Transgender cases
-
డబ్బుల వివాదంతోనే హత్య
కొండాపూర్(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ట్రాన్స్ జెండర్ హత్య కేసును పోలీసులు ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీంద్రా రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్కు చెందిన దీపిక అంబర్‌పేటకు చెందిన సాయిహర్ష మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీపిక బోనాల పండగ సమయంలో సంపాదించిన డబ్బుతో వారు జీవనం సాగించేవారు. దీపిక ఆర్థిక లావాదేవీలు సాయిహర్ష చూసుకునేవాడు. దీపిక గతంలో సాయిహర్ష నుంచి రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరడంతో దీపిక అతడికి దూరంగా ఉండటం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సాయిహర్ష ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న దీపిక మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కొండాపూర్ మండలం మారేపల్లిలో బోనాల జాతరకు హాజరైంది. దీనిపై సమాచారం అందడంతో సాయిహర్ష కూడా మారేపల్లికి వెళ్లాడు. బోనాల జాతర ముగిసిన అనంతరం మద్యం తాగి, భోజనం చేశారు. అనంతరం అందరు కలిసి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీపికకు ఎక్కువగా మద్యం తాగించిన సాయి హర్ష కారులోనే ఆమె ప్రైవేట్ భాగాలపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో నిందితుడు ఆమెను లింగంపల్లిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సాయిహర్ష దీపిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి దీపిక చనిపోయిందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీపిక సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొండాపూర్ పోలీసులు సాయిహర్షను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దీపిక పట్టా గొలుసులు, బోనం, మేకప్ కిట్, కారును స్వాదీనం చేసుకున్నారు. సాయిహర్షపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీపికతో పాటు ఇంటి నుంచి వచ్చిన మరో స్నేహితుడి శివ ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. సాయిహర్ష ఒక్కడే హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చినప్పటికీ శివపాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీఐ సంతో‹Ùకుమార్, ఎస్ఐ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మూసీ ముంచేసి..) -
నయంకాని వ్యాధితో.. హిజ్రా ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పెన్నానగర్లో పిక్కిలి రామ్మోహన్ (20) అనే హిజ్రా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెన్నానగర్‌కు చెందిన పెద్దక్కకు రామ్మోహన్ ఒక్కగానొక్క కుమారుడు. అతను నాలుగేళ్ల నుంచి పట్టణంలోని హిజ్రాల వెంట తిరిగేవాడు. వారితో కలిసి ప్రోగ్రాంలు, వంట చేయడానికి తరచు వెళ్లేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం అతను ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు నయంకాని వ్యాధి సోకినట్లు తెలిపాడు. దీంతో అతను వైద్యుల సూచన మేరకు వ్యాధికి సంబంధించిన మందులు ఇంటికి తెచ్చుకొని రోజూ వాడేవాడు. మందు డబ్బాలను చూసిన తల్లి ఎందుకు ఇన్ని మందులు వాడుతున్నావు.. ఏమైంది అని అడిగింది. రెండు రోజుల వరకు అతను తల్లికి అసలు విషయం చెప్పలేదు. అయితే ఆమె బలవంతం చేయడంతో వ్యాధి సోకిన విషయం చెప్పాడు. ఆ రోజు నుంచి ఇక నేను బతకను.. చచ్చిపోతాను అని తల్లితో చెప్పేవాడు. శుక్రవారం తల్లి దోసెలు తీసుకొని రాగా, కొద్ది సేపటి తర్వాత తింటానని చెప్పాడు. బయటికి వెళ్లిన పెద్దక్క గంట తర్వాత ఇంటికి రాగా రామ్మోహన్ ఫ్యాన్‌కు చీర కట్టుకొని ఉరి వేసుకున్నాడు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే అతను చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. -
రాష్ట్రంలో భారీగా లింగమార్పిడి కేసులు
యువతుల్లా మారడంపైనే ఎక్కువమందికి ఆసక్తి కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాల్లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య దేశాల తరహాలో మన రాష్ట్రంలోనూ లింగమార్పిడి కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో లింగమార్పిడి చికిత్సలు పెరిగాయి. వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొందరు పురుషులు లింగమార్పిడి చికిత్సల ద్వారా స్త్రీలుగా మారుతున్నారు. అలాగే కొందరు స్త్రీలు లింగమార్పిడి ద్వారా పురుషుని రూపం సంతరించుకుంటున్నారు. ఇదే తరహాలో కొందరు పురుషులు, మహిళలు లింగమార్పిడి ద్వారా ఇతరులు (ఆడా, మగా కానివారు)గా మారుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటికే 1,641 మంది సెక్స్ మార్పిడి చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో 773 మంది మహిళలు లింగమార్పిడి ప్రక్రియ ద్వారా పురుషులుగా మారగా, 844 మంది పురుషులు యువతులుగా రూపు మార్చుకున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్కొంది. లింగమార్పిడిపై మహిళలకంటే పురుషులే అధిక ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రాష్ట్ర ఓటర్ల జాబితా ప్రకారం వివరాలిలా ఉన్నాయి. * రాష్ట్రంలో 19 ఏళ్లు దాటిన వారిలో 740 మంది మహిళలు, ఆరుగురు ఇతరులు కలిపి మొత్తం 746 మంది పురుషులుగా లింగమార్పిడి చేయించుకున్నారు. *18 -19 ఏళ్ల మధ్య వయసుగల 33 మంది యువతులు యువకుల్లా మారారు. *19 ఏళ్లు దాటిన వారిలో 810 మంది పురుషులు, ఏడుగురు ఇతరులు కలిపి మొత్తం 817 మంది మహిళలుగా మారారు. *18 -19 ఏళ్ల యువకుల్లో 34 మంది.. ఇతరుల్లో ఇద్దరు కలిపి మొత్తం 36 మంది యువతులుగా లింగమార్పిడి చేయించుకున్నారు. * నలుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఇతరులుగా (ఆడా మగాకాని వారిగా) మారారు. *ఇవి ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించిన ఓటర్ల జాబితాలోని గణాంకాలు మాత్రమే. *లింగమార్పిడి చేయించుకున్నా వెల్లడించని కేసులు పెద్ద సంఖ్యలో ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.