TSFCC President
-
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
‘‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నవారికి కృతజ్ఞతలు. గత ఏడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ అసోసియేషన్‌కి పూర్తి సమయం కేటాయించలేకపోయాను.. ఈ ఏడాది కచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ‘తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి’ పాలక మండలిని శనివారం ప్రకటించారు. ‘టీఎస్ఎఫ్సీసీ’ అధ్యక్షునిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వీఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె. అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్‌గా చంద్ర శేఖర్ రావు ఎన్నికయ్యారు. అలాగే 15 మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ–‘‘టీఎస్ఎఫ్సీసీ’ పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అందరూ చిత్ర పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి’’ అన్నారు. ఇంకా నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. -
టీఎస్ఎఫ్సీసీ అధ్యక్షుడిగా కె. మురళీమోహన్
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) నూతన అధ్యక్షుడిగా కె. మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా వీయల్ మల్లి ఖార్జున్ గౌడ్, వీయల్ శ్రీధర్, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద రాజ్ తాడ్లలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా సునీల్ నారంగ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా, కోశాధికారిగా ఏజే ఇన్నారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులుగా జె. చంద్రశేఖర్‌రావు, వి. నాగేశ్వరరావు, పి. శ్రీనివాసరావు (వాసు), ఎమ్. మోహన్‌కుమార్, దిలీప్‌కుమార్ టాండన్, ఎ. సుధాకర్‌రెడ్డి, జి. శ్రీనివాస్, పి. సుబ్రమణ్యం, జివీవీ ప్రసాద్‌రావు, పి. అశోక్ రావు ఎన్నికయ్యారు. ‘‘టీఎస్ఎఫ్సీసీ తరపున చిన్న సినిమాలకు తోడ్పాటు అందిస్తామని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటు పడతాం’’ అన్నారు కె. మురళీ మోహన్, సునీల్ నారంగ్. రెండేళ్ల పాటు నూతన కమిటీ కొనసాగుతుంది.