Tummala nageswarao
-
ఖమ్మంలో టీఆర్ఎస్ కు ఝలక్..!
సాక్షి,ఖమ్మం : ఎన్నికల్లో వినూత్న ఫలితాలను ఇచ్చే ఖమ్మం జిల్లా ఈ సారి తన పరంపరను కొనసాగించింది. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్కు మద్దతుగా ఉండగా ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని పది స్థానాలకుగాను 6 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాదించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భంగపడింది. జిల్లాలోని పాలేరులో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, కేసీఆర్‌కు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. 1950 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.సీనియర్ నాయకుడు , జిల్లాలో పలుకుబడి ఉన్న నాయకుడు అయిన తుమ్మల ఓటమి టీఆర్ఎస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాదించారు. 2014లో గెలిచిన కొత్తగూడెం స్థానాన్ని కూడా టీఆర్ఎస్ కోల్సోయింది. మదిర (మల్లుభట్టివిక్రమార్క), పినపాక (రేగకాంతారావు), ఇల్లందు శ్రీమతి బానోతు హరిప్రియా నాయక్), పాలేరు (కె ఉపేందర్ రెడ్డి), కొత్తగూడెం (వనమా వెంకటేశ్వరరావు), భధ్రాచలం (పోడెం వీరయ్య) లలో తన సత్తా చాటింది. ఆశ్వారావ్పేట (మచ్చా నాగేశ్వరరావు), సత్తుపల్లి (సండ్రవెంకట వీరయ్య) లలో టీడీపీ గెలవగా, ఖమ్మం (పువ్వాడ అజయ్)లో టీఆర్ఎస్ అభ్యర్ధి , వైరా (రాముల్‌నాయక్)లో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. నియోజకవర్గాలు అభ్యర్ధిపేరు పార్టీ పేరు పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు కాంగ్రెస్ ఇల్లందు (ఎస్టీ) బానోతు హరిప్రియా నాయక్ కాంగ్రెస్ ఖమ్మం పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ పాలేరు కె ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ మధిర (ఎస్సీ) మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ వైరా (ఎస్సీ) రాముల నాయక్ స్వతంత్ర అభ్యర్ధి సత్తుపల్లి (ఎస్సీ) సండ్రవెంకట వీరయ్య టీడీపీ కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ఆశ్వారావ్పేట (ఎస్టీ) మచ్చా నాగేశ్వరరావు టీడీపీ భధ్రాచలం (ఎస్టీ) పోడెం వీరయ్య కాంగ్రెస్ -
మీ దిక్కున్న చోట చెప్పుకోండి
తిరుమలాయపాలెం : ఇన్నాళ్లు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా జవాబు చెప్పారు. సోమవారం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభలో మాట్లాడారు. రైతాంగానికి సాగునీరు కల్పించడంతోపాటు, 24 గంటల విద్యుత్ అందించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేయడంతోపాటు రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద తరతమ భేదం లేకుండా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలైనా ప్రవేశ పెడతామని, కాంగ్రెస్ నాయకుల్లారా.. ‘మీ దిక్కు న్న చోట చెప్పుకోండని’ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశ పెట్టామని రానున్న రోజు ల్లో వరినాట్లు వేసే యంత్రాలను కూడా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరగకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములను భూ యాజమాన్య హక్కు పత్రాలు కల్పించేందుకు యావత్ అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లోని రచ్చబండల వద్దకు పంపించి పైసా ఖర్చులేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వ డం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. గత ంలో లాగా దొంగ పహాణీలు, పాస్ పుస్తకాలకు అవకాశం లేకుండా పాస్ పుస్తకాలు ఇస్తూ ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఆనాడు సాగునీరు కల్పించే అవకాశం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రజల ఆదరాభిమానాలతో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని, త్వరలోనే సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు కల్పిస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరుని అగ్రగామిగా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జెడ్పీ సీఈఓ నగేశ్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వెంకటపతిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మద్దినేని మధు, జిల్లా సభ్యులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్ పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు నిర్మాణం ఆగదు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముత్తారం : మల్లన్నసాగర్ నిర్మాణం సాఫీగా జరిగితే తమకు రాజకీయ సన్యాసమే శరణ్యమని భావించి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జలాశయం నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ సమీపంలోని మానేరునదిపై వంతనె నిర్మాణానికి ఆయన రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధూసూధనాచారి, ఎమ్మెల్యే పుట్ట మధుతో గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని పెంచడం, భూసేకరణపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే కన్నుకుట్టిన ప్రతిపక్ష నాయకులు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లి జీవో 123ను రద్దు చేయించారని ఆరోపించారు. భూసేకరణలో నిర్వాసితులకు నష్టం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పరిహారం చెల్లింపుల్లో అన్ని రకాలుగా న్యాయం చేయడం కోసమే ప్రభుత్వం జీవో 123 విడుదల చేసిందన్నారు. జీవో 123 రద్దుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
మహానాడుకు రేవంత్ డుమ్మా
తుమ్మల నాగేశ్వరరావు కూడా గైర్హాజరు హైదరాబాద్: టీడీపీ కార్యక్రమాల్లో ముందుండి హల్చల్ చేసే కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు తొలిరోజు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. మల్కాజిగిరి ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ ఆయన గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కొంత గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్న టీఆర్ఎస్.. టీడీపీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదేకాకుండా మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ ఇప్పటికే టీడీపీ జెడ్పీటీసీలతో ఓ అవగాహనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీలను తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్కు రేవంత్‌రెడ్డి మద్దతు తప్పనిసరైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు రేవంత్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహానాడు వంటి కార్యక్రమానికి రేవంత్ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. అలాగే ఖమ్మంలో అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావు కూడా మహానాడుకు గైర్హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రత్యర్థి వర్గీయుడైన నామా నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న బాబు.. తనను పక్కన పెట్టారని తుమ్మల భావిస్తున్నారు. కాగా మహానాడుకు గైర్హాజరు కావడానికి గల కారణాలపై ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా... ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం ఆలస్యమైందని, పెళ్లిళ్లకు హాజరు కావాల్సి ఉండడంతో మహానాడుకు రాలేకపోయినట్లు చెప్పారు. తాను రెండ్రోజులు ఢిల్లీలో చంద్రబాబుతోనే ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఇక తుమ్మల వ్యక్తిగత కారణాలతో మహానాడుకు వెళ్లలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తుమ్మల ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
మాణిక్‌రెడ్డి, తుమ్మల కార్లపైకి కాల్పులు
సాక్షి,హైదరాబాద్/జోగిపేట: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్రావు కార్లపైకి కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్న వరుస ఘటనలు కలకలం రేపాయి. అయితే వారిద్దరికీ ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా జోగిపేటలో మంగళవారం టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి హాజరైన మాణిక్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా రాత్రి 7.15 ప్రాంతంలో ముత్తంగి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కొల్లూరు గ్రామం వద్దకు చేరుకునే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారులో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో భయపడిన వారు తమ వాహనాన్ని పక్కకు నిలిపి చూడగా వెనుక సీటులోని అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. ఈ విషయమై మాణిక్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ... అతివేగంగా పెద్ద శబ్దంతో అద్దాల నుంచి దూసుకుపోయిందని, అది తప్పకుండా బుల్లెటే అయి ఉంటుందన్నారు. ఈ ఘటనపై తాను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ విజయకుమార్‌ను వివరణ అడగ్గా ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల సంఘటన ఏదీ జరగలేదన్నారు. మరోవైపు అదే స్థలంలో మరికొద్ది సేపట్లోనే ఖమ్మం టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్రావు ప్రయాణిస్తున్న కారుపై కూడా దుండగులు కాల్పులు జరిపారు. తుమ్మల తన కుమార్తె ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఆయనకు ఏ ప్రమాదం జరగనప్పటికీ, కారులోని మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై తుమ్మల పీ.ఏ. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.