TS BJP chief K.Laxman
-
ఆర్టీసీ సమ్మె: బీజేపీ ప్రత్యక్ష కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు పార్టీ తరపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ శుక్రవారం వెల్లడించారు. అందులో భాగంగా శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో, బస్ భవన్ ఎదుట, ఆర్టీసీ జేఏసీ ధర్నాలలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పండుగ పూట జీతాలు కూడా ఇవ్వకుండా కార్మికుల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర చేస్తున్నారనీ, ఇప్పటికే వరంగల్‌లో మూడెకరాలను అనుచరులకు ఇచ్చేశారని మండిపడ్డారు. గత ఆరు సంవత్సరాల్లో ఆరు సార్లు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, కష్టపడి పనిచేస్తోన్న కార్మికులను డిస్మిస్ చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ కార్మికశాఖా మంత్రిగా పనిచేసినా చట్టాలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పాలకులు నియంతలుగా మారి ప్రశ్నించే వాళ్ల గొంతును నొక్కేస్తున్నారని, అమరుల త్యాగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె కేవలం 50 వేల మంది కార్మికుల సమస్య కాదని యావత్ తెలంగాణ ప్రజల సమస్యని తెలిపారు. టీఆర్ఎస్ మెడలు వంచే సత్తా కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. మలిదశ ఉద్యమం లాగా తుదిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలకు బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఆర్టీసీ అందోళనలో బీజేపీ నేతలు పాల్గొంటారు
-
మూడు ఎంపీ స్థానాలే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాలు సాధించాలన్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశంతో రాష్ట్ర నేతలు రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఒకే పార్లమెంటు స్థానంలో తృప్తిపడ్డ కమలనాథులు ఈసారి కనీసం మూడు సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది తొమ్మిది వరకు చేరుకునేలా చేయాలన్న లక్ష్యం ముందుంచటంతో రాష్ట్ర నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జనచైతన్య యాత్రల పేరుతో నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులో తొలివిడత కార్యక్రమాలు ఈనెల 23 నుంచి జూలై 6 వరకు కొనసాగనున్నాయి. నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ నీతిమంతమైన పాలన, దేశ పురోగతి ఒకవైపు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో కుంభకోణా లు, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల అవినీతి పాలనను బేరీజు వేసుకుని ఇక్కడా బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరటమే లక్ష్యం గా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. 23న తొలిరోజు కార్యక్రమం భువనగిరిలో ఉంటుందని అందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ పాల్గొంటారని, అక్కడే రాత్రిబస చేసి మరుసటి రోజు నల్లగొండ, చౌటుప్పల్‌లలో పర్యటిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. 26న వనపర్తిలో మరో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ పాల్గొంటారని తెలిపారు. -
రేవంత్‌తో బీజేపీ చర్చలు నిజమేనా?
-
రేవంత్‌తో బీజేపీ చర్చలు నిజమేనా?
సాక్షి హైదరాబాద్ : ‘రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు.....’ మొన్నటిదాకా అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ముచ్చట. కానీ, ఆ ప్రచారానికి భిన్నంగా రేవంత్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారని, మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. అయితే, మొదట ప్రచారం జరిగినట్లు రేవంత్.. బీజేపీ వైపు మొగ్గుచూపారా? ఆ మేరకు ఎవరితోనైనా చర్చలు జరిపారా? అనే సందేహాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. బేషరతుగా వస్తేనే.. : రేవంత్‌రెడ్డితో తెలంగాణ బీజేపీ శాఖ ఎప్పుడు, ఎలాంటి చర్చలూ జరపలేదని లక్ష్మణ్ తేల్చిచెప్పారు. బేషరతుగా ఎవరు వచ్చినా బీజేపీలోకి చేర్చుకుంటామని అన్నారు. కాగా, కాంగ్రెస్‌లోకి రేవంత్ చేరికపై లక్ష్మణ్ ఒకింత అసహనాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్‌లో చేరడమంటే అర్థమేంటి? : కాంగ్రెస్ పార్టీని మునిగిపోతోన్న నావగా అభివర్ణించిన లక్ష్మణ్.. ఆ పార్టీలో ఎవరైనా చేరడమంటే అవినీతితో జట్టు కట్టడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్- కాంగ్రెస్ దొందూదొందే : అవినీతి, కుటుంబపాలన, వంశపారంపర్యం.. ఇన్ని జాఢ్యలు కలిగిన పార్టీలుగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు దొందూదొందేనని బీజేపీ లక్ష్మణ్ అన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. -
‘టీఆర్ఎస్ భవన్‌కు టులెట్ బోర్డు’
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినాయకత్వానికి అధికార వ్యామోహం తప్ప మరే ఇతర పట్టింపులు లేవని, అందుకే పార్టీలోని కిందిస్థాయి నేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. తాండూరు టీఆర్ఎస్ నాయకుడు అయూబ్ ఖాన్ ఆత్మహత్య నేపథ్యంలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మరో ఆరు మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూలిపోతుంది. అధికార పార్టీది కూడా అదే పరిస్థితి. త్వరలోనే టీఆర్ఎస్ భవన్‌కు టులెట్ బోర్డు పెట్టే పరిస్థితి రానుంది’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ ఒక్కటేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గతంలో అవినీతికి పాల్పడిన వాళ్లు గులాబీ పార్టీలో చేరగానే పవిత్రులయ్యారా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి రాకుండా పాలన సాగించడం దారుణమని మండిపడ్డారు. (టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి)