగ్‌పూర్ (23-03-2020, 01-04-2020) 6. 11402- నాగ్‌పూర్- ముంబై సీఎస్టీ (22-03-2020, 31-03-2020) 7. 11307- కలబురగి- హైదరాబాద్(18-03-2020,31-03-2020) 8. 11308- హైదరాబాద్- కలబురగి (18-03-2020,31-03-2020) 9. 06059- చెన్నై-సికింద్రాబాద్ (20-03-2020, 22-03-2020) 10. 06060- సికింద్రాబాద్-చెన్నై (21-03-2020, 23-03-2020) 11. 82841- శాంత్రాగచ్చి-చెన్నై (20-03-2020, 27-03-2020) 12. 82842- చెన్నై-శాంత్రాగచ్చి(21-03-2020, 28-03-2020) చదవండి : కరోనా: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50! -
పలు రైళ్ల రద్దు
విజయనగరం టౌన్: పెథాయ్ ప్రభావం రైల్వేశాఖపై పడింది. తుఫాన్ తాకిడి ఎక్కువగా ఉండడం, పెనుగాలులు వీస్తుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే శాఖ పలు రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించారు. వీటితో పాటు రెగ్యులర్‌గా వచ్చే ప్యాసింజర్ రైళ్లతో పాటు, తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లే రైళ్లను రద్దుచేసింది. ఆయా స్టేషన్లలో కొన్ని రైళ్లను నిలుపుదల చేసి, వాతావరణం అనుకూలంగా ఉన్న తర్వాతనే పంపిస్తోంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా విజయనగరం రైల్వేస్టేషన్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కేవలం రిజర్వేషన్ల ద్వారా వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు, అత్యవసరమైన ప్రయాణాలు తప్ప మరెవరూ కానరాలేదు. గాలుల తాకిడి, మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రయాణాలు వాయిదాలు వేస్తున్నారు. విజయనగరం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను స్టేషన్లోనే గంటల తరబడి ఉంచేశారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు రైళ్ల రాకపోకలకు కాస్త ఇబ్బందులు ఏర్పడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా అయ్యప్ప దీక్షాపరులు ఇరుముడులతో బయలుదేరి, గంటల తరబడి స్టేషన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చిన్నారులతో ప్రయాణాలు చేసేవాళ్లు, వృద్ధులు చలిగాలులకు ఇబ్బందులు పడ్డారు. దారిమళ్లించిన రైళ్ల వివరాలు రైలు నంబరు 20809 సంబల్ పూర్ – నాందేడ్ ఎక్స్‌ప్రెస్ సంబల్పూర్ నుంచి టిట్లాఘర్, రాయపూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. రైలునంబరు 22663 హౌరా –యశ్వంత్‌పూర్ హౌరా నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగూడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా పంపించారు. 18645 హౌరా– హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను హౌరా నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగూడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా పంపించారు. 15906 దిబ్రూఘర్, కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ను దిబ్రూఘర్ నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగుడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. 22605 పురులియా– విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ను పురులియా నుంచి హిజిలి, ఝార్సుగుడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. మరికొన్ని రైళ్ల సమయ వేళల్లో మార్పులు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలిలా.. రైలు నంబరు 67292 విశాఖ – విజయనగరం ప్యాసింజర్, 67291 విజయనగరం–విశాఖ ప్యాసింజర్, 67294 విశాఖ– శ్రీకాకుళం ప్యాసింజర్, 67281 శ్రీకాకుళం రోడ్డు – పలాస ప్యాసింజర్, 67282 పలాస –విజయనగరం ప్యాసింజర్లను రద్దుచేశారు. 18న, 67293 విజయనగరం –విశాఖ ప్యాసింజర్‌ను రద్దుచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే.. విజయనగరం రైల్వేస్టేషన్లో హెల్ప్‌డెస్క్ నంబర్లను కమర్షియల్ విభాగం అధికారులు ఏర్పాటుచేశారు. రైల్వేఫోన్ ద్వారా 83331, 83332, 83333, 83334 బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ : 08922–221202, 221206 బీఎస్ఎన్ఎల్ మొబైల్: 8500358610, 8500358712 ఎయిర్టెల్: 8106052987, 8106053006 -
విద్యుత్ సంక్షోభంతో 28 రైళ్లు రద్దు
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు. కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు- తిరుపతి సెక్షన్ల మధ్య 8 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. చెన్నై- పినాకిని ఎక్స్ ప్రెస్, విజయవాడ- చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. విజయవాడ- బిట్రగుంట, బిట్రగుంట- విజయవాడ, బిట్రగుంట - చెన్నై, చెన్నై - బిట్ర గుంట, చెన్నై-గూడూరు మధ్య నడవాల్సిన ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడ మీదుగా.. తిరుపతి - సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడ మీదుగా మళ్లించారు. సోమవారం లోగా విద్యుత్ పునరుద్ధరణ జరగకపోతే రైళ్లన్నీ ఆగిపోయే ప్రమాదముందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.