‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’ | TS BJP chief K.Laxman slams TRS and Congress | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

Published Fri, Sep 22 2017 6:50 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి అధికార వ్యామోహం తప్ప మరే ఇతర పట్టింపులు లేవని, అందుకే పార్టీలోని కిందిస్థాయి నేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు. తాండూరు టీఆర్‌ఎస్‌ నాయకుడు అయూబ్‌ ఖాన్ ఆత్మహత్య నేపథ్యంలో లక్ష్మణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మరో ఆరు మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా కూలిపోతుంది. అధికార పార్టీది కూడా అదే పరిస్థితి. త్వరలోనే టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు పెట్టే పరిస్థితి రానుంది’’ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. గతంలో అవినీతికి పాల్పడిన వాళ్లు గులాబీ పార్టీలో చేరగానే పవిత్రులయ్యారా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయానికి రాకుండా పాలన సాగించడం దారుణమని మండిపడ్డారు.

(టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement