టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి | TRS leader Ayub khan dies while taking treatment in hyderabad | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి

Published Fri, Sep 22 2017 9:16 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి - Sakshi

టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల మంత్రి సమక్షంలో వంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్‌ఎస్‌ నేత చికిత్స పొందుతూ మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయారు. ఉద్యమ కారులకు టీఆర్‌ఎస్‌ పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఆగస్టు 30న వికారాబాద్‌ జిల్లా తాండూరులో జరిగిన పార్టీ మీటింగ్‌లో అయూబ్‌ ఖాన్‌ వంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు.

దీంతో ఆయన తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. కాలిన గాయాలు తీవ్రతరం కావడంతో అపోలో ఆస్పత్రిలో గతకొన్ని రోజులుగా చికిత్స పొంతుదున్న ఆయూబ్ మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని తన సంతాపం ప్రకటించారు. మృతిచెందిన నేత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత కథనం
పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement