విద్యుత్ బకాయిలపై దృష్టి సారించండి
ట్రాన్స్కో డీఈ నాగరాజు
పులివెందుల రూరల్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా బిల్లుల బకాయిలు ఉన్నాయని.. వాటిపై దృష్టి సారించి వసూళ్లు చేయాలని విద్యుత్ శాఖ డీఈ నాగరాజు సూచించారు. బుధవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఏడీఏ, ఏఈ, బిల్లింగ్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి పథకాలకు సంబంధించి దాదాపు రూ1.50కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వీటిపై సంబంధిత అధికారులతోచర్చించి వసూళ్లు చేయాలన్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ తీగలు మరమ్మత్తుకు గురైన చోట వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. కొత్త మీటరు ఏర్పాటుకు మీసేవ కేంద్రాలలోనే వినియోగదారులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పులివెందుల అర్బన్, వేంపల్లె ఏడీఏలు రఘు, శ్రీకాంత్, పులివెందుల అర్బన్, రూరల్ ఏఈలు రవీంద్రప్రసాద్, జయసుధాకర్రెడ్డి, డివిజన్ పరిధిలోని ఏఈలు తదితరులు పాల్గొన్నారు.