Troubleshooting
-
OnePlus: వన్‌ప్లస్ విక్రయాలు నిలిపేస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందుకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావడం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లపై రుద్దడం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్‌కు అనుకూలంగా వన్‌ప్లస్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఓఆర్ఏ లేఖ రాసింది. పూర్విక, బిగ్–సి, సంగీత, హ్యాపీ, బీ–న్యూ, సెలెక్ట్, సెల్ పాయింట్ వంటి 23 ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్స్ ఓఆర్ఏ సభ్యులుగా ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో సుమారు 4,500 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
అహంభావంతో పాలిస్తే మేలు జరగదు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రశేఖరరావుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైనా ఒంటెద్దు పోకడలు, అహంభావంతో పాలనసాగిస్తే ఇక్క డి ప్రజలకు మేలు జరగదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బుధవారం పొన్నాల ఒక లేఖ రాశారు. దానిని గాంధీభవన్‌లో మీడియాకు విడుదల చేశారు. ప్రధానమైన అంశాలపై అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. రిజర్వుబ్యాంక్‌ను ఒప్పించేందుకే రైతుల రుణమాఫీ ఉత్తర్వులను ఇస్తున్నామనే భావనను ప్రభుత్వం కలిగిస్తోందని చెప్పారు. విద్యుత్ లేక, అప్పులు దొరకక రెండు నెలల్లోనే 130 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టి 70 రోజులు దాటినా ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. గత కేబినెట్ భేటీలో 43 అంశాలపై చర్చించినా ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోవడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు బూచిని చూపిస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా అని అన్నారు.