Ayub Khan
-
పశుసంవర్ధక శాఖ సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన విషయాన్ని దాచి సచివాలయంలో విధులకు హాజరయ్యారన్న ఆరోపణలపై పశుసంవర్ధక శాఖ సెక్షన్ అధికారి ఆయూబ్‌ఖాన్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆ శాఖ ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయూబ్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా లేదని తేలింది. ప్రస్తుతం ఆయన నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్లో ఉన్నారు. -
టీఆర్ఎస్ నేత అయూబ్‌ఖాన్ మృతి
తాండూరు: నామినే టెడ్ పదవులు దక్క డంలేదని మనస్తా పంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీఆర్ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు గుర్తింపు లేదని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఖాన్ ఆగస్టు 30న మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం విదితమే. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన.. 24 రోజుల అనంతరం గురు వారం అర్ధరాత్రి తుదిశ్వాస వదిలాడు. ఖాన్ భౌతికకాయాన్ని శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆయన కూతుళ్ల పెళ్లికి, కుటుంబ పోషణకు గాను టీఆర్ఎస్ తరఫున రూ.10 లక్షలు, తాను రూ.20లక్షలు సాయం అందిస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఒక కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
‘టీఆర్ఎస్ భవన్‌కు టులెట్ బోర్డు’
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినాయకత్వానికి అధికార వ్యామోహం తప్ప మరే ఇతర పట్టింపులు లేవని, అందుకే పార్టీలోని కిందిస్థాయి నేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. తాండూరు టీఆర్ఎస్ నాయకుడు అయూబ్ ఖాన్ ఆత్మహత్య నేపథ్యంలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మరో ఆరు మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూలిపోతుంది. అధికార పార్టీది కూడా అదే పరిస్థితి. త్వరలోనే టీఆర్ఎస్ భవన్‌కు టులెట్ బోర్డు పెట్టే పరిస్థితి రానుంది’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ ఒక్కటేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గతంలో అవినీతికి పాల్పడిన వాళ్లు గులాబీ పార్టీలో చేరగానే పవిత్రులయ్యారా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి రాకుండా పాలన సాగించడం దారుణమని మండిపడ్డారు. (టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి) -
టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి
-
టీఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల మంత్రి సమక్షంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత చికిత్స పొందుతూ మృతిచెందారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయారు. ఉద్యమ కారులకు టీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఆగస్టు 30న వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన పార్టీ మీటింగ్‌లో అయూబ్ ఖాన్ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో ఆయన తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. కాలిన గాయాలు తీవ్రతరం కావడంతో అపోలో ఆస్పత్రిలో గతకొన్ని రోజులుగా చికిత్స పొంతుదున్న ఆయూబ్ మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని తన సంతాపం ప్రకటించారు. మృతిచెందిన నేత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంబంధిత కథనం పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నారు -
మూడు రోజులు గడిస్తేనే..
టీఆర్ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు తాండూరు: ఆత్మహత్యాయత్నా నికి పాల్పడిన టీఆర్ఎస్ నేత అయూబ్‌ఖాన్ పరిస్థితి మూడు రోజులు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. బుధ వారం వికారాబాద్ జిల్లా తాండూ రులో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నేత అయూబ్‌ఖాన్ మంత్రి మహేందర్‌రెడ్డి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయూబ్‌ఖాన్‌ను గురువారం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి పరామర్శించారు. -
మామ చేతిలో అల్లుడి హతం
హైదరాబాద్ : యాకుత్‌పురా తన వద్ద పని చేస్తూ కూతురిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన ఓ వ్యక్తి కొడుకు, బావమరిదితో కలిసి అల్లుడిని దారుణంగా హత్య చేశసిన సంఘటన శుక్రవారం రాత్రి భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అదనపు ఇన్స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన షేక్ ఫిరోజ్ ఆలియాస్ షేక్ సల్మాన్(22) తలాబ్‌కట్టా ఆమన్‌నగర్–బిలో నివాసముంటున్నాడు. గతంలో అతను తలాబ్‌కట్టా నషేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయూబ్‌ఖాన్ వద్ద ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో అతని కుమార్తె నేహా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ వద్ద పని చేస్తూ తన కూతురునే వివాహం చేసుకున్నందుకు ఆయూబ్ ఖాన్ ఫిరోజ్‌పై కోపం పెంచుకున్నాడు. గత నెల 6న ఫిరోజ్, నేహా బేగం కుమార్తె తొట్టెల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్, ఫిరోజ్‌ల మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయూబ్ ఖాన్న్అల్లుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు పథకం పన్నిన ఆయూబ్ శుక్రవారం రాత్రి తన కుమారుడు ఇమ్రాన్, బావమరిదితో కలిసి ఫిరోజ్ ఇంటికి వచ్చి అతడిని బయటికి పిలిచి కత్తులతో దాడి చేసి గొంతు కోశారు. తీవ్రంగా గాయపడిన ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఫిరోజ్‌పై గతంలో వనస్థలిపురం, చైతన్యపురి, అఫ్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఆసీఫ్‌నగర్ జిర్రా ప్రాంతంలో ఉన్న ఫిరోజ్ మూడు నెలల క్రితం తలాబ్‌కట్టా ఆమన్‌నగర్–బికి మకాం మార్చాడు. మామ ఆయూబ్ ఖాన్‌పై గతంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలిస్తున్నారు. -
పాస్‌పోర్ట్ పాపం ఎవరిది..!
సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘకాలం తర్వాత 2008లో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్నాడు... అప్పటికే న్యాయవాది మన్నర్ ఘోరీ హత్య కేసులో అతడికి శిక్ష సైతం పడింది... 2010 జులైలో ములాఖత్‌లో అతడిని కలిసిన భార్య హఫీజ్‌బేగం తనకు, పిల్లలకు పాస్‌పోర్టులు జారీ అయినట్లు చెప్పింది... బెయిల్‌పై వచ్చిన వెంటనే కుటుంబంతో సహా దేశం దాటి వెళ్ళిపోవాలని కుట్రపన్నిన అయూబ్‌ఖాన్ బోగస్ వివరాలతో పాస్‌పోర్ట్ పొందడానికి పథకరచన చేశాడు... భార్య, బంధువుల సహకారంతో ‘అన్నీ ఏర్పాటు కావడంతో’ జైల్లో ఉండగానే అతడికి పాస్‌పోర్ట్ వచ్చేసింది... 2014 ఏప్రిల్ 11న బయటకు వచ్చిన అయూబ్‌ఖాన్ దీని ఆధారంగా దుబాయ్ పారిపోయాడు. పోలీసు, పాస్‌పోర్ట్, పోస్టల్ శాఖలతో ముడిపడి ఉన్న ఈ పాస్‌పోర్ట్ ఎపిసోడ్లో అసలు విలన్లు ఎవరనేది మిస్టరీగా మారింది. ఈ కేసుకు సంబందించి దక్షిణ మండల పోలీసులు మంగళవారం న్యాయవాది సహా నలుగురిని అరెస్టు చేశారు. చిరునామాతో పాటు తండ్రి పేరు ‘మార్చేశాడు’... అయూబ్‌ఖాన్ నివాసం వాస్తవానికి పాతబస్తీలోని కుమ్మరివాడిలో ఉంది. అయితే నేరచరితుడైన, ఓ కేసులో శిక్షపడిన అయూబ్ తన వ్యవహారాలు వెలుగులోకి రాకూడదనే ఉద్దేశంతో తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం తన చిరునామాను గోల్కొండ ఠాణా పరిధిలోని టోలిచౌకి బడా బజార్‌గా పేర్కొంటూ దళారుల సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. ఇందులో తన పేరును అయూబ్ఖాన్గానే పేర్కొన్నప్పటికీ తండ్రి పేరును జహంగీర్ ఖాన్‌కు బదులుగా షంషుద్దీన్ఖాన్గా రాయించాడు. అయూబ్ జైల్లో ఉండే తన భార్య హఫీజ్‌బేగం సహకారంతో బయటి కథ నడిపాడు. ఇలా మొత్తం మూడు నకిలీ «ధ్రువీకరణపత్రాలు సృష్టించిన ‘అయూబ్ అండ్ కో’ వీటి ఆధారంగా తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో 2010లో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారంలో అయూబ్ఖాన్న్ భార్యతో పాటు ఖలీల్, ఖాజీ సయ్యద్ ముక్తాధీర్ అలీ ఖాద్రీ, డిప్యూటీ ఖాజీ మహ్మద్ నసీరుద్దీన్, నోటరీ అడ్వొకేట్ పొట్టెం రవీందర్నాథ్లతో పాటు పాస్‌పోర్టు కార్యాలయం అధికారి వెంకట్, మహ్మద్ జాఫర్ పాత్రధారులుగా ఉన్నారు. మిస్టరీలు ఎన్నో... నిబంధనల ప్రకారం తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ఏవైనా మూడు ధ్రువీకరణలతో పాటు కచ్చితంగా వెరిఫికేషన్ సర్టిఫికెట్ జత చేయాల్సిందే. ఐఏఎస్, ఐపీఎస్ సహా ఏదైనా ఆలిండియా సర్వీసుకు చెందిన అధికారి దీన్ని జారీ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తి స్వయంగా పాస్‌పోర్ట్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో అయూబ్‌ఖాన్ చర్లపల్లి ఖైదీగా ఉండటంతో రెండు అంశాలు అంతుచిక్కట్లేదు. తత్కాల్ విధానంలో పాస్‌పోర్ట్ జారీ అయిన తర్వాత పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఏదైనా తేడాలు తెలిస్తే తక్షణం పాస్‌పోర్ట్ కార్యాలయం జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను బ్లాక్‌లిస్ట్ చేస్తూ రద్దు చేస్తుంది. తాము రెండుసార్లు వెరిఫై చేసి నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చామని పోలీసులు పేర్కొంటుండగా మరి తేడా ఎక్కడ జరిగిందనేది అంతు చిక్కట్లేదు. ‘అడ్రస్’ లేకున్నా డెలివరీ... ఈ ‘అవాంతరాలను’ అధిగమించిన అయూబ్‌ఖాన్ పాస్‌పోర్ట్ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి జారీ అయిపోయింది. సాధారణంగా పాస్‌పోర్ట్స్‌ను దరఖాస్తులో ఉన్న చిరునామాకు పంపిస్తారు. దీన్ని పోస్టల్ అధికారులు కచ్చితంగా అదే చిరునామాలో, పాస్‌పోర్ట్ ఎవరి పేరున జారీ అయితే వారికే అందించాల్సి ఉంటుంది. అయూబ్‌ఖాన్ కారాగారవాసం చేస్తున్నా... పాస్‌పోర్ట్ బోగస్ చిరునామాలో డెలివరీ అయింది. ఇందులో పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం/పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాస్‌పోర్ట్ కార్యాలయంలో గ్రాంటిగ్ అధికారిగా పని చేస్తున్న వెంకట్ సహాయసహకారాల అందించడంతో అయూబ్‌ఖాన్ పాస్‌పోర్ట్ బయటకు వచ్చిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. మరోపక్క దుబాయ్ కేంద్రంగా అయూబ్‌ఖాన్ మరో వ్యక్తితో కలిసి భారీగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అయూబ్‌ఖాన్ ఆస్తుల పైనా కన్నేసిన దక్షిణ మండల అధికారులు వాటి వివరాలూ దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాంగ్‌స్టర్ అయూబ్ పై 72 కేసులు
-
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ పట్టివేత
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న రౌడీషీటర్ అయూబ్ ఖాన్ ఆదివారం ముంబైలో చిక్కాడు. ఇతడిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయి ఉండటంతో షార్జా నుంచి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి దొరికాడు. విషయం తెలుసుకున్న నగర పోలీసు అధికారులు ఓ ప్రత్యేక బృందాన్ని పంపి అయూబ్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన అయూబ్ ఖాన్ 1990లో హుస్సేనీఆలంలో నేరజీవితాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో 1991లో హుస్సేనీఆలం పోలీసులు హిస్టరీ షీట్ తెరిచారు. అయూబ్ కాలాపత్తర్‌లోని తాడ్‌బండ్‌కు మకాం మార్చడంతో ఈ షీట్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, ఆయుధ చట్టం తదితర ఆరోపణలపై నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో 48 కేసులు నమోదు కావడంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. రెండేళ్ళ క్రితం విశాఖపట్నం నుంచి బోగస్ పాస్‌పోర్ట్ తీసుకున్న అయూబ్ దాని సాయంతో దుబాయ్ పారిపోయాడు. అక్కడ ఉండి నగరంలో వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్ సహా ఇతర దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో నమోదైన కేసులకు సంబంధించి అయూబ్‌పై నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు ఎల్ఓసీ జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపారు. విదేశాల్లో ఉన్న అయూబ్ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా... అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా వాటిలో కోరారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి అయూబ్ నేరుగా ముంబై చేరుకున్నాడు. హైదరాబాద్‌కు వస్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో అక్కడి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. ఎల్ఓసీ జారీ అయిన విషయం గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించాయి. దీనిపై సమాచారం అందుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు అయూబ్‌ను తీసుకురావడానికి ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. ఈ టీమ్ అయూబ్‌ఖాన్‌ను హైదరాబాద్ తీసుకువచ్చింది. విశాఖపట్నంలో మరో పాస్‌పోర్ట్ పొందడంతో ఏవైనా ఉల్లంఘనలకు ఉండి, ఆధారాలు లభిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా కేసు నమోదు చేయించాలని భావిస్తున్నారు. -
మతం ముసుగున మగాధిపత్యం
సామాజిక, నైతిక స్మృతిగా ఇస్లాంను నిర్వచించినప్పుడు దానిది విప్లవాత్మక దృష్టి, ప్రత్యేకించి లైంగిక సమస్యలపై అది ఆ కాలం కంటే చాలా పురోగమించినది. కాల క్రమంలో చట్టంపై మగ గుత్తాధిపత్యం దాని ఉదారవాద స్ఫూర్తిని ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌లోని తిరోగమనవాద మితవాదుల గత చరిత్రను, పెరుగుతున్న వారి ప్రభావాన్ని బట్టి చూస్తే ఈ వ్యాసం అసాధారణ మైనదే. పాకిస్తాన్ సెనేట్ (పార్ల మెంటు ఎగువ సభ) మానవ హక్కుల కమిటీ ఆ దేశంలోని ఇస్లామిక్ భావజాల మండలి (సీఐఐ)ని రద్దు చేయాలని సూచించింది. అర్థ దయార్ద్ర హృదయ నియంత ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ 1962లో తన కొత్త రాజ్యాంగాన్ని రుద్దారు. అప్పుడే ఆయన దేశంలోని చట్టాలన్నీ ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా చేయడానికి తగు మార్గాలను సూచించడానికి సీఐఐను ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థను రద్దు చేయమని కోరడం సాధారణంగా జరిగేదేమీ కాదు. అయితే, భర్తలు ‘‘తప్పు దారి పట్టిన’’ భార్యలపై ‘‘తేలికపాటి’’ హింసను ప్రయోగించడాన్ని అనుమతించాలి, నేరమూ, శిక్షల పరిమా ణాన్ని సహజంగానే భర్తకు వదిలిపెట్టాలి అని సీఐఐ సూచించింది. దీంతో వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిన ట్టుంది. సీఐఐ సూచనలు తప్పనిసరిగా అమలు చేయాల్సినవి కాదనేది నిజమే. కానీ అవి బహిరంగ చర్చను ప్రభావితం చేస్తాయి. అర్థరహితమైన స్త్రీద్వేషం, మహిళల పట్ల అనుమా నపు జబ్బు ప్రపంచవ్యాప్తంగానే పతాక శీర్షికలకు ఎక్కుతు న్నాయి. చాలావరకు అవి అపహాస్యాన్ని వ్యక్తంచేసేవే అయి ఉంటాయి. ఆ అపహాస్యపు ప్రతిస్పందనా తక్కువే. మతాధికార దుర్వినియోగం ఎల్లప్పుడూ సున్నిత వ్యవహరమే. స్వార్థ ప్రయోజనాలు ఎల్లప్పుడూ కపట భక్తి ముసుగును కప్పుకునే ఉంటాయి మరి. అందువలన ఈ అంశానికి సంబంధించిన దృక్కోణం ఉండాల్సిన క్రమం లోనే ఉంది. ఒకటి, ఇస్లామిక్ భావజాల మండలి అనే పేరే తప్పుగా పెట్టినది. సభలోని అన్ని పక్షాలకు ప్రాతినిధ్యం ఉండటం అనేది ఏ ప్రజాస్వామిక మండలికైనా మొట్ట మొదటి ఆవశ్యకత. ఆ లక్షణం లేకున్నా సీఐఐ ఒక మండలి వంటిది ఏదైనా కావచ్చునేమో... అంతేగానీ ఏదేమైనా అది ఇస్లామ్‌కు చెందినది మాత్రం కాదు. 7వ శతాబ్దంలో ఇస్లాంను సామాజిక, నైతిక శిక్షా స్మృతిగా నిర్వచించి నప్పుడు దానిది విప్లవాత్మక దృష్టి, ప్రత్యేకించి లైంగిక సమస్యలపై అది నాటి కాలం కంటే ఎంతో ముందుకు పురోగమించినదిగా ఉండేది. అందువల్లనే అత్యుత్సాహంగా ఇస్లాంలోకి పరివర్తన చెందినవారిలో అత్యధికులు మహిళలే. ఇస్లాం మహిళలకు వారసత్వ హక్కులను, ఒక రూపంలోని మనోవర్తిని ఇచ్చింది. ఆ కాలంలో మరెవరూ ఆ పని చేయలేదు. అయితే కాలక్రమంలో చట్టానికి భాష్యం చెప్పడంపై మగవారి గుత్తాధిపత్యం దాని ఉదారవాద స్ఫూర్తిని ధ్వంసం చేసి, ఆచరణను మగ ఆధిపత్యంగా మార్చింది. ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ఇజ్తిహాద్ అనే భావన ఉంది. దాని ప్రకారం చట్టం మౌలిక ఉద్దేశాన్ని కాపాడటం కోసం మీరు దాన్ని మీ స్వతంత్ర బుద్ధితో వ్యాఖ్యానించవచ్చు. అత్యంత సుపరిచితమైన ఉదాహరణనే తీసుకుందాం. విశ్వాసులు దొంగల చేతులను ఖండించాలని పవిత్ర ఖురాను చెబుతుంది. అయినా సమాజాలు దొంగతనాన్ని అదుపుచేయడానికి మార్గాంతరాలను కనుగొన్నాయి. కాబట్టి ఏ ముస్లిం దేశం లోనూ ఇంకా ఆ శిక్షను అమలు చేయడం లేదు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని నియంత జనరల్ జియా ఉల్ హఖ్ సుదీర్ఘమైన తన పదేళ్ల కిరాతక పాలనలో పాకిస్తాన్లో ఈ శిక్షను పునరుద్ధరించాలని ప్రయ త్నించి, విఫలమయ్యాడు. మారుతున్న పరిస్థితుల వెలు గులో... చట్టంలో ఒక చోట సవరణను చేయగలిగారంటే వెనుకడుగు వేసిన మరెక్కడైనా కూడా ఆ పనిని చేయవచ్చు. ఉదారణకు, సుప్రీంకోర్టు షా బానో కేసులో... ఆమెకు మాజీ భర్త మనోవర్తిగా పడేస్తున్న బిచ్చం కంటే ఎక్కువ తీసుకోడానికి అర్హత ఉన్నదని తీర్పు చెప్పింది. ఆ వృద్ధురాలికి మాజీ భర్త ఇవ్వజూపిన డబ్బు నెలకు సరిప డటం కాదు గదా, ఒక్క పూట భోజనం కొనుక్కోడానికి కూడా చాలనిది. ఆ తర్వాత 1980లలో భారత మితవా దులు ప్రజాభిప్రాయాన్ని ఆ తీర్పునకు విజయవంతంగా తిరోగమన దిశకు మరల్చగలిగారు. తమ భార్యలను, ఇతర మహిళా బంధువులను మనుషులుగా గాక తమ ఆస్తు లైన వస్తువులుగా చూసే... మగాళ్లు లైంగకపరమైన క్రూర త్వంతో ప్రగతిశీలమైన ముస్లిం చట్టాన్ని మహిళలకు వ్యతిరేకంగా ఎలా తిరగరాయగలరనే దానికి ఇది ఒక ఉదా హరణ. అలాంటి ఆలోచనా ధోరణి కుహనా మతవాదపు ముసుగులో దాక్కుంటుంది. పాకిస్తాన్లో ఈ సమస్య ఒక సంక్షోభంగా మారింది. ‘‘అత్యాచారం కేసుల్లో డీఎన్ఏ పరీక్షలను ప్రాథమిక ఆధా రంగా ఆమోదించ రాదనడం, విద్యాలయాల్లో, కార్యాల యాల్లో ఆడామగా కలిసి ఉండటాన్ని నిషేధించే మోడల్ బిల్లు సీఐఏ ఆదేశాల్లో కొన్ని. ఠారెత్తించే మత ధిక్కార చట్టం కింద వచ్చిన ఫిర్యాదుల పరిశీలనలో అతి చురుగ్గా ప్రతి స్పందించే మండలి... ఆ చట్టం కింద తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని శిక్షించే చర్యలను తీసుకోవాలంటూ చేసే విజ్ఞప్తులను తిరస్కరిస్తుంది’’ అని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. పాకిస్తాన్‌లోని పలుకుబడిగల కొన్ని వర్గాల అభి ప్రాయం అలాంటి నిరపేక్ష అధికారాన్నిసవాలు చేయ డానికి సిద్ధంగా ఉండటం ఆశను రేకెత్తించే అంశం. ప్రజలు సీఐఐకి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. మానవ హక్కుల కమిటీ సభ్యులు అందుకు ఒక ఉదాహరణే తప్ప ఒకే ఒక్క ఉదాహరణ కాదు. ఇస్లామిక్ భావజాల మండలి ‘‘మత, సాంస్కృతిక విలువల వక్రభాష్యాల వాయుతరంగాల’’తో ముంచెత్తుతోందంటూ ప్రధాన పాకి స్తానీ ఇంగ్లీషు దినపత్రిక ‘డాన్’ దానిని ఖండించింది. ‘‘మహిళలను ప్రభావితం చేసే చట్టాలు పార్లమెంటు ఏకాభిప్రాయంతోనే జరిగేలా’’ చేయాలని అది శాసన కర్తలకు విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి నిరోధకత్వం పార్లమెం టులో వృద్ధి చెందడం కాదుగదా, మనజాలదనే అంతరార్థం ఈ సూచనలో ఉంది. కపటుల కోసం, మహత్తరమైన మతాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకునే అత్యధమ కపటుల కోసం ఇస్లాం నరకంలో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించి ఉంచింది. వారు ఏ రూపంలో వచ్చినా, ఏ నేపథ్యంలో వారు తమ దుష్టత్వానికి పాల్పడ్డా... ఈ కపటులను ‘‘మిత్రులుగా స్వీకరించరాదు’’, వంచకులుగా, పిరికిపంద లుగా చూడాలి. పాకిస్తాన్ ఈ నయవంచుకుల ముసుగు లను తొలగిస్తుందని ఆశిద్దాం. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
ఇదేం నిబంధన..?
శ్రీశైలంలో షాపుల వేలం ప్రక్రియలో హిందూయేతరులు పాల్గొనకూడదా..! స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లవుతున్నా ఇంకా ఇటువంటి నిబంధనలా? హైదరాబాద్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనడానికి హిందూయేతరులు అనర్హులంటూ టెండర్ నిబంధన రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టెండర్ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. కుల, మత, జాతి, లింగ, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 15ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అవుతున్నా దేవాదాయశాఖ ఇప్పటికీ పౌరుల పట్ల మతేతర వ్యవహారాల్లో మతపరమైన వివక్ష చూపుతుండటం శోచనీయమంది. షాపుల వేలం ప్రక్రియలో హిందూయేతరులకు స్థానం లేకుండా చేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని దేవాదాయశాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2016, జనవరి 1 నుంచి 2018, డిసెంబర్ 31 వరకు శ్రీశైలం దేవస్థానం సమాచార కేంద్రం ఉన్న 1, 2 షాపుల లీజు హక్కుల నిమిత్తం దేవాదాయశాఖ వేలం నోటీసు జారీ చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనేందుకు అనర్హులని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. 1, 2 షాపులను గత 40 ఏళ్లుగా తాము నిర్వహిస్తున్నామని, ప్రతీ వేలంలో అత్యధిక మొత్తాలకు షాపు లీజుల్ని దక్కించుకుంటున్నామని, ఈసారి షాపుల లీజులు పొందేందుకు హిందూయేతరులు అనర్హులంటూ జారీ చేసిన వేలం నోటీసును రద్దు చేయాలంటూ ఆయూబ్ అలీఖాన్, ఎ.ఎం.బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. ఈ ధోరణి అవాంఛనీయమైంది.. పిటిషనర్ల తరఫున ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందూయేతరులకు వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశమివ్వకుండా టెండర్ నిబంధనలను రూపొందించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ వ్యక్తమవని అభ్యంతరాలను ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూయేతరులు వేలం ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులనడంపై విస్మయం వెలిబుచ్చారు. దేవాదాయశాఖ అనుసరిస్తున్న ఈ ధోరణి అవాంఛనీయమైనదిగా తేల్చారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు దేవాదాయశాఖ పనితీరుపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జస్టిస్ నాగార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాథమిక ఆధారాలను బట్టి దేవాదాయశాఖ రూపొందించిన నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. శ్రీశైల దేవస్థాన పరిధిలోని షాపులను మతవిశ్వాసాల ఆధారంగా కేటాయిస్తున్నామని దేవాదాయశాఖ అధికారులే చెప్పట్లేదని, అలాంటప్పుడు హిందూయేతరులను వేలం ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధం విధించడం ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వివరణివ్వాలని దేవాదాయశాఖ అధికారుల్ని ఆదేశించారు. పిటిషనర్ల రెండుషాపుల్ని రూ.9,500, రూ.6,000కు వేలంలో ఇతరులు దక్కించుకున్నారని విద్యాసాగర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ మొత్తాల్ని పిటిషనర్లే చెల్లించి, తమ షాపుల్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చని, అయితే ఈ కొనసాగింపు కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
బంగారం స్మగ్లింగ్‌లో అయూబ్ హస్తం
అనుమానిస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు తరచు బంగారంతో పట్టుబడటం వెనుక గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ హస్తం ఉండొచ్చని దక్షిణ మండలం పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది ఆగస్టులో అయూబ్దుబాయ్ పారిపోవడం.. ఐదారు నెలల నుంచి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద బంగారం దొరుకుతుండటంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే అయూబ్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుకవుట్ నోటీసు జారీ చేశారు. దీంతో ఇంటర్ పోల్ సాయంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయూబ్ నేర చరిత్ర ఇదీ.. ఖైసర్ గ్యాంగ్‌కు పోటీగా గ్యాంగ్‌ను నడుపుతూ పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అయూబ్‌పై ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. మొదట శాలిబండలో నివాసం ఉన్న అయూబ్ అనంతరం కాలాపత్తర్‌కు మకాం మార్చాడు. అయూబ్ అనుచరులైన ఒబేద్, అసద్, వాజిద్‌లపై పోలీసులు ఇప్పటికే పీడీ యాక్ట్‌లు కూడా ప్రయోగించారు.