డబ్బిచ్చి, బతిమాలితే వచ్చిన ఓట్లు కావివి: కేసీఆర్
హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ప్రజలు తమ పాలనపై విశ్వాసం ఉంచి, అభిమానంతో భారీ విజయం అందించారని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. వరంగల్ ఎన్నికలో డబ్బులు ఇచ్చి తాము ఓట్లు కొనుగోలు చేయలేదని, ఓట్లు వేయాలని బతిమాలలేదని, ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేశారని కేసీఆర్ అన్నారు. వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించిన అనంతరం మంగళవారం సాయంత్రం.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే..
వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక విజయం చరిత్రాత్మకం
మా గురించి విపక్షాలు చాలా నీచంగా ప్రచారం చేశాయి. ప్రజలు విపక్షాలకు తగిన బుద్ధి చెప్పారు
ప్రజలు అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటేశారు
వరంగల్ ఉప ఎన్నికలో 70 శాతం పోలింగ్ జరిగిందని పార్టీ శ్రేణులు చెప్పగానే.. ప్రజలకు మనపై నమ్మకం ఉంటే భారీ విజయం సాధిస్తామని, లేకుంటే అదే స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని చెప్పాను
వరంగల్ ప్రజలు వెల్లువలాంటి ఫలితాన్నిచ్చారు
ప్రభుత్వ పథకాలపై ప్రజలు విశ్వాసం ఉంచారు
ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది
తెలంగాణలో బ్రహ్మాండంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
రైతులకు సకాలంలో విత్తనాలను పంపిణీ చేస్తాం
సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం