trash bin
-
ప్రేమపేరిట మోసపోయి.. శిశువుకు జన్మనిచ్చి..
నిజామాబాద్ అర్బన్: ప్రేమపేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఓ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చెత్తకుప్పలో పడేసిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) అమ్మ మ్మ ఇంటి వద్ద ఉంటూ బోధన్‌లో ఇంటర్ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో కడుపునొప్పిగా ఉందని అమ్మమ్మతో కలసి శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ డెలివరీ నిమిత్తం సిబ్బంది పూర్తి వివరాలు అడగడంతో చెప్పడం ఇష్టంలేక ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే ఆ బాలిక ఆస్పత్రి మెట్ల పక్కన మగశిశువును ప్రసవించింది. వెంటనే శిశువును పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ వైద్యుల వద్దకు వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో డాక్టర్లు తొలుత నమ్మలేదు. అయితే, అప్పటికే ఎక్కువ రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికులకు చెత్తకుప్పల్లో శిశువు కనిపించడంతో ఆస్పత్రి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శిశువు మృతి చెందింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన ప్రేమ వ్యవహారం, గర్భం గురించి పూసగుచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
చెత్తబుట్టకు ప్రత్యేక పూజలు!
ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చెత్తబుట్టకు అర్చకులు ప్రత్యేక అలంకరణ చేయడంతోపాటు దాదాపు పావుగంట సమయం వెచ్చించి పూజలు, హారతులు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, అర్చకులు కలిసి ఆ చెత్తబుట్టలో బంతిపూలు వేసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వరస్వామి, సంతోషిమాత ఆలయాలలో చెత్తబుట్టల ఏర్పాటు సందర్భంగా ఈ దృశ్యం సాక్షి కెమెరా కంటపడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
ఎయిర్‌పోర్టులో పోయింది.. చెత్త తొట్లో దొరికింది!
బెర్లిన్: ఎయిర్‌పోర్టులో మర్చిపోయి పోగొట్టుకున్న విలువైన పెయింటింగ్ దగ్గరలోని చెత్తతొట్లో దొరికిన సంఘటన జర్మనీలో జరిగింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ వ్యాపారవేత్త అనుకోకుండా 2.8లక్షల యూరోల విలువైన (సుమారు రూ.2.5 కోట్లు) ప్రఖ్యాత పెయింటింగ్‌ను డస్సెల్‌డార్ఫ్ విమానాశ్రయంలో మర్చిపోయాడు. ఫ్రెంచ్ సర్రీయలిస్టు టాంగే గీసిన ఈచిత్రాన్ని డస్సెల్‌డార్ఫ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే ప్రయాణంలో నవంబర్ 27న సదరు వ్యాపారవేత్త పోగొట్టుకున్నాడు. ఇజ్రాయిల్‌లో విమానం దిగిన అనంతరం పెయిటింగ్ మర్చిపోయిన సంగతి గుర్తుకువచ్చి డస్సెల్‌డార్ఫ్ పోలీసులకు విషయం తెలియజేశాడు. అనంతరం ఈమెయిల్స్‌లో పెయింటింగ్ వివరాలను ఆయన అందజేసినా ఎయిర్‌పోర్టులో కనిపించలేదని పోలీసులు తెలిపారు. దీంతో వ్యాపారవేత్త మేనల్లుడు బెల్జియం నుంచి వచ్చి స్థానిక పోలీసులను కలిశాడు. అదనపు వివరాలు అందుకున్న అనంతరం పోలీసులు పలుచోట్ల విచారించగా ఒక ఇన్స్పెక్టర్కు సదరు పెయింటింగ్ ఒక పేపర్ రీసైక్లింగ్ చెత్తతొట్లో కనిపించింది. ఈ రీసైక్లింగ్ తొట్టిని ఎయిర్‌పోర్టు క్లీనింగ్ కంపెనీ వాడుతోంది. అక్కడనుంచి తీసుకువచ్చిన పెయింటింగ్‌ను సదరు వ్యాపారవేత్తకు భద్రంగా అందజేసామని పోలీసులు చెప్పారు. -
రైళ్లలో వ్యర్థాలకు ట్రాష్ బ్యాగులు!
న్యూఢిల్లీ: ఇక నుంచి విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ ప్రయాణికుల నుంచి వ్యర్థాలను ట్రాష్ బ్యాగుల్లో సేకరించేలా చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని అధికారులను ఆదేశించారు. డివిజన్ లెవల్ ఆఫీసర్లు, బోర్డు సభ్యులతో 17న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైళ్లలో పరిశుభ్రతను పెంచేందుకు ప్రయాణికుల భోజనాల అనంతరం ప్యాంట్రీ సిబ్బంది ఆ ప్లేట్లను బ్యాగుల్లో సేకరించాలని సూచించారు. సాధారణంగా భోజనం తిన్న తర్వాత ప్రయాణికులు ప్లేట్లను బెర్త్‌ల కింద పెడుతుంటారని, సిబ్బంది వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి తీసుకెళ్లడం వల్ల అందులోని వ్యర్థాలు కింద పడి బోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ట్రాష్ బ్యాగును ప్రయాణికుడి వద్దకు తీసుకెళ్లే వ్యర్థాలనూ వారు అందులో వేస్తారని అన్నారు. -
‘బంగారుతల్లి’ని చిదిమేశారు..
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్: భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందనుకున్నారో తెలియదు కానీ అభంశుభం తెలియని బంగారు తల్లిని బలి గొన్నారు. నెలలైనా నిండకుండానే.. కళ్లు తెరవకముందే ఆడశిశువును చిదిమేశారు. ఆపై ముళ్లపొదల్లో పడేశారు. అందరినీ కలచివేసిన ఈ సంఘటన నిర్మల్ మండలం గంజాల్ గ్రామ సమీపంలో జరిగింది. సోన్ ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నారుు. గంజాల్ గ్రామంలో తోట పెద్దమల్లయ్యకు చెందిన పశువుల పాక సమీపంలోని ముళ్లపొదల్లో మంగళవారం నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యమైంది. చేను వద్దకు వెళ్లిన మల్లయ్యకు ముళ్లపొదల్లో ఆడశిశువు మృతదేహం కనిపించడంతో సర్పంచ్‌కు సమాచారం అందించాడు. సోన్ నీటి సంఘం అధ్యక్షుడు మొరుునుద్దీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్‌కు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముళ్లపొదల్లో చీమలు పట్టి ఉన్న శిశువు మృతదేహాన్ని చూసిన ప్రతీఒక్కరూ కంటతడి పెట్టారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించామని, శిశువు సోమవారం జన్మించి ఉండొచ్చని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియూల్సి ఉందని పేర్కొన్నారు.