పొగమంచులోనూ స్పష్టంగా చూడొచ్చు
న్యూఢిల్లీ: శీతాకాలం పొగమంచులో కూడా రైల్వే డ్రైవర్లు స్పష్టంగా చూసేలా ఇంజిన్లలో ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. త్రినేత్ర అనే ఈ కొత్త వ్యవస్థతో డ్రైవర్లు ప్రతికూల వాతావరణంలో ట్రాక్‌ను స్పష్టంగా చూడగలరు.
ముందున్న ప్రాంతాన్ని చిత్రీకరించడం, రాడార్ వ్యవస్థ సాయంతో ఈ పరికరం పనిచేస్తుందని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో స్టేషన్ లేదా, సిగ్నల్‌కు ఎప్పుడు చేరేది డ్రైవర్ కచ్చితంగా తెలుసుకునే అవకాశముంటుంది. తిన్నగా ఉన్న ట్రాక్‌పై కిలోమీటరు దూరంలోని వస్తువుల్ని కూడా డ్రైవర్ చూడవచ్చు.