trtc buses
-
నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్ పాస్‌ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్‌లపై 20 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్‌పాస్ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ రూ.2800కు పాస్‌లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్ (క్వార్టర్లీ) ప్రస్తుతం రూ.3900. 20 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.3120. రౌండెడ్ ఆఫ్‌తో రూ.3200కు పాస్‌లను పొందవచ్చు. పాస్‌ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ తాత్కాలిక బస్షెల్టర్లు రహదారుల విస్తరణ కారణంగా తొలగించిన బస్షెల్టర్ల స్థానంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. తొలగించిన బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సదుపాయం కోసం 24 బస్టాపుల్లో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. భరత్‌నగర్ (ఎర్రగడ్డ వైపు), ప్రగతినగర్, ఎల్లంపేట్ క్రాస్‌రోడ్, ఆర్సీపురం, ఉప్పల్ (రేణుక వైన్స్), యాప్రాల్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్, జియాగూడ గాంధీ విగ్రహం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, అడిక్‌మెట్, నారాయణగూడ (హిమాయత్‌నగర్ వైపు), బర్కత్‌పురా పీఎఫ్ ఆఫీస్, అఫ్జల్‌గంజ్, జిల్లెలగూడ, జైపురికాలనీ, మన్నెగూడ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ డిపో తదితర ప్రాంతాల్లో టెంట్లు వేసి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: పుట్టగానే ఆధార్!) -
కాసుల గలగల !
స్టేషన్ మహబూబ్‌నగర్ : ఆర్టీసీకి దసరా పండగ కలిసొచ్చింది. పండగ సందర్భంగా ముందు నుంచి సెలవులు ముగిసే వరకు అదనపు బస్సు సర్వీసులు నడపడంతో మంచి ఆదాయాన్ని ఆర్జించింది. మహబూబ్‌నగర్ రీజియన్ వ్యాప్తంగా తొమ్మిది డిపోల నుంచి ప్రయాణికుల కోసం అధికారులు అదనంగా 299 బస్సులు నడపడంతో ఆర్టీసీ గల్లా పెట్టె కళకళలాడింది. సాధారణ రోజుల్లో కంటే రీజియన్ పరిధిలోని ప్రతీ డిపోకు రోజుకు సాధారణంగా కంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల అదనపు ఆదాయం నమోదు కావడం విశేషం . అదనపు సర్వీసులు దసరా సెలవులను పురస్కరించుకుని హైదరాబాద్‌తో పాటు ఇతరత్రా ప్రాంతాలకు స్థానికులు వచ్చి వెళ్లడం ఆనవాయితీ. దీంతో ముందుగానే ఆర్టీసీ అధికారులు ప్రణాళికాప్రకారం ముందుకు సాగారు. ఈ మేరకు 10 నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. డిపోల వారీగా గద్వాల నుంచి 24, మహబూబ్‌నగర్ నుంచి 48, వనపర్తి నుంచి 33, షాద్‌నగర్ నుంచి 38, అచ్చంపేట నుంచి 29, కల్వకుర్తి నుంచి 26, కొల్లాపూర్ నుంచి 19 అదనపు సర్వీసులతో పాటు నాగర్‌కర్నూల్ డిపో నుంచి 30 అదనపు బస్సులను నడిపించారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకపోగా.. ఆర్టీసీకి భారీగా ఆదాయం నమోదైంది. అయితే, ఆదివారంతో సెలవులు ముగిసినా ప్రయాణికుల రద్దీని బట్టీ మరో రెండు రోజుల వరకు అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆర్టీసీకి పండుగ పండుగ సమయంలో రెండు రోజులు మినహా ప్రతి రోజు రీజియన్‌కు అదనపు ఆదాయం లభిం చింది. సాధారణ రోజుల్లో ఆదాయం కంటే పండు గ రోజుల్లో ప్రతి డిపోకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అదనపు వచ్చింది. రీజియన్‌లోని డిపోల్లో మహబూబ్‌నగర్ డిపో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుంది. హైదరాబాద్ రూట్లో నడిపే బస్సుల ద్వారా మహబూబ్‌నగర్ డిపో అధిక ఆదాయాన్ని పొందుతుంది. పండుగ ముగియడంతో ప్రజలు తిరుగుప్రయాణం పట్టారు. దీంతో రీజియన్‌లోని బస్టాండ్లలో ప్రయాణీకులు కిక్కిరిసిపోతున్నారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో శనివారం రూ.97,94,306, ఆదివారం రూ.1,09,76,806 ఆదాయం నమోదైంది. సాధారణ రోజుల్లో పోలిస్తే ఆదివారం రీజియన్‌కు రూ.17లక్షలకుపైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. రీజియన్ వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 3,28,897 కిలోమీటర్లు నడిచే బస్సులు శనివారం ఆర్టీసీ బస్సులు 3,34,441 కిలోమీటర్లు, ఆదివారం 3,48,096 కిలోమీటర్లు నడిచాయి. -
ఆర్టీసీని టీడీపీ నిర్వీర్యం చేస్తోంది
విజయవాడ: కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి విమర్శించారు. లాభాలు లేవనే ఉద్దేశంతో ఆర్టీసీని మూసివేయాలని చూస్తున్నారని, కేశినేని నాని బస్సులను ఇందులో హైర్ బస్సులుగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. ఆర్టీసీలోని ఏఎన్ఎల్ పార్శిల్ సర్వీసు భారీ లాభాలలో ఉంటే అది ప్రభుత్వానికి రూ.9 కోట్లే చెల్లిస్తున్నదన్నారు. ఈ పార్శిల్ సర్వీస్ కాంట్రాక్టు ఈ ఏడాదితో ముగుస్తున్నా దాన్ని కొనసాగించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్మికుల ఆసుపత్రి కోసం ప్రతి కార్మికుని నుంచి నెలనెలా రూ.100 లు వసూలు చేస్తున్నారని, అంటే ఏడాదికి వసూలయ్యే రూ.7 కోట్లు డబ్బు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పని గంటలను సడలిస్తూ స్ల్పిట్ డ్యూటీల పేరుతో ఎవరితోనూ చర్చలు జరపకుండా విజయవాడ విద్యాధరపురం డిపోనుంచి ప్రారంభిస్తున్నారని, దీంతో కార్మికులు సమ్మెలు చేస్తారని సాకుగా చూపి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని గౌంతరెడ్డి అన్నారు. -
ఆర్టీసీని టీడీపీ నిర్వీర్యం చేస్తోంది