TRS MLCs
-
ఆ ముగ్గురు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్సీల రాజీనామాతో వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మూడు స్థానా లకు ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. వీలైనంత వరకు ఈ 3 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేలా పార్టీ అధిష్టానం వ్యూహం సిద్ధం చేసింది. అయితే ఉమ్మడి జిల్లాల్లోని సమీకరణల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాలతో పాటు మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటికీ కలిపి సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో రెండు టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లే. 2015లో జరిగిన ఎన్నికల్లో వరంగల్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్, కాంగ్రెస్ నల్లగొండ స్థానాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం అమలు చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం అనంతరం అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మరో మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్‌కు రానున్నా రు. కేసీఆర్ వచ్చాకే అభ్యర్థులను ప్రకటించే అవకా శం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ►వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కొండా మురళి.. కాంగ్రెస్‌లో చేరడంతో పదవికి చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం ఈ స్థానానికి పరిశీలిస్తోంది. ►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పద వికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో పట్నం మహేందర్‌రెడ్డి, పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. ►ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక జరుగుతోంది. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే కోటాలోనా.. స్థానిక సంస్థలో కోటాలో అవకాశం కల్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. త్వరలో మరో నాలుగు స్థానాలు.. రాష్ట్ర శాసనమండలిలో 40 స్థానాలు ఉన్నాయి. ప్రస్తు తం 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 స్థానా లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 4 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కారణంగా మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. అనర్హత వేటు కారణంగా యాదవరెడ్డి, రాములునాయక్, భూపతిరెడ్డిల శానసమండలి సభ్యత్వాలు రద్దయ్యా యి. అనర్హత వేటు నిర్ణయంపై వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు అనంతరం ఈ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ స్థానాలకు టీఆర్ఎస్ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత కె.నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని లోక్‌సభ అభ్యర్థుల జాబితా వెల్లడించిన రోజే టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. -
నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్ మండలి పక్షం విలీనానికి సంబంధించి ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, ఆకుల లలిత, సంతోష్‌కుమార్, దామోదర్‌రెడ్డిలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. మండలి చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులిచ్చింది. మొత్తం వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్‌కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు మండలి అప్పటి చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ ఇచ్చారు. వెంటనే మండలి చైర్మన్ ఆ లేఖను ఆమోదించడంతో ఆ మేర బులెటిన్ జారీ అయింది. ఈ విలీన ప్రక్రియను సవాల్ చేస్తూ న్యాయవాదులు గిన్నె మల్లేశ్వరరావు, సి.బాలాజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఐ.మల్లికార్జున శర్మ వాదనలు వినిపిస్తూ.. విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీచేసిన బులెటిన్ చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. విలీనం సాకుతో టీఆర్ఎస్లో చేరిన ఆ నలుగురు ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఆ నలుగురు కూడా అనర్హత వేటుకు అర్హులేనన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతోపాటు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి) నుంచి పీఆర్టీయూ అభ్యర్థిగా విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి శాసనమండలి దర్బారు హాలులో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ నలుగురి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ నేతలు, పలువురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కొత్త ఎమ్మెల్సీలు, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీ లను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి: మైనంపల్లి టీఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జూబ్లీహాలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో కష్టపడ్డ అందరికీ సీఎం కేసీఆర్ తగిన గుర్తింపు ఇస్తున్నారని, వారందరికీ తప్పక న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ సభ్యత్వం భారీగా నమోదవుతోందని, ఈ సారి 20 లక్షలపైనే సభ్యత్వ లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. -
నరకానికి కేరాఫ్ అడ్రస్ గాంధీభవన్
బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావులు స్పష్టం చేశారు. తాము పదవులు ఆశించి టీఆర్పార్టీలో చేరలేదని... తమకు పార్టీలో ఎటువంటి పదవులు తీసుకోమని వారు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తాము ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరింది విలేకర్ల సమావేశంలో వివరించారు. కాంగ్రెస్ పార్టీలో దోపిడీదారులు ఎక్కువయ్యారని ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావు ఆరోపించారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, డీఎస్‌లు ఇద్దరు దోపిడి దారులేనని వారు అభివర్ణించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని నేత పైరవీ ద్వారా పదవులు తెచ్చుకున్నారని విమర్శించారు. గాంధీభవన్ నరకలోకానికి కేరాఫ్ అడ్రాస్‌గా మారిందని ఎద్దేవా చేశారు.