
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. అక్కడ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. తెలంగాణకు పొరుగునే ఉండటంతో అక్కడికి నడిపే రైళ్ల సంఖ్యను భారీగా తగ్గిస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. కొన్నింటిని కొన్ని తేదీల్లో మాత్రం రద్దు చేసింది. పరిస్థితి మెరుగుపడితే సర్వీసులను పునరుద్ధరించనుంది. ఇటీవల కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు కోవిడ్‌తో మృతి చెందడంతో ఆ ప్రాంతానికి నడిచే రైళ్ల సర్వీసులను కూడా తగ్గించటం గమనార్హం. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య నడిచే కొన్ని ప్రధాన రైళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు షిర్డీ సర్వీసులను రద్దు చేసిన ఆర్టీసీ.. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు 4 సర్వీసులు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment