Trupti
-
గోదావరి నదీ తీరాన ఇల్లు.. నాడు ఆ వ్యక్తి చేసిన పనితో వినూత్నంగా
Nashik Trupti Gaikwad After Puja Turns Idols Into Toys: జైజై గణేశా! జై కొట్టు గణేశా!! వరములిచ్చు ఓ బొజ్జ గణేశా!!! అని పాటలు పాడుకుని ఆటలు ఆడుకుని వేడుక చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. వేడుక పూర్తయిన తర్వాత ఆ బొజ్జ గణపయ్యను ఏం చేయాలనేదే పెద్ద ప్రశ్న. ఓ దశాబ్దం కిందటి వరకు దగ్గరలో ఉన్న చెరువు, సముద్రం, సరస్సు, కొలను... ఏదో ఒకచోట నీటిలో కలిపేసే వాళ్లం. సింథటిక్ రంగులు, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని పట్ల చైతన్యవంతం అవుతున్న కొద్దీ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనేక దారులు వెతుక్కుంటున్నాం. అందుకోసం మేధోమధనమే చేస్తున్నాం. మట్టి గణపతిని బకెట్లో నీటిలో వేసి కరిగించి మొక్కలకు పోయడం నుంచి గణపతిని విత్తనాలతో మలిచి, పూజ పూర్తయిన తరవాత పంటమడిగా మార్చడం వరకు ఎన్ని కొత్త ఆలోచనలో. మహారాష్ట్ర, నాసిక్‌కు చెందిన అడ్వొకేట్ తృప్తి గైక్వాడ్ కూడా వినూత్నంగా ఆలోచించారు. ఆమె గణపతి బొమ్మలను రీసైకిల్ చేసి బొమ్మలుగా మారుస్తున్నారు. రెండేళ్ల కిందట మొదలైంది ‘మా ఇల్లు గోదావరి నది తీరాన ఉంది. ఓ రోజు ఓ వ్యక్తి నదికి ఓ భారీ లగేజ్‌తో వచ్చాడు. అందులో ఉన్న వస్తువులన్నింటినీ నదిలో కలిపేయాలనేది అతడి ప్రయత్నం. వీటిని జలమయం చేయవద్దు, రీసైకిల్ చేసి ఉపయోగించుకోదగిన వస్తువులుగా మార్చుకోవచ్చని చెప్పాను. అతడు అంగీకరించాడు. అలా మొదలైన నా ప్రయత్నంలో ఆ తర్వాత గణేశ విగ్రహాల రీసైక్లింగ్ కూడా చేరింది. విగ్రహాల తయారీలో ఉపయోగించిన మెటీరియల్ మొత్తాన్ని వేరు చేసి కొత్త బొమ్మలను చేస్తున్నాం. ఆ బొమ్మలను అల్పాదాయ వర్గాల కాలనీల పిల్లలకు పంచుతున్నాం. ఒక్కోసారి ఒక్కోచోటకు వెళ్లి ఇస్తుంటాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వాళ్లు పండుగ తర్వాత వాళ్లంతట వాళ్లే బొమ్మలను తెచ్చి ఇస్తున్నారు. పూనా, నాగపూర్, ముంబయి నుంచి కూడా మాకు గణేశ బొమ్మలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇరవై వేలకు పైగా విగ్రహాలను కరిగించి పిల్లలు ఆడుకునే బొమ్మలను చేశాం’’ అని చెప్తున్నారు తృప్తి గైక్వాడ్. చదవండి: Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
ఆ సినిమాకు ముందు, తర్వాత..
బాలీవుడ్లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. లైలా తృప్తి డిమ్రీ. సన్నిహితులంతా ట్రాప్స్ అని పిలుచుకుంటే ఓటీటీ అభిమానులు బుల్బుల్ అంటారు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తృప్తి.. మొదట్లో కెమెరా ముందుకు రావడానికి చాలా సిగ్గుపడేదట. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్ డిమ్రీ .. ఎయిర్ ఇండియా ఉద్యోగి. తల్లి (పేరు తెలియదు).. ఇంటి బాధ్యతలు తీసుకుంది. తృప్తికి ఇద్దరు తోబుట్టువులు. 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది తృప్తి. 2018లో రొమాంటిక్ మూవీ ‘లైలా–మజ్ను’లోని లైలా పాత్రతో ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది. 2020లో హారర్ అండ్ థ్రిల్లర్ ‘బుల్బుల్’ల్తో ఓటీటీ స్టార్‌గా మారింది. అందులో తన అభినయానికి విమర్శకుల ప్రసంసలను పొందింది. నెట్ ఫ్లిక్స్ వీక్షకుల అభిమానటి అయింది. ‘బుల్బుల్’ సినిమాలో ప్రధాన పాత్ర నాకు దొరకడం చాలా హ్యాపీ. నా కెరీర్ బుల్బుల్ ముందు, తర్వాత అని చూసుకుంటే.. కచ్చితంగా మెరుగైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రేక్షకులు నన్ను లీడ్ రోల్లో చూడటానికి సిద్ధపడుతున్నారు’ అంటుంది. సినిమా ఫీల్డ్‌లోకి తృప్తి అనుకోకుండా వచ్చింది. తన సోదరుడి స్నేహితుడు ఫొటోగ్రాఫర్ కావడంతో.. ఈమె ఫొటోలు తీసి.. ఢిల్లీలోని ఇమేజెస్ బజార్‌కు పంపించాడట. వాళ్లు ఫొటో షూట్ చేయడానికి ఆమెని ఎంపిక చెయ్యడంతో ఆ ప్రయాణం మొదలైంది. కొన్నాళ్లు యూట్యూబ్ చానెల్లో కూడా పని చేసింది. ‘కెమెరా అలవాటు పడటానికి యూట్యూబ్ చానెల్ ఒక అనుభవం’ అని చెప్తుంది తృప్తి. దినేష్ డిమ్రీ నటుడు కావాలని కాలేకపోయారట. తండ్రి ఆశయాన్ని తను నెరవేర్చాలనుకుంది.. కనీసం బుల్లితెరపై నటించైనా. నటననే లక్ష్యంగా తీసుకున్న తృప్తి మొదట్లో మోడలింగ్ చేసింది. అందులో సంపాదించుకున్న పేరుతో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడానికి ముంబై చేరింది. ‘నేను నటిని కావాలనుకుంటున్నానని మొదటిసారి ఇంట్లో చెప్పినప్పుడు.. షాక్ అయ్యారు. నటి అయితే బయటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు బంధువులతోనే సరిగా మాట్లాడవు కదా? అన్నారు. ఇప్పుడు నేను చాలా నేర్చుకుంటున్నాను. చాలా మారాను కూడా. ఛాన్స్‌ల కోసం అవసరం ఉన్నా లేకున్నా సినిమా వాళ్లందరికీ సలాం కొట్టాలనే సిద్ధాంతాన్ని నేనెప్పుడూ నమ్మను. టాలెంట్‌నే నమ్ముతాను’ అంటుంది తృప్తి డిమ్రీ. -
హజి అలీ దర్గాలో ప్రవేశించిన తృప్తీ దేశాయ్
ముంబైః భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీదేశాయ్ ముస్లింల పవిత్ర క్షేత్రాలనూ వదల్లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై పోరాడి ఫలితాలను సాధిస్తున్న ఆమె..... తన మద్దతుదారులతో కలసి, తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించి సంచలనం రేపింది. పలువురు మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు భారీ బందోబస్తుతో తృప్తి దేశాయ్...ముంబైలోని ముస్లిం పవిత్ర క్షేత్రం హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ, సంప్రదాయ బంధనాలను తెంచుకొని ఆమె.. గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అయితే దర్గాలోని గర్భాలయంలోకి మాత్రం ఆమె ప్రవేశించలేదు. దర్గా ఆచారాలను అనుసరించి, ట్రస్ట్ సభ్యుల అనుమతితో, పోలీసు బందోబస్తుతో దర్గాలోకి ప్రవేశించిన తృప్తి... అక్కడ ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోపు మరోసారి దర్గాలోని పురుషులు మాత్రమే ప్రవేశించే ముఖ్య ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడే ప్రార్థనలు జరుపుతామంటూ వ్యాఖ్యానించారు. తృప్తి దేశాయ్, ఆమె మద్దతు దారులు, ఇంతకు ముందే ఓసారి దర్గాలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా... పోలీసులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. ప్రార్థనాలయాల్లో మహిళలకు అనుమతిపై లింగ వివక్షను విడనాడాలంటూ పోరాడుతున్న తృప్తి దేశాయ్... శనిసింగనాపూర్, త్రంయబకేశ్వర్ హిందూ ఆలయాల ప్రవేశం అనంతరం ముంబైలోని ప్రముఖ దర్గా ప్రవేశాన్ని ఎంచుకున్నారు. త్వరలోనే మహిళలను దర్గాలోని నిషేధ ప్రాంతానికి కూడ అనుమతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
'మోహన్ భగవత్ ప్రగతిశీల ఆలోచనాపరుడు'
ఆలయాల్లో స్త్రీల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్... తమ హక్కుల పోరాటంలో మోహన్ భగవత్ వైఖరిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. తాజాగా ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలంటూ డిమాండ్ చేసిన ఆమె... మోహన్ భగవత్ జీ ప్రగతిశీల ఆలోచనాపరుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ వైఖరిని ఆయన గౌరవిస్తారని భావిస్తున్నానన్నారు. స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం పోరాటంలో భాగంగా తృప్తిదేశాయ్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ డిమాండ్ ను మోహన్ భగవత్ గౌరవిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాము సాధించాలని ప్రయత్నిస్తున్న హక్కులపై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తమ వైఖరిని తెలియజేయాలన్నారు. ఆ విధంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ సమానత్వంకోసం పోరాడుతున్న తమకు.. మద్దతు పలుకుతుందని నమ్ముతున్నట్లు తృప్తి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రీయ సేవికా సమితి ద్వారా మహిళలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆర్ ఎస్ ఎస్ లో ప్రత్యక్షంగా సభ్యంత్వం కోసం తృప్తి డిమాండ్ ను లేవనెత్తారు. తృప్తిదేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే తృప్తి తాజా డిమాండ్ పై మాట్లాడిన బిజెపి ఉపాధ్యక్షుడు కాంత నలవాడే మాత్రం ఆమె డిమాండ్లు అర్థరహితమని, అనవసరమైన సమస్యలు సృష్టించకుండా.. మహిళలను వేధిస్తున్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాడితే మంచిదని సూచించారు. -
వెలుగునిచ్చే వేస్ట్ బాటిల్..!
పనికిరాని వస్తువులతో కళాఖండాలు తయారు చేయడం చూస్తాం. వేస్ట్ మెటీరియల్ ను ఉపయోగించి విద్యుత్ ను వెలికి తీయడం తెలుసు. రీ సైకిలింగ్ తో కొత్త వస్తువుల తయారీ జరుగుతుంది. కానీ పనికి రాని ప్లాస్టిక్ బాటిల్స్ ను.. వెలుగులు నింపే బల్బులుగా వాడొచ్చంటున్నారు బెంగుళూరుకు చెందిన పంకజ్, తృప్తిలు. చీకట్లో మగ్గుతున్న నిరుపేదల కళ్ళల్లో వెలుగులు చూడాలన్నదే వారి ఆశయం. అందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. వారి ఆలోచకు ఫలితాలే.. ప్రస్తుతం అక్కడ మురికి వాడలు, గిరిజన గ్రామాల్లో వెలుగులుగా మారుతున్నాయి. మా అమ్మాయికి ప్రమాద భయం లేదు. అబ్బాయి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండగల్గుతున్నాడు. మేమంతా ఎంతో ఆనందంగా హాయిగా ఇంట్లో గడుపుతున్నాం అంటుంది తన ఇంట్లో వేస్ట్ బాటిల్ వెలుగును పొందిన ఓ మహిళ. ఓ చిన్న ప్లాస్టిక్ పెట్ బాటిల్ వారి జీవితాల్లో వెలుగులు నింపిందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ.. మనం నీళ్ళు తాగిన తర్వాత ఖాళీ బాటిల్ ను అవతల పారేస్తుంటాం. కానీ ఆ పడేసే ప్లాస్టిక్ సీసాలే సోలార్ వెలుగులతో ఎన్నో ఇళ్ళల్లో కాంతిని నింపుతున్నాయి. విద్యుత్ కాంతులకు దూరంగా చీకట్లో నివసిస్తున్న మురికివాడలు, గిరిజన గ్రామాల్లోనూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్ళు సోలార్ విద్యుత్ దీపాలుగా మారాయి. నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు 2011లో ఇలాక్ డియాజ్.. లైటర్ ఆఫ్ లైట్ పేరున ప్రారంభించిన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఆయన్నేపంకజ్, తృప్తిలు స్ఫూర్తిగా తీసుకున్నారు. బెంగళూరులో తమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంకజ్, తృప్తిలు కో ఫౌండర్లుగా బెంగుళూరులో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇళ్ళల్లో రూఫ్ కి చిన్నపాటి రంధ్రం చేసి, నీటితో నింపిన ప్లాస్టిక్ పెట్ బాటిల్‌ను అక్కడ బిగిస్తారు. పగలంతా సూర్యకాంతి ఈ బాటిల్ లోని నీటిపై పడి పరావర్తనం చెంది ఇల్లంతా వెలుగు ప్రసరింపచేస్తుంటుంది. ఈ ఐడియా చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రస్తుతం నాతోపాటు నాటీ టీమ్ ఈ కార్యక్రమంపై గ్రామాల్లో, పాఠశాలల్లో, పిల్లలు వారికి వారే ఈ లైట్ ను ఏర్పాటు చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు తృప్తి. అతి తక్కువ ధరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానికంగా దొరికే వేస్ట్ మెటీరియల్ ను వినియోగిస్తున్నారు. లైటర్ ఆఫ్ లైట్ మురికి వాడలు, ఇరుకు సందులు, చీకటిగా ఉండే ప్రాంతాల్లో ప్రవేశపెట్టి అక్కడి వారి కళ్ళల్లో వెలుగులు చూస్తున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అక్కడి వారు ఓ సంఘంగా ఏర్పడి తక్కువ ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకో గలితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ కాలుష్య రహిత లైటింగ్ సిస్టమ్ ను రాత్రీ, పగలు ఉండేలా గిరిజన గ్రామాల్లో, నగరాల్లో ఉండే మురికి వాడల్లో, పాఠశాలల్లోప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం తృప్తి, పంకజ్ ల టీమ్ పెట్ బాటిల్స్ తో సోలార్ బల్బ్ ను తయారు చేసే పనిలో ఉన్నారు. మొత్తం ఇరవై మంది ఉన్న టీమ్...35 ఇళ్ళలో పగలంతా ఉండేలా డేలైట్ బాటిల్స్ ను, మరో ఐదు నైట్ లైట్ బాటిల్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక్కోసారి మురికివాడల్లోని జనం తమ ఇళ్ళకు రంధ్రం పెట్టేందుకు ఒప్పుకోని సందర్భాలు ఉంటాయని, అటువంటప్పుడు సంయమనంతో వారిలో అవగాహన పెంచి, అర్థమయ్యేలా విషయాన్ని వివరించాల్సి వస్తుంటుందని తృప్తి టీం చెప్తున్నారు. 2015 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ గా మార్చేందుకు 'లైటర్ ఆఫ్ లైట్' టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను కూడ నిర్వహిస్తోంది. స్కూళ్ళు, కాలేజీల్లో విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై వివరాలు అందిస్తోంది. 'లైటర్ ఆఫ్ లైట్' ను సేవాభావం ఉన్న ప్రతివారూ అమలు చేసి, విద్యుత్ కు దూరంగా ఉన్న గ్రామాల్లోనూ, చీకటి ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నింపొచ్చని ఈ టీమ్ చెప్తోంది. ముఖ్యంగా వేస్ట్ ను బెస్ట్ గా మార్చడానికి ఎంతో సృజన అవసరం. అంతకు మించి ఓ కొత్త రూపాన్ని సృష్టించాలన్న తపన కూడ ఉన్నప్పుడే ప్రతి విషయంలోనూ విజేతలుగా నిలుస్తారు. ఆకోవలో ప్రస్తుతం పంకజ్, తృప్తిలు కొనసాగుతున్నారు.