
తాండూరు: నామినే టెడ్ పదవులు దక్క డంలేదని మనస్తా పంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీఆర్‌ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు గుర్తింపు లేదని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు ఖాన్ ఆగస్టు 30న మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం విదితమే. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన.. 24 రోజుల అనంతరం గురు వారం అర్ధరాత్రి తుదిశ్వాస వదిలాడు. ఖాన్ భౌతికకాయాన్ని శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని మహేందర్‌రెడ్డి చెప్పారు.
ఆయన కూతుళ్ల పెళ్లికి, కుటుంబ పోషణకు గాను టీఆర్‌ఎస్ తరఫున రూ.10 లక్షలు, తాను రూ.20లక్షలు సాయం అందిస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఒక కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.