ప్రతీకార దాడులు తప్పవు ఈటెల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాదులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించని పక్షంలో ప్రతీకార దాడులు తప్పవని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతించి, తెలంగాణ సభలపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు శనివారం అసెంబ్లీ ఆవరణలో శనివారం దీక్షకు దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్, ఎం. బిక్షపతి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, ఎస్.వేణుగోపాలాచారి, సత్యనారాయణ, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కె. స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట దీక్షకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అందుకు అధికారులు అనుమతించకపోవడంతో అసెంబ్లీ రెండో గేటుకు కుడిపక్కనే దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్‌రావు, ఎంపీ జి.వివేక్, కె. స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ అని నినదించిన పోలీసు కానిస్టేబుల్‌పై విచక్షణా రహితంగా దాడి చేయుడం ప్రజాస్వావ్యు విరుద్ధవుని వారు అన్నారు. దాడి చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోని పక్షంలో తెలంగాణ ప్రజలు ప్రతీకార దాడులకు దిగుతారని అన్నారు. హైదరాబాద్,.. సమైక్య రాష్ట్రానికి పుట్టినబిడ్డ కాదని, హైదరాబాద్ ఉందనే, సమైక్యవాదులు దోచుకోవడానికి వచ్చారని ఈటెల వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సభ పెట్టి తెలంగాణ ప్రజల గుండెల మీద తన్నినట్టుగా ప్రజలు భావిస్తున్నారని, ముఖ్యమంత్రి కిరణ్, సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ, డీజీపీని కన్వీనర్‌గా పెట్టుకుని తెలంగాణ ప్రజలపై కక్షసాధిస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మాట్లాడుతూ, కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడిని,.. తెలంగాణ పోలీసులపై జరిగిన దాడిగా భావిస్తున్నావుని, ప్రాంతాలవారీ విభజన ఇక పోలీసుశాఖలోనూ తప్పదని అన్నారు. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, శ్రీనివాస్‌కు పూర్తిస్థాయిలో వైద్య చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై దండయాత్రకు వచ్చినట్టుగా సీవూంధ్రులు హైదరాబాద్ వచ్చినా వారికి సహకరించామని, సీమాంధ్ర గూండాలు మాత్రం తెలంగాణవాదులపై దాడి చేశారని ఆయున ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు మీడియూతో వూట్లాడారు.
విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కిరణ్: వివేక్
సీఎం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, పోలీసులు, డబ్బును వినియోగించి ఎన్జీవోల సభను ముఖ్యమంత్రే నిర్వహించారని ఎంపీ జి. వివేక్ ఆరోపించారు. హైదరాబాద్‌లోనూ సమైక్య ఉద్యమం ఉన్నట్టుగా చిత్రీకరించే కుట్రతోనే ప్రభుత్వమే సభను నిర్వహించిందన్నారు. సభకు సీవూంధ్ర జిల్లాలవారే వచ్చారని, తెలంగాణకు, సీమాంధ్రకు మధ్య విభజన దీనితో మరింత స్పష్టమైందన్నారు.
రాష్ట్రపతి పాలన పెట్టాలి: కోమటిరెడ్డి
సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కువూర్రెడ్డిని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్జీవోల సభకు 5 రోజుల ముందే అనుమతి ఇవ్వడం, సభకు వచ్చేవారికి వేలాదిమంది పోలీసులను రక్షణగా పెట్టడం సరికాదన్నారు.