సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు.
కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు- తిరుపతి సెక్షన్ల మధ్య 8 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. చెన్నై- పినాకిని ఎక్స్ ప్రెస్, విజయవాడ- చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. విజయవాడ- బిట్రగుంట, బిట్రగుంట- విజయవాడ, బిట్రగుంట - చెన్నై, చెన్నై - బిట్ర గుంట, చెన్నై-గూడూరు మధ్య నడవాల్సిన ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడ మీదుగా.. తిరుపతి - సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి, డోన్, కాచిగూడ మీదుగా మళ్లించారు. సోమవారం లోగా విద్యుత్ పునరుద్ధరణ జరగకపోతే రైళ్లన్నీ ఆగిపోయే ప్రమాదముందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
విద్యుత్ సంక్షోభంతో 28 రైళ్లు రద్దు
Published Sun, Oct 6 2013 4:28 PM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM
Advertisement