TSP
-
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతి...జీతానికి కోతే గతి
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో పనిచేస్తూ సివిల్ కానిస్టేబుల్, ఎస్సైలుగా ఎంపికైన వారికి కొత్తగా వేతన కష్టాలు చుట్టుముట్టాయి. పదోన్నతి దక్కినందుకు సంబరపడాలో వేతనం తగ్గుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎస్పీఆర్బీ) ఆధ్వర్యంలో ఒకేసారి దాదాపు 18 వేల పోస్టుల ఫలితాలు ప్రకటించింది. వీరిలో 1,200 మంది ఎస్సైలకు శిక్షణ ప్రారంభమైంది. త్వరలోనే 16 వేల మందికి పైగా కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది. అయితే సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్సైలకు ఎంపికైన కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల టీఎస్ఎస్పీఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో ఆర్మ్డ్ రిజర్వుడు (ఏఆర్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) బలగాల్లో పనిచేసే కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరిలో 2016 అంతకుముందు ఎంపికైనవారున్నారు. ఆ లెక్కన వీరందరి జీతం రూ.30 వేలకు కాస్తా అటుఇటుగా ఉంది. పాత కొలువులకు రాజీనామా చేసి.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో దాదాపు 1,500 మంది ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా ఎంపికయ్యారు. వీరంతా సివిల్‌కు రావాలంటే వీరంతా తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి, సంబంధిత విభాగం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకురావాలి. అప్పుడు వీరంతా తిరిగి కానిస్టేబుల్, ఎస్సై శిక్షణకు వెళతారు. శిక్షణకాలంలో వీరందరినీ ట్రైనీ కేడెట్లుగానే పరిగణిస్తారు. ఆ సమయంలో నెలకు రూ.9,000 స్టైపెండ్ కింద ఇస్తారు. వీరిలో చాలామంది వివాహితులు. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. శిక్షణకాలంలో ఇంత తక్కువ వేతనంతో ఎలా మనగలగాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఎస్సైకి ఎంపికైన అభ్యర్థులు ర్యాంకు పెరిగింది కాబట్టి.. ఎలాగోలా సర్దుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ, సివిల్‌కానిస్టేబుల్‌కు ఎంపికైన ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు మాత్రం కుటుంబపోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. తామందరం ఇప్పటికే శిక్షణ తీసుకుని, కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న కారణంగా తిరిగి 9 నెలల సుదీర్ఘ శిక్షణ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016లో నూ ఇలాంటి సమస్యే ఎదురైనపుడు ఏఆర్, టీఎస్ఎస్పీ, కానిస్టేబుళ్లకు కేవలం 3 నెలల తరగతులు బోధించి వెంటనే సివిల్ కానిస్టేబుళ్లుగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. తమకు తిరిగి అదే వెసులుబాటు కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పలువురు కానిస్టేబుళ్లు డీజీపీ కార్యాలయానికి వస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. -
టీఎస్‌పీఈసెట్-2015 లో మార్పులు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2015 (టీఎస్‌పీఈసెట్-2015) నిర్వహణకు గతంలో ప్రకటించిన తేదీల్లో మార్పులు చేశారు. వివిధ కారణాల వల్ల ఈ నెల 20 నుంచి జరగాల్సిన ఫిజికల్ పరీక్షలు 25 నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభాకర్‌రావు తెలిపారు. హాల్‌టిక్కెట్లను ఈ నెల 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తెలంగాణలో 1700 సీట్లకు ఇంత వరకు 9 వేల దరఖాస్తులు అందినట్లు చెప్పారు. డిగ్రీ అర్హతతో బీపీఈడీ కోర్సు, ఇంటర్ అర్హతతో యూజీ డీపీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హులు. అపరాధ రుసుముతో ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
సబ్‌ప్లాన్ నిధుల ఖర్చుకు ప్లాన్!
నీటి పారుదల శాఖ పరిధిలోని టీఎస్పీ నిధుల ఖర్చుకు కసరత్తు మోడికుంటవాగు, కొమరంభీం, చెల్మలవాగు అభివృద్ధికి నిర్ణయం హైదరాబాద్: సాగునీటి రంగ బడ్జెట్లో గిరిజన తెగల ఉప ప్రణాళిక(టీఎస్పీ)కు కేటాయించిన నిధుల వినియోగించుకోవడంపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. సుమారు రూ.230 కోట్ల నిధులతో ఆయా ప్రాజెక్టుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తోంది. గిరిజన తెగల ఆయకట్టుదారులకు సాగునీటి సదుపాయాలను కల్పించడానికి 2013లో టీఎస్పీ చట్టాన్ని తెచ్చారు. ఈమేరకు చిన్నతరహా సాగునీటి బడ్జెట్ మొత్తంలో కనీసం 6.6 శాతం రాష్ట్ర ప్రణాళికా వ్యయం టీఎస్పీకి కేటాయించాలి. ఈ నిధులను అదే ఆర్థిక సంవత్సరంలో ప్రతి పాదించిన కొత్త పథకాలకు, కొనసాగుతున్న పథకాలకు నోడల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్ర మండలి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నిధులతో పునరుద్ధరణ, మరమ్మతులు, కొత్త చెరువుల నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద సుమారు 40 శాతం మంది గిరిజనులు ఉంటేనే టీఎస్పీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. 2014-15లో కేటాయించిన అంచనా బడ్జెట్ రూ.368.56 కోట్లు కాగా, ఇందులో మార్చి వరకు వ్యయం చేసింది కేవలం 18.66 కోట్లు మాత్రమే. ఈ ఏడాది భారీ అంచనాలు ఈ ఏడాది బడ్జెట్లో టీఎస్పీ కింద అంచనా వేసిన రూ.230 కోట్ల నిధులను గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, చెల్మల వాగు, ఖమ్మం జిల్లాలోని మోడికుంటవాగుల కింద పనులకు వెచ్చించాలని నిర్ణయించారు. 45 వేల ఎకరాల ఆయకట్టున్న కొమరం భీం ప్రాజెక్టు కింద కాల్వల మరమ్మతులు, చిన్న నీటి వనరుల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 13 వేల ఎకరాలున్న మోడికుంటవాగు కింద 3 టీఎంసీల మేర నీటిని వినియోగించుకొని 12 వేల జనాభాకు తాగునీటిని అందించే అవకాశం సైతం ఉంది. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా 125 కోట్లు అవసరం కాగా 65 కోట్ల మేర వ్యయం చేశారు. చెల్మల వాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.20 కోట్ల మేర ఖర్చు కానుండగా, టీఎస్పీ నిధులను వెచ్చించేలా ప్రతిపాదనలు రూపొందించారు.