'ట్రంప్‌ నిర్ణయం‌ బాగా దెబ్బ కొట్టింది' | Pakistanis severely hit by Donald Trumps travel ban | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నిర్ణయం‌: ఆ దేశాన్ని బాగా దెబ్బ కొట్టింది

Published Sat, Sep 30 2017 6:31 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

Pakistanis severely hit by Donald Trumps travel ban - Sakshi

ఇస్లామాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ పాకిస్తాన్‌ను బాగా దెబ్బకొట్టింది. పాకిస్తాన్‌ నుంచి వీసాను ఆకాంక్షించే వారిపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ ప్రభావం భారీగా పడిందని పొలిటికో రిపోర్టు చేసింది. పొలిటికో అధ్యయనం ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది  సగటున నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలు 26 శాతం తక్కువగా మంజూరు అయినట్టు తెలిసింది. ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్‌, సుడాన్‌ దేశాల ప్రజలను తమ దేశం రావడంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ట్రంప్‌ ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేసిన సంగతి తెలిసిందే.

తర్వాత ఇరాక్‌, సూడాన్‌లను ఈ జాబితా నుంచి తీసివేసి, ఛాద్‌, నార్త్‌ కొరియా, వెనిజులాలను ఆ జాబితాలో చేర్చింది. అనంతరం ముస్లిం మెజార్టీ దేశాలకు వీసా మంజూరు చేయడం తగ్గిపోయిందని పొలిటికో అధ్యయనం వెల్లడించింది.  అరబ్‌ దేశాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. ట్రంప్‌ విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ జాబితాలో పాకిస్తాన్‌ లేనప్పటికీ, ఆ దేశ ప్రయాణికులకు జారీచేసిన వీసాలు భారీగా తగ్గిపోయాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement