tribals developement
-
Janjatiya Gaurav Divas: గిరిజనుల రుణం తీర్చుకుంటా..
కుంతీ: సమాజంలో అణగారిన వర్గమైన గిరిజనులకు న్యాయం చేకూర్చడానికి తమ ప్రభుత్వం ‘మిషన్ మోడ్’లో పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గిరిపుత్రులకు తాను రుణపడి ఉన్నానని, ఆ రుణ తీర్చుకుంటానని తెలిపారు. గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ‘జన జాతీయ గౌరవ్ దివస్’లో మోదీ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజనుల సంక్షేమం కోసం రూ.24,000 వేల కోట్లతో అమలు చేసే ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభించారు. పలు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుంతీలోని ఫుట్‌బాల్ మైదానంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దేశ అభివృద్ధికి మహిళలు, రైతులు, యువత, మధ్యతరగతి–పేదలు అనే నాలుగు వర్గాలను బలోపేతం చేయడం చాలా కీలకమని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జన్మించిన గడ్డకు గిరిజనుల రుణం తీర్చుకోవడానికి వచ్చానని అన్నారు. పౌరులపై అన్ని రకాల వివక్షను తొలగించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లు భావించాలని స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా.. అడవులు, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న గిరిజనుల కోసం ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ పథకం కింద ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కలి్పంచనున్నట్లు వివరించారు. రోడ్లు, టెలికాం వ్యవస్థ, విద్యుత్, గృహనిర్మాణం, సురక్షిత తాగు నీరు, పారిశుధ్య వసతులు, విద్యా, వైద్యం, జీవనోపాధి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా 22,000 గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న 75 గిరిజన జాతులను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. గిరిపుత్రుల బాగు కోసం గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. వారి అభివృద్ధే ధ్యేయంగా ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద రూ.24,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు. బిర్సా ముండాకు నివాళులు.. కుంతీ జిల్లాలోని ఉలీహతులో ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మ స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సందర్శించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా జన్మించి నేలపై మట్టిని తీసుకొని మోదీ తిలకంగా ధరించారు. ఆయన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఉలీహతులో స్థానికులు మోదీకి సాదర స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా గిరిజనులతో కలిసి మోదీ నృత్యం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందనివారికి ఆయా పథకాల గురించి ఈ యాత్ర ద్వారా వివరిస్తారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి 25 వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి విడుదల పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 15 విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18,000 కోట్ల నిధులను ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని మోదీ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
గిరిజన ఉత్పత్తులకు 'బ్రాండింగ్'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడవి బిడ్డల కష్టాన్ని హైజాక్ చేస్తున్న దళారులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. గిరిజనుల కష్టం వృథా కాకుండా వారు సేకరిస్తున్న 105 రకాల ఉత్పత్తులకు ‘బ్రాండింగ్’ కల్పించి, వాటిని గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెట్లో విక్రయిస్తోంది. ఇవి అరుదుగా దొరికే రకాలు, స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మార్కెట్లో వీటికి మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు సంబంధించి రూ.34 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. వచ్చే ఏడాది దీని విలువ ఏకంగా 40–50 శాతం పెరగనుంది. ఈ పరిణామాలు అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడమే కాక వారికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి. మార్కెటింగ్ సొసైటీల ఏర్పాటు నల్లమల ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ. వీరి అభివృద్ధి కోసం గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను 1987లో నంద్యాలలో స్థాపించారు. శ్రీశైలంలో ఐటీడీఏ ఏర్పడిన తర్వాత దీంతో కలిసి పనిచేసేందుకు 1989లో జీసీసీని శ్రీశైలానికి తరలించారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డివిజన్లో నంద్యాల, ప్రకాశం జిల్లా దోర్నాలలో రెండు గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటుచేశారు. ఇవికాకుండా పాడేరు, చింతపల్లి, రంపచోడవరంలోనూ సొసైటీలున్నాయి. వీటి పరిధిలోని మండలాల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. తేనె, చింతపండు, త్రిఫల చూర్ణం, నన్నారి, అలోవిరా, జాస్మిన్, నీమ్ ఇంటర్నేషనల్ సబ్బులు, ఉసిరి, శీకాకాయ, కుంకుడు కాయలు, వీటిద్వారా తయారుచేసిన షాంపులు, రాజ్మా చిక్కుళ్లతో పాటు 105 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇందులో కర్నూలు, ప్రకాశం జిల్లాలోనే 58 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి కల్తీ లేకుండా లభించే స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులు. వీటిని ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి ‘జీసీసీ’ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఉత్పత్తుల ద్వారా సబ్బులు, షాంపులతో పాటు అరకు కాఫీ, వైశాఖీ కాఫీపొడి తయారుచేస్తున్నారు. వీటి కోసం హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి నేరుగా మార్కెట్లకు విక్రయిస్తున్నారు. వీటి బ్రాండింగ్‌తో పాటు మార్కెటింగ్ విశాఖపట్నంలోని జీసీసీ ఆధ్వర్యంలో జరుగుతోంది. బ్రాండింగ్, వాటి ధర, ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు ప్యాకెట్‌పై ముద్రిస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. తుట్టె నుంచి తేనెను సేకరిస్తున్న దృశ్యం ఉపాధి అవకాశాలు మెరుగు ఇటీవల వీటికి గిరాకీ పెరుగుతుండడంతో గిరిజనులు కూడా ఎక్కువగా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. అంతేకాక, వారి పొలాల్లో ఇతర పంటలు పండించి వాటిని సొసైటీకి ఇస్తున్నారు. దీంతో వీరికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులపై ఆధారపడే గిరిజనులు 3.78 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులోకి తేవడం ద్వారా కల్తీలేని స్వచ్ఛ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. సూపర్ మార్కెట్లలో జీసీసీ బ్రాండ్ ఉత్పత్తులు భారీగా సేల్ అవుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు లభించడంలేదు కూడా. గిరిజనుల కోసం నిత్యావసర డిపోలు గిరిజనుల ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు వీరికి అవసరమయ్యే వస్తువులు వినియోగించేలా నంద్యాల, ప్రకాశం జిల్లాలోని దోర్నాల సొసైటీలతో పాటు ఇతర సొసైటీలలో నిత్యావసర డిపోలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం, చక్కెర, కందిపప్పుతో పాటు జీసీసీ బ్రాండ్ పసుపు, కారం, చింతపండు, కాఫీ, సబ్బులు, షాంపులు, తదితర వస్తువులు ఇక్కడ అందిస్తారు. అలాగే, ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 100 గిరిజన హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటికి కావల్సిన ఆహార వస్తువులు, కాస్మోటిక్స్, శానిటరీ వస్తువులు కూడా శ్రీశైలం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. దీంతో పాటు వీరి అభివృద్ధి కోసం 171 చెంచుగూడేల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా గిరిజనుల ఆర్థిక స్థోమత పెరిగి సంతోషంగా జీవిస్తున్నారు. -
ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తారు : పవన్ కళ్యాణ్
కురుపాం : గిరిజన సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా కురుపాం రావాడ కూడలిలో గురువారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విద్య, వైద్యం, తాగునీరు, రహదార్లు లేక గిరిజనం నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయకుండా నవనిర్మాణ దీక్ష, అమరావతి అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఈ సర్కారు పట్టించుకోకపోవడంతో గిరిజనులు, యువత, కార్మికులు పూర్తిగా నష్ట పోయారని చెప్పారు. జనసేన కార్యకర్తలు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు గుర్తిస్తే వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇచ్చారు. ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తారు పార్వతీపురం: ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని వృథా ఖర్చులకు వాడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం పార్వతీపురం పాతబస్టాండ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ, స్టార్ హోటల్స్‌లో గడపడానికి, మహానాడు, నవ నిర్మాణ దీక్ష, ధర్మ పోరాట దీక్షలకు ఖర్చు చేసేందుకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారని విమర్శించారు. ప్రజా ధనాన్ని సొంత ఖర్చులకు వాడుకోవడం దారుణమన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా బురద నీళ్లనే మంచినీళ్లుగా ఇళ్లకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో రోడ్లు చూస్తుంటే భయమేస్తుందని వ్యాఖ్యానించారు. ఏడేళ్ల కాలంలో పూర్తైన ఆర్వోబీ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదన్నారు. ఉత్తరాంధ్రలో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉత్తరాంధ్రలో ఉద్యమం పుట్టుకువస్తుందన్నారు. 2019లో జనసేన అధికారంలో వస్తే ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని, పాలన కేవలం విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లోనే కేంద్రీకరించారని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అది జరగనివ్వమని పేర్కొన్నారు. 36 సార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి బొబ్బిలి: ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలనీ, ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటూ మూడున్నరేళ్లలో 36 సార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గురువారం సాయంత్రం బొబ్బిలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మళ్లీ తనకు మద్దతు ఇవ్వాలంటూ అడుగుతున్నారని, తాను ఎంతమాత్రం ఒప్పుకోనని పేర్కొన్నారు. బొబ్బిలిలో యువతకు ఉద్యోగాల్లేవనీ, జూట్ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేవలం అమరావతికే పరిమితమయ్యారని, మిగిలిన ప్రాంతాలను విడిచిపెట్టారని ఎద్దేవా చేశారు. చెరుకు రైతులకు బకాయిలు ఉంటే కంపెనీని ప్రశ్నించడం లేదని, కొత్త సాఫ్ట్‌వేర్‌తో అంగన్వాడీలను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు వారికి మద్దతు ఇచ్చినందుకు క్షమించాలని పవన్ అంగన్వాడీలను కోరారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ స్థానికుల ఉద్యోగాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికా లేక స్థానికేతరులు భూ కబ్జా చేయడానికా అని ప్రశ్నించారు. ఎంపీ అశోక్‌కు తాను ప్రచారం చేసిన విషయం గుర్తుంటుంది కానీ ఇప్పుడు గుర్తులేనని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించారు. రాష్ట్రంలో రోడ్లు మీ తాతముత్తాతలు వేయించారా..? లేక హెరిటేజ్ సొమ్ముతో వేశారా అని ప్రశ్నించారు. -
అంబేడ్కర్‌కు నివాళి ఇదేనా?!
సందర్భం డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల్ని ఇటీవలే ఘనంగా జరుపుకుంది మన దేశం. పాలకవర్గాలు, వివిధ పార్టీలు పోటీలు పడి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకు పోతామని ప్రతినబూనాయి. ఆచరణలో మాత్రం వాటి స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీ స్తున్నాయి. సమాచారహక్కు చట్టం ద్వారా బహిర్గత మైన వివరాలు దళితులు, ఆదివాసీల అభివృద్ధి పట్ల వీరి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. గత 35 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన రూ.2.8 లక్షల కోట్ల నిధుల్ని ప్రభుత్వాలు ఖర్చు చేయలేదని ‘ఇండియా స్పెండ్’ వెబ్సైట్ పరిశో ధనలో వెల్లడైంది. తరతరాలుగా దోపిడీ, వివక్షలకు గుర వుతున్న ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధికోసం భారత ప్రభుత్వం 1974-75లలో ఎస్టీ సబ్‌ప్లాన్, 1979-80లలో ఎస్సీ సబ్‌ప్లాన్ ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశా ఖలు ఈ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ లకు 16.6%, ఎస్టీలకు 8.6% నిధులు విడివిడిగా కేటా యించాలి. వీటిని కేవలం వీరి అభివృద్ధి పనులకే వెచ్చించాలి. ప్రత్యేక కేటాయింపుల ద్వారా వారి అభివృ ద్ధికి పాటుపడాలనే సంకల్పంతో ప్రభుత్వాలు ఈ సబ్ ప్లాన్లు ఏర్పాటుచేశాయి. కానీ ఈ కేటాయింపులు ఏనాడూ నూరుశాతం సద్వినియోగం కాలేదు. అసలు కేటాయింపులే జనాభా నిష్పత్తి ప్రకారం జరగకపోగా విదిల్చిన మొత్తాన్ని సైతం పూర్తిస్థాయిలో వెచ్చించలేదు. ఉదాహరణకు 2012-13 లో కేంద్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 58,823 కోట్లు కేటాయించగా రూ.53,345 కోట్లు ఖర్చు చేసింది. అంటే రూ.5,478 కోట్లు మిగిలిపోయాయి. 2013-14లో ఖర్చు చేయని మొత్తం రూ.9,398 కోట్లకు పెరిగింది. ఎన్డీఏ వచ్చాక కేటాయింపులు రూ. 82,935 కోట్లకు పెరిగాయి. ఖర్చు చేయని మొత్తం కూడా రూ. 32,979 కోట్లకు (251 శాతానికి) పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2005-14 మధ్య కాలంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.19,367 కోట్లు ఖర్చు చేయలేదు. ఏపీ తర్వాతి స్థానంలో యూపీ, పం జాబ్ నిలిచాయి. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో జార్ఖండ్ రూ. 17,107కోట్లు, ఒడిశా రూ.7,292కోట్లు, ఏపీ రూ.6,922 కోట్లు ఈ కాలంలో ఖర్చు చేయలేదు. 2014 -15లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 61% నిధులు, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 64.3% నిధులు అంటే మొత్తం రూ.7,475 కోట్లు ఖర్చు చేయకుండా మురగబెట్టింది. వీరి అభ్యున్నతికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు పాలకుల నిర్లక్ష్యం వల్ల మురిగిపోతున్నాయి. పక్కదారి పడుతున్నాయి. అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల స్ఫూర్తితో ఇప్పటికైనా పాలకులు దళితులు, ఆదివాసీల హక్కులకు న్యాయం చేయాలి. ప్రజాపక్ష మేధావులు, మీడియా, ప్రగతిశీల సంఘాలు కృషి చేయాలి. సబ్ ప్లాన్‌కు జాతీయస్థాయిలో చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి. - బి. భాస్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ 9989692001