టీఎస్‌పీఈసెట్-2015 లో మార్పులు | Changes in tsps ecet -2015 | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఈసెట్-2015 లో మార్పులు

Published Mon, May 4 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

Changes in tsps ecet -2015

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2015 (టీఎస్‌పీఈసెట్-2015) నిర్వహణకు గతంలో ప్రకటించిన తేదీల్లో మార్పులు చేశారు. వివిధ కారణాల వల్ల ఈ నెల 20 నుంచి జరగాల్సిన ఫిజికల్ పరీక్షలు 25 నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభాకర్‌రావు తెలిపారు. హాల్‌టిక్కెట్లను ఈ నెల 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

తెలంగాణలో 1700 సీట్లకు ఇంత వరకు 9 వేల దరఖాస్తులు అందినట్లు చెప్పారు. డిగ్రీ అర్హతతో బీపీఈడీ కోర్సు, ఇంటర్ అర్హతతో యూజీ డీపీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హులు. అపరాధ రుసుముతో ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement