10 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : మార్చి 10వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతపై మంగళవారం హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదన చారి మాట్లాడుతూ... స్పీకర్ గ్యాలరీ పాస్‌లకు బార్ కోడింగ్... పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ఎమ్మెల్యేల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పారు. అలాగే ఈ నెల 10న గవర్నర్ ప్రసంగం, టీఎస్ బడ్జెట్ ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు మధుసూదనా చారి సూచించారు.