టీఎస్ ఎంసెట్ కోడ్ విడుదల
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఎంసెట్ కోడ్ జె-1ను ఆయన విడుదల చేశారు.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 41వేల 163 మంది హాజరుకానున్నారని తెలిపారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రి, ఫార్మసీ, వెటర్నరీ పరీక్షకు సుమారు 80వేల మంది హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రి, ఫార్మాకు 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కనిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, హాల్‌టికెట్‌తోపాటు అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకుని వెంట తెచ్చుకోవాలని, పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని పాపిరెడ్డి సూచించారు.