Trapping
-
తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తరహాలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణలో బయటకువచ్చిన మధ్యవర్తుల ఆడియో టేపుల ద్వారా ఈ కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్‌చేశారు. శనివారం సిసోడియా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దళారిగా చెబుతున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో టేప్‌ను మీడియాకు వినిపించారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాజ్నా«థ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలతో నిందితుల్లో కొందరు దిగిన ఫొటోలను మీడియాకు సిసోడియా చూపించారు. రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ అనే మధ్యవర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎలా కుట్ర పన్నారో ఆడియో టేప్‌లో స్పష్టంగా వెల్లడైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలను కొనే వ్యవహారాన్ని నడిపిస్తున్నామని ఆడియో టేప్‌లో వినిపించిన అంశాన్ని సిసోడియా ప్రస్తావించారు. ‘ఇంకో ఆడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కొనుగోలు తతంగం కొనసాగుతోందన్నారు. అంటే అంతటి భారీమొత్తంలో బీజేపీ నగదు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది’ అని అన్నారు. ‘ టేపుల్లో దళారులు అమిత్ షా పేరును పరోక్షంగా ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకరం. షా ప్రమేయం ఉంటే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. హోంశాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఈడీ విచారణ చేపట్టాలి’ అని అన్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనే అలవాటున్న బీజేపీకి ఉన్న రాజకీయపార్టీ గుర్తింపును ఈసీ రద్దుచేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ డిమాండ్‌చేశారు. -
వితంతు మహిళలే టార్గెట్.. నమ్మించి..
సాక్షి, విశాఖపట్నం: ఒంటరి, వితంతు మహిళలే టార్గెట్... సోషల్ మీడియా వేదికగా వారికి వల వేసి నమ్మించడం... అనంతరం పెళ్లి చేసుకుని దొరికిన కాడికి దోచుకుని పరారవడం... ఇదీ జవహర్ బాలకృష్ణన్ అలియాస్ బాలాకుమార్ బాగోతం. ఒకరు కాదు... ఇద్దరు కాదు... సుమారు 30 మంది మహిళలను మోసగించిన ఈ కేటుగాడు జూన్ 6న చిట్టి మాము గ్యాంగ్‌తో కలిసి మాదకద్రవ్యాలు తరలిస్తూ టాస్క్ఫోర్సు పోలీసులకు చిక్కాడు. అప్పటి నుంచి విచారిస్తుంటే పోలీసులే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ఫోర్సు ఏసీపీ త్రినాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతానికి చెందిన చిలకూరి జవహర్ బాలకృష్ణన్ సులువుగా డబ్బులు సంపాదించేందుకు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, బాగా డబ్బులు ఉండి రెండో పెళ్లి కోసం ఎదురుచూసే మహిళలు... భర్త చనిపోయి మరో పెళ్లి కోసం ఎదురు చూసే డబ్బున్న మహిళలనే టార్గెట్ చేస్తూ మ్యాట్రిమోనీ, ఫేస్బుక్, వాట్సాప్‌ల సాయంతో పరిచయం పెంచుకునేవాడు. తన ఫొటోలు, ఇతర వివరాలు పంపించడంతో సదరు మహిళలు సులువుగా నమ్మేసేవారు. అనంతరం వారిని పెళ్లి చేసుకుని నమ్మకంగా ఉంటూ కొద్ది రోజుల తర్వాత డబ్బు, నగలుతో పరారయ్యేవాడు. మరికొందరితో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు చూపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 30 మంది మహిళను మోసం చేసినట్లు తెలిసింది. ఇలా మోసపోయిన వారిలో 17 మంది పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు చేశారు. మరోవైపు పలువురు వ్యాపారవేత్తలకు ప్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పలు రాష్ట్రాల్లో 25 వరకు కేసులున్నాయి. విశాఖలోనూ మూడు కేసులు నమోదయ్యాయి. చిట్టిమాముతో జట్టుకట్టి... ఓ మోసం కేసులో జవహర్ బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు ఆరిలోవలోని కేంద్ర కారాగారానికి కొన్ని నెలల కిందట తరలించారు. అక్కడే జైలులో రౌడీషీటర్ చిట్టిమాముతో బాలకృష్ణన్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా జైలు నుంచి రెండు నెలల కిందట కొంతమంది ఖైదీలను విడుదల చేశారు. ఆ సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణన్ వెంటనే చిట్టిమాము గ్యాంగ్‌లో చేరాడు. అప్పటి నుంచి చిట్టిమాముతో కలిసి నగరంలో పలు సెటిల్మెంట్లు చేశాడు. పట్టించిన పుట్టినరోజు వేడుక జైలు నుంచి విడుదలయ్యాక రౌడీషీటర్ చిట్టిమాము పుట్టిన రోజు వేడుకను ఈ నెల 5న కూర్మనపాలెం ప్రాంతంలోని అక్షిత గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు ఒక్కసారిగా దాడి చేయగా 30 మంది చిక్కారు. వారందరిపైనా లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. అయితే కీలకమైన చిట్టిమాముతోసహా ఐదుగురు పరారయ్యారు. వారికోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మరుసటి రోజు జూన్ 6న తెల్లవారుజామున జాతీయ రహదారిపై 20 కిలోల గంజాయి, రూ.1.5లక్షల నగదు, 24 బీరు బాటిళ్లు, మూడు మద్యం సీసాలు కారులో తరలిస్తూ చిక్కారు. చిట్టిమాము, జవహర్, ఆనంద్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని ఏసీపీ త్రినాథ్ ఆధ్వర్యంలో విచారించగా జవహర్ బాలకృష్ణన్ అంతర్రాష్ట్ర మోసగాడని గుర్తించారు. మరింత లోతుగా విచారించడంతో మోసాలన్నీ వెలుగులోకి రావడంతో పోలీసులే విస్తుపోతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇంకా లోతుగా దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ త్రినాథ్ పేర్కొన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచుతున్నాం మాదకద్రవ్యాలు తరలిస్తున్నారన్న సమాచారంతో జూన్ 5న కూర్మన్నపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్‌పై దాడి చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నాం. మమ్మల్ని చూసి పరారైన వారిపై అనుమానంతో గాలించగా మరుసటి రోజు చిట్టిమాము, జవహర్ బాలకృష్ణన్ చిక్కారు. విచారణలో బాలకృష్ణన్ బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో నగరంలోని రౌడీïÙటర్లపై నిఘా పెంచుతున్నాం. తప్పు చేసి ఎవరూ తప్పించుకోలేరు. – త్రినాథ్, ఏసీపీ, టాస్‌్కఫోర్స్ -
హలో..
నాకో సమస్య ఉంది... మీరే తీర్చాలిఅపరిచిత మహిళ నుంచి ఫోన్ కాల్గంటల తరబడి మాటల ప్రవాహంకొన్నాళ్లు వరుసగా ఫోన్లలో సంభాషణఆపై భర్తను అంటూ మరో వ్యక్తి ఫోన్నా భార్యను ట్రాప్ చేశావంటూ ఆరోపణపంచాయితీకి రావాలని బెదిరింపునష్టపరిహారం పేరుతో డబ్బుల డిమాండ్బయటకు చెప్పుకోలేకపోతున్న బాధితులు సాక్షి ప్రతినిధి, వరంగల్: నగరంలో నయా మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లను ఆసరాగా చేసుకుని మొదట మాటలు కలుపుతూ.. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతూ అందినకాడికి దోచుకునే ముఠా నగరంలో వరుసగా మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా వేసే ట్రాప్‌లో చిక్కుకున్న పురుషులు.. జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ట్రాప్‌లో నుంచి బయట పడేందుకు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. మోసం తీరు ఇలా.. తెలియని నంబరు నుంచి మొబైల్ ఫోన్‌కి కాల్ వస్తుంది. అవతలి వైపు ఓ మహిళ అమాయకంగా, ఆందోళనతో ‘హాలో సార్ నమసే’ అంటూ మాటలు కలుపుతోంది. తను సమస్యల్లో ఉన్నానని చెబుతోంది. ‘ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి బయటపడేందుకు తోచిన పది నంబర్లతో ఫోన్ చేస్తే మీకు కలిసిందది’ అంటూ పరిచయం చేసుకుంటోంది. తన సమస్యను చెప్పుకుంటున్నట్లుగా గంటల తరబడి సంభాషణ కొనసాగిస్తోంది. ఆ తర్వాత పదేపదే ఆమె కాల్ చేస్తూ తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో చెప్పాలంటూ మాటల వల విసురుతోంది. ఈ మాటల తీరుకు ఆకర్షితులై ... ఈ సంభాషణల పరంపర కొన్నాళ్ల పాటు ఫోన్లో కొనసాగుతోంది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే .. హఠాత్తుగా ఓ పురుషుడి నుంచి ఫోన్ వస్తోంది. ‘హలో ఎలా ఉన్నారు సార్ అంటూ వ్యంగమైన ప్రశ్నతో సంభాషణ మొదలవుతోంది. మీరెవరు అని అడిగితే...‘ రోజు మీరు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్న మహిళను అంటూ కోపంగా మాట్లాడుతాడు. ‘నీ వల్ల నా కుటుంబం నాశనమైంది’ అంటూ శాపనార్థాలు.. ఆ తర్వాత బెదిరింపులు మొదలవుతున్నాయి. పంచాయితీకి రా.. ‘నా భార్యతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నావ్. నా భార్యను ట్రాప్ చేశావ్ . ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. ఈ విషయం నలుగురిలో మాట్లాడి పంచాయితీ పెడితే తప్ప పరిష్కారం ఉండదు. కాబట్టి ఎప్పుడు పంచాయతీ పెడదాం’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. స్పందించకుంటే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులం అంటూ మరికొందరు రంగంలోకి దిగుతున్నారు. మహిళతో ఫోన్లో మాట్లాడిన కాల్‌లిస్ట్, సంభాషణ రికార్డులతో పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటూ ఒత్తిడిని తీవ్రం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసా.. లేక పంచాయితీలో మాట్లాడుకుందామా అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బయటకు పొక్కితే పరువు పోతుందనే భయాన్ని అపరిచిత మహిళతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తికి కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ముఠా సభ్యులే పోలీసు అధికారుల్లా ఫోన్లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడిలో ఆ వ్యక్తి ఉండగానే కేసు వద్దు.. పంచాయితీ వద్దు.. నష్టపరిహారం చెల్లించుకుని సమస్యను పరిష్కరించుకో.. అనే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. బాధిత వ్యక్తి హోదా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఓ రేటు దగ్గర పంచాయతీ డీల్ కుదురుతోంది. దీంతో ఎవరికీ చెప్పుకోలేక వారు అడిగినంత ముట్టచెప్పి ఊరుకుంటున్నారు. కాజీపేట స్టేషన్ పరిధిలో ఐదుగురు.. ఇటీవల కాజీపేటలో ఓ వ్యక్తిని ఇలా బెదిరించారు. విషయం ఇంట్లో తెలిసి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులే కేసు పెట్టారు. దీంతో పంచాయితీ అంటూ బెదిరించిన వ్యక్తులు ముఖం చాటేశారు. ఒక్క కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఐదుగురు వ్యక్తులు మోసపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఖరీదైన ప్లాటు రాసి ఇవ్వగా, మరో ఇద్దరు వరుసగా రూ. 6 లక్షలు, రూ. 3 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన వారి నుంచి సుమారు రూ. 5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు ఫిర్యాదు చేశారు.. అపరిచిత మహిళ ఫోన్ బాధితులు ఇప్పటివరకు ఇద్దరు ఫిర్యాదు చేశారు. పరువుకు భయపడి ఎవరూ కేసు పెట్టడం లేదు. అపరిచిత మహిళలు ఫోన్ చేసి మాట్లాడితే జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రలోభాలకు లోనైతే మోసపోతారు. కొత్త రకం ట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఇలా మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులను ఆశ్రయించండి. – అజయ్, కాజీపేట ఇన్స్పెక్టర్ -
ట్రాపింగ్
‘పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇళ్లు లూటీ’.. ‘అర్ధరాత్రి దొంగల బీభత్సం’.. ‘పట్టపగలు దోపిడీ’... నగరంలో ఇలాంటి వార్త లేని పత్రిక ఉండదు. ఎన్ని తాళాలేసినా జరిగే దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ సెక్యూరిటీ వాళ్లని పెట్టుకునే స్తోమత ఉండదు. ఉన్నా... వాళ్లను చంపిమరీ దోచుకెళ్తున్నారు దొంగలు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ రంగంలోకి దిగింది. అదే ‘బర్గ్లర్ అలారమ్ సిస్టమ్’. దొంగ నీడ కూడా వాకిట్లో పడకుండా కాపాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి వివరంగా... ..:: భువనేశ్వరి హైటెక్‌సిటీలోని ఒక ఇండిపెండెంట్ ఇంటికి అర్ధరాత్రి పన్నెండు తర్వాత దొంగలొచ్చారు. డూప్లెక్స్హౌస్ కావడం వల్ల కింద అంతస్థు తలుపుల్ని బ్రేక్ చేస్తే ఎవరైనా చూస్తారేమోనని కాంపౌండ్‌వాల్ సాయంతో పైకి వెళ్లి తలుపుని పగలుగొట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లోవాళ్లకి చప్పుడు వినిపించి లోపలి నుంచి గట్టిగా అరవడం, తెలిసినవారికి ఫోన్లు చేయడం వంటివి చేశారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు రావడంతో దొంగలు గోడ దూకి పారిపోయారు. పన్నెండు సమయంలో కొందరైనా మెలకువగా ఉంటారు కాబట్టి మేల్కొని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదే ఏ రెండు, మూడు గంటలకో అయితే సులువుగా దొంగలు ఇంట్లోకి చొరబడేవారు. ‘సెక్యూరిటీవారిని పెట్టుకోవాలా?, గుర్ఖా సర్వీసు తీసుకోవాలా?’ అని ఆ ఇంటి యజమాని మర్నాడు ఆలోచిస్తుండగా ఎవరో బర్గ్లర్ అలారమ్ సిస్టమ్ గురించి చెప్పారు. దాని ప్రయోజనాలు తెలిసి టెక్నాలజీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రాత్రివేళలో ఎవరు అడుగుపెట్టినా యజమానికి, వారి స్నేహితులకి కాల్ వెళ్లిపోతుంది. ఎవరొచ్చారో తెలుసుకోవాలంటే మొబైల్లోని వీడియో డోర్ ఫోన్ యాప్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఎలా పనిచేస్తుంది.... ఫోన్లలో వేసుకునే సిమ్ల మాదిరిగా మీ ఇంటిపరిసరాల్లో కొన్ని సెన్సర్లను అమరుస్తారు. వాటి సాయంతో కాంపౌండ్‌వాల్, లోపలిప్రదేశాల్లో బరువుపడిన వెంటనే మన ఫోన్‌కి మెసేజ్, కాల్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఇంటికి, ఐదు సెల్ఫోన్లకు మేసేజ్ వచ్చేలా ఈ యాప్ ఉంటుంది. అవసరమైనవాళ్లు వీడియోడోర్ ఫోన్ అనే యాప్‌ని కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల తలుపుని టచ్ చేయగానే ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ యాప్‌ని ఓపెన్ చేస్తే తలుపు దగ్గరున్న మనిషిని చూడొచ్చు. పూర్వం సెన్సర్లు పిల్లి, కుక్క వచ్చినా అలర్ట్ చేసేవి. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఇంత బరువు అని సెట్ చేసుకునే అవకాశం దొరికింది. మేసెజ్, కాల్ వస్తుంది... ఈ టెక్నాలజీ వచ్చి ఆరేడేళ్లవుతున్నా దీని ఉపయోగాల గురించి జనానికి పెద్దగా తెలియడం లేదంటారు ‘స్టార్క్ ఇంటర్నేషనల్’ కంపెనీ యజమాని మహేందర్‌రెడ్డి. ‘నేను మూడేళ్లక్రితం ఈ కంపెనీ పెట్టాను. దాదాపు వంద ఇళ్లకు పైగా ‘బర్గ్లర్ అలారమ్ సిస్టమ్’ని అమర్చాను. వీటిలో అరవైశాతం ఇండిపెండెంట్ ఇళ్లే. ముఖ్యంగా కాలనీలో ఉండే ఇళ్లకు సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రివేళలోనే కాదు పట్టపగలు కూడా దొంగతనాల ఘటనలు అనేకం. అలాంటివాటికి చెక్ పెట్టడానికి పుట్టిందే ఈ ‘బర్గ్లర్ అలారమ్ సిస్టమ్’ దీని వల్ల మీ కాపౌండ్వాల్లో ఎవరు అడుగుపెట్టినా వెంటనే మీ సెల్‌ఫోన్స్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. కాల్ కూడా వస్తుంది. వెంటనే మీరు అలర్ట్ అలారమ్ ఆన్చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌పై అవగాహన పెరగాల్సి ఉందని చెప్పారు మహేందర్‌రెడ్డి. ఆస్పత్రుల్లోనూ... ఈ యాప్‌ని ఇళ్ల కాపలాకే కాకుండా కొన్ని ఆసుపత్రుల్లో కూడా వాడుతున్నారట. ఆస్పత్రుల్లో డాక్టర్ని కలవడానికి పేషెంట్లు క్యూలు కడుతుంటారు. వారిని తన గది నుంచి చూసే అవకాశాన్ని కోరుకుంటున్నారు కొందరు డాక్టర్లు. అందుకే హాస్పిటల్ హాల్స్‌లో సెన్సర్లను అమర్చుకుంటున్నారు. ‘మేమింతవరకూ ఎనభైఇళ్లకు ఈ సెన్సర్లను అమర్చాం. ‘బర్గ్లర్ అలారమ్ సిస్టమ్’ పనిచేయడం వల్ల దొంగల్ని పట్టుకున్న ఘటనలు ఉన్నాయి’ అని అంటున్నారు క్రియేటివ్ ఇన్స్ట్రూమెంట్ కంపెనీకి చెందిన రమేష్. దొంగల్ని ఇంటిదరిదాపులకు కూడా రాకుండా కాపాడుతున్న ‘బర్గలర్ అలారమ్ సిస్టమ్’ మరింత మందికి ఉపయోగపడాలని కోరుకుందాం.