
ఆస్పత్రి ఆవరణలో భర్త మృత దేహం వద్ద రోదిస్తున్న పూజ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ (34) హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇండిపెండెంట్‌గా గెలిచారని, ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారని, రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే హత్య చేశారని పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయకే తన అనుచరులతో ఈ హత్య చేయించారని రవినాయక్ తల్లి లక్ష్మి, భార్య పూజ ఆరోపించారు.
చదవండి👉🏾 ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో
కాగా, మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు పలువురు నాయకులను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. ఘటనపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ రవినాయక్ హత్య దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్, బీజేపీ గిరిజనమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ ఆస్పత్రికి చేరుకుని హత్యోదంతంపై ఆరా తీశారు.
చదవండి👉🏾 మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ దారుణహత్య
Comments
Please login to add a commentAdd a comment