Ward councillor
-
ఎమ్మెల్యే శంకర్‌నాయకే ఇదంతా చేయించారు: రవి భార్య పూజ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ (34) హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇండిపెండెంట్‌గా గెలిచారని, ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారని, రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే హత్య చేశారని పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయకే తన అనుచరులతో ఈ హత్య చేయించారని రవినాయక్ తల్లి లక్ష్మి, భార్య పూజ ఆరోపించారు. చదవండి👉🏾 ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో కాగా, మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు పలువురు నాయకులను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. ఘటనపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ రవినాయక్ హత్య దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్, బీజేపీ గిరిజనమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ ఆస్పత్రికి చేరుకుని హత్యోదంతంపై ఆరా తీశారు. చదవండి👉🏾 మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణహత్య -
మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణహత్య
సాక్షి, మహబూబాబాద్: బైక్‌పై వెళ్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఆపై గొడ్డలి, తల్వార్లతో విచక్షణారహితంగా నరికారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మహబూబాబాద్ పట్టణంలో పట్టపగలు జరిగిన ఈ హత్యోదంతం సంచలనం కలిగించింది. హత్యకు ఆర్థిక లావాదేవీలు, భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అంటుండగా, కౌన్సిలర్ రాజకీయ ఎదుగుదల చూడలేక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ హత్య చేయించారని మృతుడి తల్లి, భార్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ (34) గురువారం ఉదయం పత్తిపాకలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. పత్తిపాక సెంటర్ వద్ద కొంతమంది ట్రాక్టర్‌తో వచ్చి రవినాయక్ వాహనాన్ని ఢీకొట్టగా, రవి కింద పడిపోయారు. అప్పటికే ఆయనను కారులో వెంబడిస్తున్న దుండగులు, ట్రాక్టర్‌పై వచ్చిన వారిలో ఒకరు గొడ్డలి, తల్వార్లతో రవిపై దాడిచేశారు. తలపై నరకడంతో రవి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, చనిపోయినట్లు భావించి దుండగులు పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న రవినాయక్ బావమరిది చిరంజీవి.. రక్తపు మడుగులో పడి ఉన్న రవినాయక్‌ను చూసి చుట్టుపక్కల వారి సాయంతో 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రవినాయక్ మృతిచెందారు. హత్యలో రాజకీయ ప్రమేయం లేదు: ఎస్పీ రవినాయక్ నల్లబెల్లం, కట్టెల వ్యాపారం చేసేవారు. ఇందులో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాలతోనే రవి హత్య జరిగిందన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు భూతగాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పోలీసులు ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రవినాయక్‌పై రౌడీషీట్ కూడా ఉందని అంటున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్‌చంద్రపవార్ మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నామని, ఇందులో రాజకీయ ప్రమేయమేమీ లేదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
ముస్లిం కుటుంబాన్ని కాపాడిన బీజేపీ కౌన్సిలర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండ చల్లారటం లేదు. సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కొందరు ముష్కరులు ఓ ముస్లిం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించగా బీజేపీ కౌన్సిలర్ వారిని అడ్డగించి ముస్లిం కుటుంబాన్ని కాపాడిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. యమున విహార్‌లో సోమవారం రాత్రి నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 150 మంది ముష్కరులు దగ్గరలోని ముస్లిం కుటుంబాల నివాసాలను చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకుని ఓ ముస్లిం ఇంటిని చుట్టుముట్టారు. (హింసాత్మకంగా మారుతున్న సీఏఏ నిరసనలు) అనంతరం వారికి చెందిన కారు, బైక్ వాహనాలకు నిప్పంటించారు. ఈ ముస్లిం కుటుంబానికి సన్నిహితుడైన బీజేపీ వార్డు కౌన్సిలర్‌కు విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డగించాడు. వారు ఎలాంటి దాడికి పాల్పడకుండా అడ్డుకుని ముస్లిం కుటుంబాన్ని కాపాడాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘రాత్రి 11.30 గంటల సమయంలో జైశ్రీరాం అంటూ కొందరు గుంపులు గుంపులుగా మా ఇంటి వైపు పరిగెత్తుకు వచ్చారు. మా ఇంటి కింద అద్దెకు ఉంటున్న వ్యక్తి బొటిక్‌తో పాటు, మా వాహనాలను దగ్ధం చేశారు. అనంతరం మా ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రెండు నెలల పాపతో సహా అక్కడనుంచి బయటపడేందుకు ప్రయత్నించాం. కానీ సరిగ్గా అదే సమయంలో వార్డు కౌన్సిలర్ వచ్చి మా ఇంటితో పాటు కుటుంబాన్ని కాపాడాడు’ అని పేర్కొన్నారు. కాగా మంగళవారం జరిగిన అల్లర్లలో ఏడుగురు మృతి చెందగా 150 మంది గాయాలపాలయ్యారు. (సీఏఏపై ఆగని ఘర్షణలు..) -
గుండెపోటుతో వార్డు కౌన్సిలర్ మృతి
మాచర్ల : గుంటూరు జిల్లా మాచర్ల పట్ణణంలో 19 వ వార్డు కౌన్సిలర్ నట్టువ సత్యం (35) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన మృతి పట్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.