Treasury officer
-
నువ్వు నాతో సినిమాకొస్తే.. మీ నాన్న పింఛను ఇస్తా.. ఏమంటావ్ మరి
మేడ్చల్: తండ్రి పింఛనును తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరచుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించాడు ఆ అధికారి. నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయం లో జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాధిత యువతి కథనం ప్రకారం..నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పింఛనును తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అతడు మరణించడం, అంతకుముందే తల్లి కూడా చనిపోవడంతో యువతి అనాథగా మారింది. దీంతో తండ్రికి వచ్చే పింఛను తనకు మంజూరు చేయాలని కోరు తూ నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. తనతో సినిమాకు వస్తేనే పింఛను మంజూరు చేస్తానంటూ అక్కడ అదనపు ట్రెజరీ అధికారి (ఏటీవో)గా పనిచేస్తున్న పవన్ కుమార్ ఆ యువతిని లైంగికంగా వేధించారు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో సదరు అధికారి అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నాడు. విషయాన్ని అక్కడి అధికారులకు, టీఆర్ఎస్ నాయకులకు చెప్పగా ఏటీవోకు యువతికి మధ్య రాజీకి ప్రయత్నించారే తప్ప అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. అంతా అబద్ధం: యువతి వివాహం కాలేదని చెబుతూ పింఛను పొందాలని చూసిందని, నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరస్కరించి రికవరీకి ఆదేశాలివ్వడంతోనే ఆ యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఏటీవో పవన్ కుమార్ వివరణ ఇచ్చారు. -
కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. చదవండి: ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ -
జీతాలు, పింఛను బిల్లుల చెల్లింపు
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగులు ఈ నెల 21వ తేదీలోపు సమర్పించిన బిల్లులను పాస్ చేశారని, ఇంకా ఏమైనా బిల్లులు ఉంటే సోమవారం సాయంత్రానికి పాస్ చేయనున్నట్టు జిల్లా ఖజానాధికారి పాలేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఖజానాశాఖ సంచాలకులు శనివారం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రధానంగా ఉద్యోగులు, పెన్షన్‌దారులకు రావాల్సిన డీఏ బకాయిలు (జనవరి నుంచి ఏప్రిల్ వరకు), మే నెల జీతం, పెన్షన్, ఉద్యోగులకు జూన్ 1వ తేదీ జీతం బిల్లులను విడివిడిగా పాస్ చేసినట్టు ఆయన తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జూన్ 2వ తేదీ నుంచి ఉద్యోగులు, పెన్షన్‌దారులు కొత్త రాష్ట్రం పరిధిలోకి వస్తున్నందున గవర్నర్ ఆదేశాల మేరకు 24వ తేదీ నాటికి చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఖజానాలతో సంబంధం ఉన్న బ్యాంకులు శనివారం సాయంత్రం వరకు పనిచేశాయన్నారు. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, తిరుపతి, మదనపల్లెతో కలుపుకుని 18 ఖజానా కార్యాలయాల్లో 20 వేలకు పైగా బిల్లులను పాస్ చేసినట్టు పేర్కొన్నారు. రిటైర్మెంట్ క్లెయిమ్‌లను 31లోపు సమర్పించాలి జిల్లాలో పనిచేస్తూ గత నెలలో, ఈ నెల 31వ తేదీలోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులు వారికి రావాల్సిన సంపాదిత సెలవులు, గ్రాట్యుటీ, పీఎఫ్, సీపీఎస్ తదితర బిల్లులన్నింటినీ ఈ నెల 31వ తేదీ నాటికి సమర్పించాలని జిల్లా ఖజానాధికారి, డీడీ(ఉపసంచాలకులు) కోరారు. ఆ తరువాత సమర్పిస్తే అంగీకరించేది లేదన్నారు. లాంగ్ పెండింగ్ ఏసీ బిల్లు సబ్మిట్ చేసి డీసీ బిల్లు ఇవ్వని సంబంధిత డీడీవోలకు జీతాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. జీవో నం.94 ప్రకారం ఆర్థికశాఖ కేటాయించిన సొమ్ము పీడీ అకౌంట్లో ఉన్నందున దానిని తిరిగి ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇచ్చే చెక్కులు 31వతేదీ లోపు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆయన పేర్కొన్నారు.