transportation problem
-
పొడవైన సొరంగ మార్గం...
సాధారణంగా బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భ సొరంగ మార్గాలు నిర్మిస్తారు. వీటికి భారీ వ్యయంతోపాటు చాలా ఏళ్లపాటు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. రవాణాకు ప్రత్యామ్నాయంలేని సమయంలో ఈ మార్గాలను ఎంచుకుంటారు. ఇదే కోవకు చెంది, దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించింది ‘గోథార్డ్ సొరంగం’. ఇది స్విట్జర్లాండ్‌లో పలు రవాణా సమస్యలను అధిగమించేందుకు నిర్మించారు. ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ సొరంగ రైలు మార్గం ఇది. ఈ నెల జూన్ 1న ప్రారంభమైన నేపథ్యంలో దీని పూర్తి విశేషాలు తెలుసుకుందాం... ప్రత్యేకతలు.. గోథార్డ్ బేస్డ్ రైలు సొరంగ మార్గం. ఇది స్విట్జర్లాండ్‌లో ఉంది. రెండు ప్రధాన నగరాలను కలుపుతూ 57 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. దీనిలో రెండు సింగిల్ ట్రాక్స్‌తో కూడిన మార్గాలను ఏర్పాటు చేశారు.స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్ ,దక్షిణ యూరప్ ప్రాంతాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఈ రైలు మార్గం మొత్తం పొడవు 152 కి.మీ కాగా అందులో 57 కి.మీలు భూగర్భ మార్గం కావడం విశేషం. పర్వతాల ఉపరితలం నుంచి 2.5 కిలోమీటర్ల లోతులో, దాదాపు 73 రకాల కఠినమైన శిలలను తొలగించి దీన్ని నిర్మించారు. ఎత్తై కొండల మధ్య నిర్మించిన గోథార్డ్ను ఈ ఏడాది జూన్ 1న ప్రారంభించారు. డిసెంబర్ నుంచి పూర్తి రైల్వే సేవలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. ఈ మార్గం నిర్మాణం పూర్తయితే స్విస్‌లోని జూరిచ్ ప్రాంతం నుంచి ఇటలీలోని మిలాన్ చేరుకోవడానికి కేవలం రెండున్నర గంటల సమయమే పడుతుంది. అయితే జపాన్‌లోని సీకన్ సొరంగ మార్గం 53 కి.మీ మేర ఉండి ప్రపంచంలో అతి పెద్దదిగాను, తర్వాత బ్రిటన్-ప్రాన్స్‌లను కలుపుతూ 50 కి.మీ దూరంతో ఉన్న సొరంగ మార్గం రెండవ స్థానంలో ఉండేవి. గోథార్డ్ బేస్డ్ దీని రికార్డులను తిరగరాస్తూ... 57 కి.మీ సొరంగ మార్గం ఉండి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దూరం తగ్గించేందుకే... ఆల్ఫ్, దక్షిణ యూరప్ ప్రాంతాలకు మధ్య పూర్తిగా రాళ్లతో నిండిన కొండలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రవాణాకు బాగా ఇబ్బందులేర్పడేవి. ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో 1980 నాటికే చాలా సొరంగ మార్గాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆల్ఫ్కి చేరువలో ఉన్న ఎరెస్టిఫైడ్ నుంచి దక్షిణ యూరప్‌లోని టింకోప్రాంతాన్ని కలుపుతూ ఓ సొరంగ మార్గాన్ని నిర్మించారు. కాని ఇది చిన్నగా ఉండడంతో రైళ్ల రాకపోకలకు అనువుగా ఉండేది కాదు. 1947లోనే నాటి ఇంజనీర్ ఎడ్వర్డ్ గ్రూనర్ సలహా మేరకు గోథార్డ్ను ప్రారంభించదలచారు. ఆ సమయంలో ప్రఖ్యాత ఇంజనీర్ జియోవాన్ని లంబార్డి నేతృత్వంలో దీనికి నమూనాలను తయారుచేశారు.అనంతరం 1996లో పని ప్రారంభించారు. రోజూ 2500 మంది కష్ట ఫలితమే... బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఈ ఏడాది జనవరి నాటికే పూర్తయింది. దీని నిర్మాణానికి ముందస్తుగానే 20 ఏళ్ల ప్రణాళికను స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజు 2500 మంది కూలీలు 20 ఏళ్లుగా దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అంతేకాదు ఈ మార్గం గుండా నడిచే రైళ్లన్నీ విద్యుత్తు ద్వారానే నడుస్తాయి.గంటకు 250 నుంచి 260 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.ప్రయోజనాలు.. భారీ పెట్టుబడులను వెచ్చించి నిర్మించిన ఈ సొరంగ మార్గం రవాణా సౌకర్యాన్ని చాలా వరకు మెరుగుపర్చింది. 3500 నుంచి 4000 టన్నుల వరకు ఒక్కో రైలులో రవాణా చేయవచ్చు. ఇక్కడ ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లలో ప్రతి రోజు 260 గూడ్స్, 64 ప్యాసింజర్ రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ మార్గం గుండా ప్రయాణించడంతో సమయం చాలా వరకు ఆదా అవుతుంది. కేవలం 45 నిమిషాల్లో ఎరెస్టిఫెడ్ నుంచి బోడియో ప్రాంతానికి చేరుకోవచ్చు. స్విస్ ఓటర్ల సాయంతోనే.. గోథార్డ్ సొరంగ మార్గం నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని స్విస్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇంత మొత్తం తన దగ్గర లేకపోవడంతో స్విస్ ప్రారంభంలో యూరోపియన్ దేశాల సహకారం కోరింది.ఆ దేశాల నుంచి సహాయం అందినప్పటికీ దీని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 1990లోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయి. స్విస్ ఓటర్లు ముందుకొచ్చి ప్రభుత్వానికి చేయూతనిచ్చారు. ఒక్కో ఓటరు దాదాపు రూ.90 వేలు సహాయంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. వీరి సహాయంతోనే ఈ ప్రాజెక్టు 2016 జనవరినాటికే పూర్తయింది. 2016 జూన్1 న ప్రారంభం.. 2016 జనవరిలోనే ఈ ప్రాజెక్టు పూర్తి నిర్మాణం పూర్తయింది. స్విస్ ఫెడరల్ అధ్యక్షుడు జోహాన్ సీండర్ అమ్మాన్ సహా జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెలా, ప్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్, ఇటలీ ప్రధాని మట్టియో రెంజీలు ఈ ప్రాజెక్టును లాంచనంగా జూన్ 1న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 9మంది స్విస్ కార్మికులకు అమ్మాన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. -
కిలో వంకాయలు 200.. టమోటా 120!
భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన చెన్నై నగరంలో జనజీవనం దుర్భరంగా తయారైంది. వంకాయలు కిలో రూ. 200, టమోటా రూ. 120 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో చాలామందికి ఖాతాల్లో డబ్బులున్నా, చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నారు. నిత్యావసరాల కొరత పట్టిపీడిస్తోంది. ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అంతటా ఆందోళన నెలకొంది. దాదాపు ఆరు రోజులుగా చెన్నైలో చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ప్రాంతాల వారీగా కరెంటును పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నా, ఇంకా నీరు నిల్వ ఉండటంతో ఎప్పటికి వస్తుందో చెప్పలేకపోతున్నారు. టెలికం వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. కొన్ని శివారు ప్రాంతాల్లో మాత్రమే ఫోన్లు పనిచేస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్, ప్రైవేటు ఆపరేటర్ల ఫోన్లు ఏవీ పనిచేయడం లేదు. దాంతో తమవాళ్లు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక సతమతం అవుతున్నారు రవాణా ఇంకా అనుమానమే తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ ఏ మార్గంలోనూ ఇంకా సరిగా లేదు. రోడ్డు, రైల్వే, విమాన ప్రయాణాలు ఏవీ ఇంకా మొదలు కావట్లేదు. శుక్రవారం నాడు మెరీనా బీచ్ నుంచి నాలుగు రైళ్లను హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు నడిపించారు గానీ శనివారం మళ్లీ రైళ్లు ఆగిపోయాయి. కోయంబేడు బస్టాండు నుంచి కూడా పదుల సంఖ్యలో మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. కోయంబేడు బ్రిడ్జి మీద నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాధ్యపడటం లేదు. ఇక అరక్కోణం విమానాశ్రయం నుంచి చిన్నచిన్న విమానాలను నడిపించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు భావించారు. ఈరోజు తనిఖీలు చేశాక తుది నిర్ణయం తీసుకుంటారు. తాంబరం ఎయిర్‌పోర్టు నుంచి అరక్కోణం తీసుకెళ్లి, అక్కడ నుంచి విమానాలు నడిపించాలని చూస్తున్నారు. అన్నీ సర్వనాశనం: స్థానికులు నాలుగు రోజుల నుంచి కరెంటు లేదని, తొలుత పీకలోతు వరకు ఉండే నీళ్లు ఇప్పుడు కొంచెం తగ్గాయని, అయితే ఒక్కళ్లు కూడా తమను చూసేందుకు రాలేదని స్థానికులు వాపోయారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లు అన్నీ పాడైపోయాయని, వాహనాలు సర్వనాశనం అయ్యాయని చెప్పారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి లీటరు పాలు రూ. 150 పెట్టి కొనుక్కురావాల్సి వస్తోందని తెలిపారు. ఎవరికైనా ఏమైనా చెబుదామంటే ఫోన్లు పనిచేయడం లేదని అన్నారు. అంబులెన్సును పిలవాలన్నా వీలుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
తుడాకు కేంద్రం ఊతం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలోని ప్రజల రవాణా కష్టాలు కడతేరనున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం(జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్) పథకం కింద 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను కేంద్రం విడుదల చేసింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించేందుకు 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డీ.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుడా పరిధిలోని తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరుగుతూ వస్తోంది. పట్టణీకరణ అధికమవుతున్న మేరకు రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు అప్పలాయగుంటకు భక్తుల తాకిడి అధికమవుతుండడం.. స్థానిక జనాభా పెరిగిపోతుండడం.. రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో తుడా పరిధిలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. తుడా పరిధిలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి 2011-12లో రూ.225 కోట్లతో తుడా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కనీసం లక్ష జనాభాకు 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని తుడా అధికారులు రూపొందించిన ప్రణాళికపై కేంద్రం ఆమోదముద్ర వేసింది. తుడా పరిధిలో 450 బస్సుల కొనుగోలుకు రూ.225 కోట్లను విడుదల చేస్తామని అప్పట్లో కేంద్రం అంగీకరించింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలుకు రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేస్తామని అప్పట్లోనే కేంద్రం స్పష్టీకరించింది. ఆ మేరకు 2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లను మంజూరు చేసింది. 2013-14లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను 4 నెలల క్రితం విడుదల చేసింది. 2014-15 బడ్జెట్లో 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లో 65 బస్సుల కొనుగోలుకు నిధులను విడుదల చేస్తే.. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తవుతుంది. ఇక చిత్తూరు కార్పొరేషన్లో 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను మంజూరు చేశారు. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తై రవాణా కష్టాలు తీరడం ఖాయం. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయడం సంస్థకు జీవం పోసినట్లయిందని ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.