సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టు వేసే చర్యల్లో భాగంగా 12 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా తేదీల్లో 12 రైల్వే సర్వీసులను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దైన వాటిలో హైదరాబాద్-కలబురగి, కరీంనగర్-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాబ్, ముంబై- నాగ్‌పూర్, ముంబై-అజ్ని ట్రైన్ సర్వీసులు ఉన్నాయి.
రైల్వే సర్వీసులు రద్దైన తేదీలు..
1.11201- ముంబై ఎల్‌టీటీ-అజ్ని (23-03-2020, 30-3-2020)
2. 11202- అజ్ని- ముంబై ఎల్‌టీటీ (20-3-2020, 27-03-2020)
3. 11205- ముంబై ఎల్‌టీటీ-కరీంనగర్ (21-03-2020, 28-03-2020)
4. 11206- కరీంనగర్-ముంబై ఎల్‌టీటీ (22-03-2020, 29-03-2020)
5. 11401- ముంబై సీఎస్‌టీ-నాగ్‌పూర్ (23-03-2020, 01-04-2020)
6. 11402- నాగ్‌పూర్- ముంబై సీఎస్‌టీ (22-03-2020, 31-03-2020)
7. 11307- కలబురగి- హైదరాబాద్(18-03-2020,31-03-2020)
8. 11308- హైదరాబాద్- కలబురగి (18-03-2020,31-03-2020)
9. 06059- చెన్నై-సికింద్రాబాద్ (20-03-2020, 22-03-2020)
10. 06060- సికింద్రాబాద్-చెన్నై (21-03-2020, 23-03-2020)
11. 82841- శాంత్రాగచ్చి-చెన్నై (20-03-2020, 27-03-2020)
12. 82842- చెన్నై-శాంత్రాగచ్చి(21-03-2020, 28-03-2020)
Comments
Please login to add a commentAdd a comment