trending subject
-
సామూహిక ఆత్మహత్యలు! ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి బావిలోకి దూకి..
జైపూర్: భర్తతో నిరంతర తగాదాలతో మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు ఐదుగురి కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురూ మృతి చెందారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలిని శివలాల్ బన్జారా భార్యగా గుర్తించారు. బాదందేవి (40) ఏడుగురు పిల్లల తల్లి. ఘటనలో బాదందేవితోపాటు సావిత్రి (14), అంకాలీ (8), కాజల్ (6), గుంజన్ (4), అర్చన (ఏడాది వయసు) మృతి చెందగా, మిగతా ఇద్దరు కూతుళ్లు గాయత్రి (15), పూనమ్ (7) నిద్రపోవడంవల్ల తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుప్పట్లను విక్రయించే పని చేసే శివలాల్‌కు, భర్య బాదందేవికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఐతే సంఘటన సమయంలో శివలాల్ ఇంటివద్దలేనని, బంధువు మృతి చెందితే సంతాపం తెల్పడానికి శనివారం రాత్రి పొరుగూరికి వెళ్లినట్లు తెలిపాడు. సంఘటన గురించి తెలియడంతో ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఐతే భార్య ఎందుకు చనిపోవాలనుకుందో మాత్రం పోలీసులకు తెల్పలేదు. మృతుల ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే బావి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు రావల్సి ఉంది. ఈ సంఘటనపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని ఎస్హెచ్ఓ రాజేంద్ర మీనా మీడియాకు తెలిపారు. చదవండి: మహిళ ఎకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు! -
సోషల్ వెబ్సైట్లలో ట్రెండింగ్ సబ్జెక్ట్ వైఎస్ జగన్
-
సోషల్ వెబ్సైట్లలో ట్రెండింగ్ సబ్జెక్ట్ వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సోషల్ మీడియాలో మద్దతు వెల్లువెత్తుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్లో వైఎస్ జగన్ దీక్ష ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యింది. సోమవారం ఫేస్బుక్ ట్రెండింగ్‌లో వైఎస్ జగన్ (Y.S.Jaganmohan Reddy) మూడో స్థానంలో నిలిచారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తొలి స్థానంలో ఉండగా.. సాహిత్య అకాడమీ రెండో స్థానంలో ఉంది. ఇక వైఎస్ జగన్ తర్వాతి స్థానంలో రామకుమార్ రమణ్, బిగ్ బాస్ 9, వన్ ప్లస్ 2 అంశాలు ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు నెటిజెన్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం, వైఎస్ జగన్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. క్షీణిస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యంపై నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గూగుల్ లో వైఎస్ జగన్‌కు సంబంధించిన వార్తల గురించి సెర్చ్ చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్యం గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. వైఎస్ జగన్ నిరాహారదీక్ష విషయంలో సెల్ఫీవీడియోలు ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే. వేలాదిమంది నెటిజన్లు ఉత్సాహంగా వీడియోలను అప్లోడ్ చేసి జగన్‌కు మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ, సెల్ఫీగా వీడియోను చిత్రీకరించి, నెటిజన్లు ఎవరికి వారుగా వాటిని అప్లోడ్ చేస్తున్నారు. ఇంటర్నెట్లో దీన్నొక ట్రెండ్‌గా మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఇలాంటి వీడియోలను రూపొందించి ఫేస్బుక్లో పోస్టు చేశారు. ప్రవాసాంధ్రులు సెల్ఫీ వీడియోలను అప్లోడ్ చేసి ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటారు.