trump travel ban
-
H1-B వీసాలపై తాత్కాలిక నిషేధం
ఈ నెల 24 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ H1-B వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ నిషేధం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2021 ఏడాదికి జారీ చేసిన H1-B వీసాలకు బ్రేక్ పడనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కోవిడ్-19 కారణంగా అమెరికాలో గత రెండు నెలలుగా నిరుద్యోగం పెరిగిపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా 2021 ఏడాదిలో యూఎస్ వర్క్ పర్మిట్లు పొందగోరేవారు స్టాంపింగ్ కోసం వచ్చే ఏడాది వరకూ వేచిచూడవలసి ఉంటుందని నిపుణులు వివరించారు. రెన్యూవల్స్ సైతం నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. 85,000 వీసాలు ప్రతీ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా 85,000 H1-B వీసాలను జారీ చేస్తుంటుంది. దేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఐటీ నిపుణుల కోసం వీటిని అత్యధికంగా పొందుతుంటాయి. తద్వారా తమ నిపుణుల ద్వారా యూఎస్‌లో ఐటీ సర్వీసులను అందించేందుకు వినియోగిస్తుంటాయి.కాగా.. H1-Bతోపాటు... H2-B, L-1, కొన్ని కేటగిరీల J వీసాలపై సైతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత్కాలిక నిషేధాన్ని విధించారు. ఇటీవల చెలరేగిన కరోనా వైరస్ కల్లోలం కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య తాజాగా 4 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇక గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికా వెలుపలి నుంచి దరఖాస్తు చేసుకున్న వారిపై మాత్రమే ఈ తాత్కాలిక నిషేధ ప్రభావం పడనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీ ఐటీ కంపెనీలపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. H1-B వీసాపై నాలుగు లక్షల మంది, L-1 వీసాలపై లక్షమంది నిపుణులు అమెరికాలో దేశీ ఐటీ కంపెనీల తరఫున విధులు నిర్వహిస్తున్నారు. -
'ట్రంప్ నిర్ణయం బాగా దెబ్బ కొట్టింది'
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పాకిస్తాన్‌ను బాగా దెబ్బకొట్టింది. పాకిస్తాన్ నుంచి వీసాను ఆకాంక్షించే వారిపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రభావం భారీగా పడిందని పొలిటికో రిపోర్టు చేసింది. పొలిటికో అధ్యయనం ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సగటున నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు 26 శాతం తక్కువగా మంజూరు అయినట్టు తెలిసింది. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, సుడాన్ దేశాల ప్రజలను తమ దేశం రావడంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఇరాక్, సూడాన్లను ఈ జాబితా నుంచి తీసివేసి, ఛాద్, నార్త్ కొరియా, వెనిజులాలను ఆ జాబితాలో చేర్చింది. అనంతరం ముస్లిం మెజార్టీ దేశాలకు వీసా మంజూరు చేయడం తగ్గిపోయిందని పొలిటికో అధ్యయనం వెల్లడించింది. అరబ్ దేశాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ జాబితాలో పాకిస్తాన్ లేనప్పటికీ, ఆ దేశ ప్రయాణికులకు జారీచేసిన వీసాలు భారీగా తగ్గిపోయాయి. -
ట్రంప్ దెబ్బకు ఆ విమానానికి బుకింగ్స్ కరువు
బెర్లిన్ : ట్రంప్ దెబ్బకు ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ కు బుకింగ్స్ కరువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఒరిజినల్ ట్రావెల్ బ్యాన్ అనంతరం తమ బుకింగ్స్ 35 శాతం పడిపోయాయని ఎమిరేట్స్ విమానయాన సంస్థ అధ్యక్షుడు టిక్ క్లార్క్ చెప్పారు. జనవరి నెలలో ట్రంప్ ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రయాణికులకు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం విదితమే. అనంతరం ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. నిరసనకారులు విమానశ్రయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. అనంతరం మళ్లీ ట్రావెల్ బ్యాన్ పై కొత్త ఆర్డర్లను ట్రంప్ జారీచేశారు. ఈ సారి ఆరు దేశాలపైనే వేటువేసి, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన వెంటనే ఈ ప్రభావం తమ సంస్థపై పడిందని క్లార్క్ చెప్పారు. గత నెలలో భారతీయుడిపై కాన్సస్ లో జరిగిన విద్వేషపూరిత దాడి కూడా తమ ఎయిర్ లైన్స్ కు దెబ్బకొట్టినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం బుకింగ్స్ రికవరీ అవుతున్నాయని, కానీ ఆశించని స్థాయిలో లేదన్నారు. యథాతథ స్థితికి వస్తాయో లేదో కూడా అనుమానమేనని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఎనిమిది రోజుల్లోనే అమెరికాకు వెళ్లే ప్రయాణికుల శాతం కూడా 6.5 శాతం తగ్గినట్టు ట్రావెల్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ కీస్ సోమవారం రిపోర్టు వెలువరిచింది. నిషేధ దేశాల ప్రయాణికులను, అమెరికాను కలుపుతూ ప్రయాణించే ప్రధాన విమానసంస్థ ఎమిరేట్సే. దుబాయ్ హబ్ ద్వారా ఇది ప్రయాణిస్తోంది. నిషేధ దేశాలకు, అమెరికాకు ప్రస్తుతం డైరెక్ట్ గా ఎలాంటి విమానాలు లేవు. -
ట్రంప్ ఆస్ట్రేలియన్లను కూడా చీల్చాడు!
కాన్బెర్రా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు మాత్రమే కాదు.. తన గురించి చర్చించుకుంటున్నవారికి తలనొప్పిగా మారారు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన ఏడు ముస్లిం దేశాల పౌరుల ట్రావెలింగ్ బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా వాసులు రెండుగా చీలిపోయారు. ట్రంప్‌దే కరెక్ట్ అని సగం మంది, సరికాదని మిగితా సగంమంది తగువుకు దిగారు. ఈ విషయం అక్కడ నిర్వహించిన ఓ ఆన్లైన్ సంస్థ తెలిపింది. 44శాతంమంది ఆస్ట్రేలియన్లు ట్రంప్ నిర్ణయానికి అనుకూలంగా నిలవగా 45 శాతం మంది మాత్రం వ్యతిరేకంగా నిల్చున్నారు. కన్జర్వేటివ్ ఓటర్లంతా కూడా ట్రంప్ శైలి తమకు నచ్చిందని, దానిని ప్రవేశపెడితే ఆస్ట్రేలియాలోకి కూడా వలసలు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారంట. అలాగే, నేషనల్, లిబర్ ఓటర్లు కూడా ట్రంప్ విధానాన్ని సమర్థిస్తున్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. ఇక 34శాతం ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నారని, అదే సమయంలో 55శాతం మంది మాత్రం ట్రంప్ విధానంపై గుర్రుగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి దేశాలు స్పష్టంగా ట్రంప్ విధానాన్ని తప్పుబట్టగా అమెరికా వ్యక్తిగత అంశాల్లో తాము జోక్యం చేసుకోమని, అది ఆ దేశం ఇష్టమంటూ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ స్పష్టతనివ్వకుండా సమాధానం దాటవేశారు.