
కొనసాగుతున్న ఉత్కంఠ!
ఆర్మూర్ : పట్టణంలోని 20వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి రంగన్న కిడ్నాప్ వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠత రేకిత్తిస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సిన సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్‌ఎస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీసుల సహకారంతో గాలింపు నిర్వహిస్తున్నారు. సుంకరి శంకర్ భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆర్మూర్ పోలీసులు ఏబీ శ్రీనివాస్ (చిన్న), మహేందర్, అన్వేష్, బట్టు శంకర్, ఫత్తేపూర్ అశోక్‌రెడ్డి, భూషణ్‌లపై కిడ్నాప్, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసులను నమోదు చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డీఐజీతో పాటు జిల్లా ఎస్పీకి ఫోన్‌లో మాట్లాడి నిందితులను అదుపులోకి తీసుకొని కౌన్సిలర్ రంగన్నను గుర్తించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, సీఐ లక్షీ్ష్మనారాయణ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.ఇందులో భాగంగా కేసులు నమోదు చేసిన ఆరుగురి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు రప్పిం చి వారి జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరో వైపు 20 మందితో కూడిన ప్రత్యేక పోలీసు బలగాలు మూడు గ్రూపులుగా విడిపోయి హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. సెల్ ఫోన్ నెట్‌వర్క్ లొకేషన్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశా రు. అయితే కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పోలీసులు సైతం అ ధికార పార్టీకి కొమ్ము కాస్తూ తప్పుడు కేసులు నమోదు చేసి తప్పుడు పద్దతిలో విచారణ జరుతున్నారని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఆరోపించారు.
కిడ్నాపా..? ఒప్పందమా..?
కౌన్సిలర్ సుంకరి శంకర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో కనిపించకుండా పోవడంతో పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి. అసలు కిడ్నాప్ జరిగిందా లేక టీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్ నాయకులతో ఒప్పందం చేసుకొని వెళ్లిపోయాడా అనే విషయమై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌కు గాలం వేసి సుమారు * 40 లక్షల ఎర చూపించి అతనిని టీ ఆర్‌ఎస్ క్యాంపు నుంచి తప్పించినట్లు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి 20వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ నాయకులు రంగన్నను పోటీకి నిలపాలని ప్రయత్నిం చారు. అధిక సంతానం ఫిర్యాదుపై అతని నామినేషన్ తిరస్కరించడంతో రంగన్న తమ్ముడు సుంకరి శంకర్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించిన శంకర్ కనిపించకుండా పోవడం ఆర్మూర్ రాజకీయాలలో ఉత్కంఠత రేకెత్తిస్తోంది.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
ఆర్మూర్ : టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ కిడ్నాప్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చినట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లో హోం శాఖ మంత్రిని కలిసి ఆ ర్మూర్‌లో జరిగిన కౌన్సిలర్ కిడ్నాప్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలను సైతం జారీ చేశారన్నారు. మంత్రిని కలిసిన వారిలో పెర్కిట్ సొసైటీ చై ర్మన్ నచ్చు చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు నయీం, కాటిపల్లి భోజన్న, రామకృష్ణ తదితరులున్నారు.