మామ చేతిలో అల్లుడి హతం | Ayub Khan brutally murdered by Mama | Sakshi
Sakshi News home page

మామ చేతిలో అల్లుడి హతం

Published Sun, Apr 2 2017 4:10 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

మామ చేతిలో అల్లుడి హతం

మామ చేతిలో అల్లుడి హతం

హైదరాబాద్ : యాకుత్‌పురా తన వద్ద పని చేస్తూ కూతురిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన ఓ వ్యక్తి కొడుకు, బావమరిదితో కలిసి అల్లుడిని దారుణంగా హత్య చేశసిన సంఘటన శుక్రవారం రాత్రి భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అదనపు ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన షేక్‌ ఫిరోజ్‌ ఆలియాస్‌ షేక్‌ సల్మాన్‌(22)  తలాబ్‌కట్టా ఆమన్‌నగర్‌–బిలో నివాసముంటున్నాడు.

గతంలో అతను తలాబ్‌కట్టా నషేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయూబ్‌ఖాన్‌ వద్ద ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో అతని కుమార్తె నేహా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ వద్ద పని చేస్తూ తన కూతురునే వివాహం చేసుకున్నందుకు ఆయూబ్‌ ఖాన్‌ ఫిరోజ్‌పై కోపం పెంచుకున్నాడు. గత నెల 6న ఫిరోజ్, నేహా బేగం కుమార్తె తొట్టెల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయూబ్‌ ఖాన్, ఫిరోజ్‌ల మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయూబ్‌ ఖాన్‌న్‌అల్లుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు పథకం పన్నిన ఆయూబ్‌ శుక్రవారం రాత్రి తన కుమారుడు ఇమ్రాన్, బావమరిదితో కలిసి ఫిరోజ్‌ ఇంటికి వచ్చి అతడిని బయటికి పిలిచి కత్తులతో దాడి చేసి గొంతు కోశారు. తీవ్రంగా గాయపడిన ఫిరోజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మృతుడు ఫిరోజ్‌పై గతంలో వనస్థలిపురం, చైతన్యపురి, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఆసీఫ్‌నగర్‌ జిర్రా ప్రాంతంలో ఉన్న ఫిరోజ్‌ మూడు నెలల క్రితం తలాబ్‌కట్టా ఆమన్‌నగర్‌–బికి మకాం మార్చాడు. మామ ఆయూబ్‌ ఖాన్‌పై గతంలో రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్య కేసు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement