TS LAWCET Results
-
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాసెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ రిజల్ట్స్‌ను గురువారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ న్యాయ కళాశాలల్లోని మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీ ఎల్ఎల్ఎం కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 25వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. 43,692 మంది దరఖాస్తు చేసుకోగా 36,218 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ☛ TS LAWCET-2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే.. -
రేపు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల
వరంగల్ : మూడేళ్ల ఎల్ఎల్బీ , ఐదేళ్ల లా, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో గతనెల 19వ తేదీన నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ సెట్ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విడుదల చేయనున్నారని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా లాసెట్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం.