సోషల్ వెబ్సైట్లలో ట్రెండింగ్ సబ్జెక్ట్ వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సోషల్ మీడియాలో మద్దతు వెల్లువెత్తుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్లో వైఎస్ జగన్ దీక్ష ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యింది. సోమవారం ఫేస్బుక్ ట్రెండింగ్లో వైఎస్ జగన్ (Y.S.Jaganmohan Reddy) మూడో స్థానంలో నిలిచారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తొలి స్థానంలో ఉండగా.. సాహిత్య అకాడమీ రెండో స్థానంలో ఉంది. ఇక వైఎస్ జగన్ తర్వాతి స్థానంలో రామకుమార్ రమణ్, బిగ్ బాస్ 9, వన్ ప్లస్ 2 అంశాలు ట్రెండ్ అవుతున్నాయి.
మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు నెటిజెన్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం, వైఎస్ జగన్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ జగన్కు మద్దతుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. క్షీణిస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యంపై నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గూగుల్ లో వైఎస్ జగన్కు సంబంధించిన వార్తల గురించి సెర్చ్ చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్యం గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు.
వైఎస్ జగన్ నిరాహారదీక్ష విషయంలో సెల్ఫీవీడియోలు ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే. వేలాదిమంది నెటిజన్లు ఉత్సాహంగా వీడియోలను అప్‌లోడ్ చేసి జగన్‌కు మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ, సెల్ఫీగా వీడియోను చిత్రీకరించి, నెటిజన్లు ఎవరికి వారుగా వాటిని అప్‌లోడ్ చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో దీన్నొక ట్రెండ్‌గా మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఇలాంటి వీడియోలను రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రవాసాంధ్రులు సెల్ఫీ వీడియోలను అప్‌లోడ్ చేసి ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటారు.