TS BUdget
-
అప్పు.. తప్పు కాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. అప్పులు తీసుకోవడం బడ్జెట్లో భాగమేనని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.82 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. మంగళవారం ఈ మేరకు శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇలాంటి సమయంలో నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి రొడ్డకొట్టుడు ఆరోపణలు చేయటం సరికాదు’అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయడం లేదన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ సభా సంప్రదాయాలను కాపాడాలని అన్నారు. కేంద్రంతోపాటు, 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ట్రాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ‘మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాం. అమెరికా, జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. జపాన్ జీడీపీ కంటే 250% ఎక్కువ అప్పులే ఉన్నాయి. అంత మాత్రాన జపాన్ వాళ్లు తెలివి తక్కువ వాళ్లా? అప్పులు తీసుకోవడం బుద్ధి తక్కువ ఆలోచన కాదు’అని పేర్కొన్నారు. దేశ జీడీపీలో 49.5 శాతం అప్పులే ‘దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు. దేశం అప్పులు రూ.82 లక్షల కోట్లు. అంటే 49.5 శాతం మేర కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ ఏడాది కేంద్రం చెల్లిస్తున్న అప్పులు రూ.8.76 లక్షల కోట్లు. గత మూడేళ్లలో అంటే 2016–2017లో రూ.5,35,618 కోట్లు, 2017–18లో రూ.5,94,849 కోట్లు, 2018–19లో రూ.6,24,276 కోట్ల అప్పులను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన గణాంకాలివి. తెలంగాణ జీఎస్డీపీలో 21 శాతం అప్పులు ఉన్నాయి. ఉదయం పథకం కింద రూ.9 కోట్ల అప్పు వచ్చింది’అని సీఎం వివరించారు. ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పనీ చేయలేదా? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఆసరా పెన్షన్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అని నిలదీశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తోందని సభకు గుర్తు చేశారు. మూడు రోజుల్లో రుణమాఫీ వడ్డీలు చెల్లిస్తాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని, ఇంత గొప్పగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులకు పీఆర్సీని కూడా కచ్చితంగా వెస్తామని, దానికి కొంత సమయం ఉందని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేశామని, ఎక్కడైనా రైతు రుణాల వడ్డీ మాఫీ కాకుండా మిగిలిపోతే.. వారి వివరాలను ఇస్తే మూడు, నాలుగు రోజుల్లో ఆ డబ్బును చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. -
బంగారు గనులేమైనా వచ్చాయా: షబ్బీర్ అలీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. లక్షల కోట్ల బడ్జెట్ ఎలా పెడుతున్నారు. బంగారు గనులు ఏమైనా వచ్చాయా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి వడ్డీ కూడా ప్రభుత్వమే కడతాని చెప్పిందని గుర్తుచేశారు. రణమాఫీ గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. విద్యుత్ సంస్థలు అప్పుల్లో కురుకుపోయాయని, రెండేళ్లకే రూ.12 వేల కోట్ల అప్పులు సంస్థలపై ఉన్నాయన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. రైతులకు ఉచిత విద్యుత్ అని చెప్పి మళ్లీ మీటర్లు ఫిట్ చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. మీటర్లను ఏ ఉద్దేశంతో పెడుతున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. డబుల్ ఇళ్ల నిధుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, మంత్రి సరైన సమాధానం చెప్పాలన్నారు. విద్యారంగం విషయంలో కేజీ టూ పీజీ గురించి చెప్పలేదని, కొత్త యూనివర్సిటీల ఊసే లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి బిల్లు పెట్టినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. -
అంకెల మాయాజాలం
అలవికాని హామీలిచ్చిన పాలకులకు బడ్జెట్లు రూపొందించడం తాడుపై నడక లాంటిది. నిరంతర సాధన వల్లా, లక్ష్యంపై ఏకాగ్రతవల్లా తాడుపై నడిచేవారు కూడా ఆ విన్యాసాన్ని సునాయాసంగా పరిపూర్తి చేయగలుగుతారేమోగానీ... అధి కారాన్నాశించి వెనకా ముందూ చూడకుండా హామీలు గుప్పించినవారికి జనాన్ని మభ్యపెట్టడం తప్ప వేరే మార్గం ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలూ రెండు రోజుల వ్యవధిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లను గమనిస్తే ఈ సంగతి అవగతమవు తుంది. నేల విడిచి సాము చేసిన వైనం కళ్లకు కడుతుంది. రెండు రాష్ట్రాలుగా విడిపో యాక బడ్జెట్లు రావడం ఇది నాలుగోసారి. బడ్జెట్ల నిడివి చూస్తేనే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు అయితే... ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ రూ. 1,56,999 కోట్లు! రెండింటి మొత్తమూ రూ. 3,06,000 కోట్ల పైమాటే. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రం మొత్తం బడ్జెట్ లక్షా 40 వేల కోట్లని గుర్తుంచుకుంటే ఈ స్థాయి లాంగ్ జంప్‌లు ఎలా సాధ్యమని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని అతిగా చూపిస్తే తప్ప ఇది సాధ్య పడదు. వేర్వేరు పద్దులకు భారీ మొత్తాల్లో ఖర్చు చేస్తామన్నప్పుడు దానికి తగినట్టు ఆదాయం కూడా భారీగా చూపక తప్పదు గనుకే ఈ పాట్లు. కనీసం తెలంగాణ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో వనరులున్నాయి. వివిధ పన్నుల ద్వారాగానీ, ఇతరత్రాగానీ వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకోవడంలో అటూ ఇటూగా ఉన్నా ఆక్షేపణ ఉండదు. వేర్వేరు పద్దులకింద ఫలానా మొత్తంలో ఖర్చు చేయబోతున్నామని ఘనంగా చెప్పినా బడాయి కబుర్లనిపించవు. కానీ రాష్ట్రం చాలా ఇబ్బందులెదుర్కొంటున్నదని ఏపీ పాలకులు ఒకపక్క చెబుతూనే రాబడి అంచనాలను భారీగా చూపడం... వివిధ సంక్షేమ పద్దుల కింద దీటుగా ఖర్చుపెట్టబోతున్నట్టు ఊరించడం చిత్రమనిపిస్తుంది. అటు ఆదాయమైనా, ఇటు చేసిన ఖర్చయినా ఎంతో సవరించిన అంచనాలే చెబుతాయి. వాటి ఆధారంగా ఇప్పుడు ఏకరువుపెట్టే బడ్జెట్ కబుర్లలోని నిజానిజాలేమిటో, నిజాయితీ ఎంతో ఎవరైనా అంచనాకు రాగలుగుతారు. రైతు రుణమాఫీ గురించి, ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి గొప్పగా చెప్పే ప్రభుత్వాలు బడ్జెట్లకొచ్చేసరికి తగిన కేటాయిం పులు చేయడంలో విఫలమవుతున్నాయి. రెండు రాష్ట్రాలూ ఈ విషయంలో ఒకేలా ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల కోర్సులు పూర్తయినా కళా శాల యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల్లో గల్లం తవుతున్నాయి. ఈ సమస్యపై రెండు ప్రభుత్వాలకూ శ్రద్ధలేదు. చేసిన కేటాయిం పులు బకాయిలకు కూడా సరిపోవు. బడ్జెట్లో కేటాయింపులను అమితంగా చూపడం, నిధులు ఖర్చు చేయాల్సి వచ్చేసరికి మాత్రం మితంగా ఉండిపోవడం ప్రభుత్వాలకు రివాజైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుడు బీసీల సంక్షేమానికి రూ. 4,430 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 183.74 కోట్లు ఖర్చు చేయలేదు. బీసీ కులాల స్థితిగతులెలా ఉన్నాయో గమనిస్తే కేటాయించిన నిధులే ఏమూలకూ చాలవని అర్ధమవుతుంది. మరి నిధులు మిగిలి పోవడమేమిటి? వాస్తవానికి బీసీ కులాల్లో వేర్వేరు వర్గాలవారికి టీడీపీ మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. ఆయా వృత్తులను ప్రోత్సహించడానికి ఎన్నెన్నో చేస్తామన్నారు. ఆ వర్గాల వారి ఆశలు తీరకుండానే, మేనిఫెస్టో హామీల్లో అధిక భాగం నెరవేరకుండానే నిధులెలా మిగిలిపోతాయి? కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ. 5,013.50 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది గతంతో పోలిస్తే రూ. 583.34 కోట్లు ఎక్కువ. పాత అనుభవాలను చూస్తే ఇప్పుడు చేసిన కేటాయింపులను సంపూర్ణంగా వినియోగిస్తారన్న నమ్మకం కలగదు. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం గురించి చెప్పనవసరమే లేదు. నిరుడు షెడ్యూల్ కులాలకు కేటాయించిన ఉప ప్రణాళిక నిధులు రూ. 8,724.25 కోట్లయితే అందులో రూ. 291.31 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. వాటిని కాస్తా పంచాయతీరాజ్ శాఖకు మళ్లించారు. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులదీ ఇదే కథ. అందులో దాదాపు రూ. 15 కోట్లు మిగిలిపోయాయి. ఖర్చయిన నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరాయనుకోవడానికి లేదు. టీడీపీ కార్యకర్తలకూ, వారు చెప్పిన వారికీ మాత్రమే అందులో అధిక భాగం అందాయని క్షేత్రస్థాయి వాస్తవాలు చెబు తున్నాయి. షెడ్యూల్ కులాల సంక్షేమానికి నిరుడు చేసిన కేటాయింపుల్లో రూ. 491.77 కోట్లు ఖర్చే చేయలేదు. ఎస్టీ సంక్షేమానికి నిరుడు చేసిన కేటాయింపుల్లో కూడా రూ. 149.3 కోట్లు ఖర్చు కాలేదు. పరిస్థితి ఇదైతే ఈసారి బడ్జెట్లోని కేటా యింపులన్నీ ఖచ్చితంగా ఖర్చు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెలకు రూ. 2,000 నిరుద్యోగ భృతి గురించి ఇన్నాళ్లుగా ఒక్క మాటా మాట్లాడని సర్కారు ఈసారి యువతకు రూ. 500 కోట్లు కేటాయించామంటున్నది. కానీ దాన్ని ఏ పేరిట, ఎలా వెచ్చిస్తారన్న వివరణ లేదు. సాగునీటి వ్యయం వరకూ... తెలంగాణ సర్కారు నిరుడు రూ. 25,000 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 14,918.19 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. ఆంధ్రప్రదేశ్ నిరుడు రూ. సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు రూ. 8,199.70 కోట్లు. ఈసారి రూ. 12,770.26 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో చెప్పింది. వాస్తవానికి అది ఏమూలకూ చాలదు. రూ. 80,000 కోట్లకుపైగా నిధులు అవసరమని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వ్యవసాయం ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదో అందరికీ తెలుసు. అయినా ఆ రంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అమలు అంతంతమాత్రం. అమల్లోకి రాబోతున్న జీఎస్టీ వల్ల, వనరుల సమర్ధ వినియోగం ద్వారా ఆదాయాన్ని ఇతోధికంగా పెంచుకోగలమన్న విశ్వాసం రెండు రాష్ట్రాలకూ ఉండటం మంచిదే అయినా ఇతరత్రా రంగాలకు సంబంధించి తగిన కార్యాచరణ అవసరం. వృద్ధి రేటు కృత్రిమంగా పెంచి చూపి అంతా బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడంవల్ల ప్రయోజనం శూన్యం. -
పల్లెతల్లి కన్నీళ్లు తుడిచే బడ్జెట్
► ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మందమర్రి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ పల్లెతల్లి కన్నీళ్లు తుడిచేవిధంగా ఉందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అర్థంకాని అంకెలతో గందరగోళంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటే అభివృద్ధి చేసుకునే అవకాశం మనకే ఉంటుందని ఈ బడ్జెట్ నిరూపించిందన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారని పేర్కొన్నారు. యాదవులకు కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు 75 శాతం సబ్సిడీపై అందజేత, గంగపుత్రులు, ముదిరాజ్‌లకు చేపపిల్లల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక సహాయం రూ.51వేల నుంచి రూ.71వేలకు పెంపు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్, రూ.12వేల ఆర్థిక లబ్ధి వంటి సంక్షేమ పథకాలు హర్షణీయమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సుదర్శన్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు అవుతది!
ఆర్థికంగా మన రాష్ట్రం పటిష్టంగా ఉంది అప్పులడిగితే బ్యాంకులు క్యూ కడుతున్నయ్ మర్కూక్ మండల ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ గజ్వేల్: ‘‘కొట్లాడి తెలంగాణ సాధించుకున్నం.. మనం అదృష్టవంతులం.. ఊహించిన దానికంటే మన రాష్ట్రం ఆర్థికంగా బాగుంది.. మనం అప్పు అడిగితే కమర్షియల్ బ్యాంకులు క్యూ కడుతున్నయ్.. మిషన్ భగీరథ కోసం అప్పు అడిగితే 20 రోజుల్లో రూ. 20 వేల కోట్లు ఇచ్చిండ్రు. ఆర్థిక నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి 2024 నాటికి మన బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరుకోబోతుంది’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మర్కూక్ మండల కేంద్రాన్ని కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మంచినీళ్లు, సాగునీటి రంగం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు పూర్తయ్యాక.. నిధులన్నీ పేదరిక నిర్మూలనకు వినియోగిస్తామన్నారు. ఈ మధ్యకాలంలో గవర్నర్ నరసింహన్ తో కలిసిన సందర్భంలో.. ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటారు..? అంటూ ప్రశ్నించగా.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అవసరమైన సూక్ష్మస్థారుు ప్రణాళికను.. కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలు చేస్తామని చెప్పగా.. గవర్నర్ తనకు ఆశీర్వాదాన్ని అందజేశారన్నారు. కరెంటును మరో గంట పెంచుతం... ‘ఇప్పుడు వానలు గట్టిగ పడ్డయ్. ఇక చాలు తల్లీ అనేదాక వానలు పడ్డయ్. గిప్పుడు రెం డోది బలమైన పంట పండించుకోవాలె.. 9 గంటల కరెంటును అవసరమైతే మరో గంట పెంచుతం’ అని సీఎం అన్నారు. ‘మర్కూక్ పక్కన 10 లేదా 20 టీఎంసీల కొండపోచమ్మ రిజర్వాయర్ రాబోతుంది. దీని ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందించబోతున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరాలి.. ‘కొత్త జిల్లాలు తమాషా కోసం కాదు... ఈ రోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా దానివెంట పైరవీకారులు పుట్టుకొస్తుండ్రు. చిట్టచివరి రూపాయి... చిట్ట చివరి లబ్ధిదారుని వరకు చేరాలి. ఇదే ఈ కొత్త జిల్లాల లక్ష్యం. ఒక్కో జిల్లాలో 2 లక్షల నుంచి మొదలుకుని 4 లక్షల కుటుంబాలు మాత్రమే ఉండాలె. అలా ఉన్నప్పుడు ప్రతి కుటుంబం స్థితిగతులు ప్రభుత్వానికి తెలిసే అవకాశముంది. ఈ కుటుంబాల లెక్కలన్నీ కలెక్టర్ వద్ద ఉంటారుు’ అని సీఎం తెలిపారు. కేసీఆర్ ఎరవ్రల్లి మీద ఏ రకంగా ప్రేమ, వాత్సల్యం చూపుతున్నారో.. అదే రకమైన దయ తమ గ్రామంపై చూపాలని సరస్వతీ ఉపాసకులు, మర్కూక్ గ్రామ వాస్తవ్యులు దైవజ్ఞశర్మ కోరారు. దీనిపై స్పందించిన సీఎం... దైవజ్ఞశర్మ చాలా హుషారున్నరు.. ఆయన విజ్ఞప్తి మేరకు మండల కేంద్రానికి ఒప్పుకున్నా.. ఇప్పుడు మళ్లా మీ గ్రామాన్ని ఎర్రవల్లి లెక్క జేయమంటుండ్రు.. అంటూ చమత్కరించారు. మర్కూక్‌లో ప్రారంభోత్సవాలు.. మర్కూక్‌లో తహసీల్దార్, పోలీస్ స్టేషన్, మం డల పరిషత్ కార్యాలయాలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, సలీంపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేనూ ఇక్కడి బిడ్డనే.. ‘నేనూ ఇక్కడి బిడ్డనే. తెలంగాణ కష్టాల్లో ఉంది.. నువ్వు బయటకు వెళ్లి తీరాలంటూ సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి పంపించిండ్రు.. వారిచ్చిన ఆశీర్వాదంతో 14 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడిన.. చివరకు తెలంగాణ సాధించినం. తెలంగాణ వచ్చినందునే మన చేతుల్లో శక్తి ఉంది. ఇవాళ మర్కూక్‌ను మండలం చేసుకోగలిగినం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నేనూ ఇకనుంచి ఈ మండల పరిధిలోకే వస్తున్నా.. ముఖ్యమంత్రి మండలం మంచిగా ఉండాలె. నీ మండలమే సక్కగ లేదు.. నువ్వు మాకేం జేస్తవ్.. అని ప్రశ్నించే పరిస్థితి రావొద్దు. మర్కూక్‌ను సైతం బంగారు మండల కేంద్రంగా తీర్చిదిద్దుతా.. ఇక్కడ మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నా. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఈ గ్రామంలో పాదయాత్ర చేసి ఇక్కడ కల్పించాల్సిన వసతులపై సర్వే జరుపుతారు. దీన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుందాం’ అని కేసీఆర్ అన్నారు.