trs councillor
-
తల్లీకొడుకుపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి
ఇల్లెందు: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ వేరే వార్డులోని రెండు కుటుంబాల మధ్య గొడవలో కలగజేసుకోవడమేకాక తల్లీకొడుకులపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులోని సత్యనారాయణపురంలో తల్లీకొడుకులు ఎస్.కె.సోందుబీ, షేక్ ఫకీర్ సాహెబ్ నివసిస్తున్నారు. వీరి ఇంటి పక్కన ఉండే మీరా సాహెబ్ ప్రహరీ నిర్మిస్తుండగా, శనివారం ఉదయం హద్దుల విషయమై సోందూబీ, ఫకీర్ సాహెబ్ ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రెండు కుటుంబాలమధ్య వాగ్యుద్ధం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని గొడవలకు దిగొద్దని రెండు పక్షాలకు సూచించారు. కాసేపటికి ఒకటో వార్డు కౌన్సిలర్ రవి తన అనుచరులతో అక్కడకు వచ్చి సోందుబీ, ఫకీర్ సాహెబ్‌ను పిలిచి పంచాయితీ పెట్టాడు. కాగా, కౌన్సిలర్ చెప్పినట్లుగా వినడం లేదంటూ తమపై దాడి చేశాడని బాధితులు వాపోయారు. ఏదైనా సమస్య ఉంటే తమ కౌన్సిలర్‌కు చెప్పుకుంటామంటున్నా వినకుండా దాడి చేశాడని తెలిపారు. కౌన్సిలర్ రవితో తమకు ప్రాణ హాని ఉందని అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్‌నైన తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ కాదని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్రశేఖర్ సత్యనారాయణపురం వెళ్లి విచారణ చేపట్టారు. -
ఎమ్మెల్యే శంకర్‌నాయకే ఇదంతా చేయించారు: రవి భార్య పూజ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ (34) హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇండిపెండెంట్‌గా గెలిచారని, ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారని, రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే హత్య చేశారని పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయకే తన అనుచరులతో ఈ హత్య చేయించారని రవినాయక్ తల్లి లక్ష్మి, భార్య పూజ ఆరోపించారు. చదవండి👉🏾 ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో కాగా, మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు పలువురు నాయకులను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. ఘటనపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ రవినాయక్ హత్య దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్, బీజేపీ గిరిజనమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ ఆస్పత్రికి చేరుకుని హత్యోదంతంపై ఆరా తీశారు. చదవండి👉🏾 మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణహత్య -
మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణహత్య
సాక్షి, మహబూబాబాద్: బైక్‌పై వెళ్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఆపై గొడ్డలి, తల్వార్లతో విచక్షణారహితంగా నరికారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మహబూబాబాద్ పట్టణంలో పట్టపగలు జరిగిన ఈ హత్యోదంతం సంచలనం కలిగించింది. హత్యకు ఆర్థిక లావాదేవీలు, భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అంటుండగా, కౌన్సిలర్ రాజకీయ ఎదుగుదల చూడలేక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ హత్య చేయించారని మృతుడి తల్లి, భార్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ (34) గురువారం ఉదయం పత్తిపాకలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. పత్తిపాక సెంటర్ వద్ద కొంతమంది ట్రాక్టర్‌తో వచ్చి రవినాయక్ వాహనాన్ని ఢీకొట్టగా, రవి కింద పడిపోయారు. అప్పటికే ఆయనను కారులో వెంబడిస్తున్న దుండగులు, ట్రాక్టర్‌పై వచ్చిన వారిలో ఒకరు గొడ్డలి, తల్వార్లతో రవిపై దాడిచేశారు. తలపై నరకడంతో రవి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, చనిపోయినట్లు భావించి దుండగులు పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న రవినాయక్ బావమరిది చిరంజీవి.. రక్తపు మడుగులో పడి ఉన్న రవినాయక్‌ను చూసి చుట్టుపక్కల వారి సాయంతో 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రవినాయక్ మృతిచెందారు. హత్యలో రాజకీయ ప్రమేయం లేదు: ఎస్పీ రవినాయక్ నల్లబెల్లం, కట్టెల వ్యాపారం చేసేవారు. ఇందులో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాలతోనే రవి హత్య జరిగిందన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు భూతగాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పోలీసులు ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రవినాయక్‌పై రౌడీషీట్ కూడా ఉందని అంటున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్‌చంద్రపవార్ మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నామని, ఇందులో రాజకీయ ప్రమేయమేమీ లేదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
బోధన్ అల్లర్ల కేసులో కీలక మలుపు.. విగ్రహ వివాదంలో అధికార పార్టీ నేత
సాక్షి, నిజామాబాద్: బోధన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు గోపికిషన్‌తో పాటు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా భర్త అధికార పార్టీ కౌన్సిలర్ శరత్‌రెడ్డి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణతో పాటు ఇంటెలిజన్స్ వర్గాల ఆరాలో తేలినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. శరత్‌రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. శివాజీ విగ్రహం కొనుగోలు చేయడానికి శివసేన జిల్లా అధ్యక్షుడు గోపికిషన్‌కు కౌన్సిలర్ సహకరించినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన విగ్రహాన్ని శరత్‌రెడ్డి రైస్‌మిల్ వద్ద ఉంచి, శనివారం అర్ధరాత్రి గోపి అక్కడి నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1 గా ఉన్న గోపికిషన్‌ను రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. అలాగే పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు పికెట్ కొనసాగుతోంది. చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. -
కౌన్సిలర్ పై దుండగుల దాడి
-
కొనసాగుతున్న ఉత్కంఠ!
ఆర్మూర్ : పట్టణంలోని 20వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి రంగన్న కిడ్నాప్ వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠత రేకిత్తిస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సిన సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీసుల సహకారంతో గాలింపు నిర్వహిస్తున్నారు. సుంకరి శంకర్ భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆర్మూర్ పోలీసులు ఏబీ శ్రీనివాస్ (చిన్న), మహేందర్, అన్వేష్, బట్టు శంకర్, ఫత్తేపూర్ అశోక్‌రెడ్డి, భూషణ్‌లపై కిడ్నాప్, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసులను నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డీఐజీతో పాటు జిల్లా ఎస్పీకి ఫోన్లో మాట్లాడి నిందితులను అదుపులోకి తీసుకొని కౌన్సిలర్ రంగన్నను గుర్తించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, సీఐ లక్షీ్ష్మనారాయణ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.ఇందులో భాగంగా కేసులు నమోదు చేసిన ఆరుగురి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు రప్పిం చి వారి జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు 20 మందితో కూడిన ప్రత్యేక పోలీసు బలగాలు మూడు గ్రూపులుగా విడిపోయి హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. సెల్ ఫోన్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశా రు. అయితే కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పోలీసులు సైతం అ ధికార పార్టీకి కొమ్ము కాస్తూ తప్పుడు కేసులు నమోదు చేసి తప్పుడు పద్దతిలో విచారణ జరుతున్నారని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఆరోపించారు. కిడ్నాపా..? ఒప్పందమా..? కౌన్సిలర్ సుంకరి శంకర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో కనిపించకుండా పోవడంతో పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి. అసలు కిడ్నాప్ జరిగిందా లేక టీఆర్ఎస్ కౌన్సిలర్ ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్ నాయకులతో ఒప్పందం చేసుకొని వెళ్లిపోయాడా అనే విషయమై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ కౌన్సిలర్‌కు గాలం వేసి సుమారు * 40 లక్షల ఎర చూపించి అతనిని టీ ఆర్ఎస్ క్యాంపు నుంచి తప్పించినట్లు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి 20వ వార్డు నుంచి టీఆర్ఎస్ నాయకులు రంగన్నను పోటీకి నిలపాలని ప్రయత్నిం చారు. అధిక సంతానం ఫిర్యాదుపై అతని నామినేషన్ తిరస్కరించడంతో రంగన్న తమ్ముడు సుంకరి శంకర్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించిన శంకర్ కనిపించకుండా పోవడం ఆర్మూర్ రాజకీయాలలో ఉత్కంఠత రేకెత్తిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఆర్మూర్ : టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ కిడ్నాప్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లో హోం శాఖ మంత్రిని కలిసి ఆ ర్మూర్లో జరిగిన కౌన్సిలర్ కిడ్నాప్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలను సైతం జారీ చేశారన్నారు. మంత్రిని కలిసిన వారిలో పెర్కిట్ సొసైటీ చై ర్మన్ నచ్చు చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నయీం, కాటిపల్లి భోజన్న, రామకృష్ణ తదితరులున్నారు.