రేవంత్‌తో బీజేపీ చర్చలు నిజమేనా? | TS BJP president K. Laxman comments on Revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌తో బీజేపీ చర్చలు నిజమేనా?

Published Fri, Oct 20 2017 5:42 PM | Last Updated on Fri, Oct 20 2017 8:10 PM

TS BJP president K. Laxman comments on Revanth reddy

సాక్షి హైదరాబాద్‌ : ‘రేవంత్‌ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు.....’ మొన్నటిదాకా అటు సోషల్‌ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ముచ్చట. కానీ, ఆ ప్రచారానికి భిన్నంగా రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారని, మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. అయితే, మొదట ప్రచారం జరిగినట్లు రేవంత్‌.. బీజేపీ వైపు మొగ్గుచూపారా? ఆ మేరకు ఎవరితోనైనా చర్చలు జరిపారా? అనే సందేహాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు.

బేషరతుగా వస్తేనే.. : రేవంత్‌రెడ్డితో తెలంగాణ బీజేపీ శాఖ ఎప్పుడు, ఎలాంటి చర్చలూ జరపలేదని లక్ష్మణ్‌ తేల్చిచెప్పారు. బేషరతుగా ఎవరు వచ్చినా బీజేపీలోకి చేర్చుకుంటామని అన్నారు. కాగా, కాంగ్రెస్‌లోకి రేవంత్‌ చేరికపై లక్ష్మణ్‌ ఒకింత అసహనాన్ని వెళ్లగక్కారు.

కాంగ్రెస్‌లో చేరడమంటే అర్థమేంటి? : కాంగ్రెస్‌ పార్టీని మునిగిపోతోన్న నావగా అభివర్ణించిన లక్ష్మణ్‌.. ఆ పార్టీలో ఎవరైనా చేరడమంటే అవినీతితో జట్టు కట్టడం లాంటిదేనని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ దొందూదొందే : అవినీతి, కుటుంబపాలన, వంశపారంపర్యం.. ఇన్ని జాఢ్యలు కలిగిన పార్టీలుగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు దొందూదొందేనని బీజేపీ లక్ష్మణ్‌ అన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement